delta airlines plane
-
విమానం ఇంజిన్ లోపలికి లాగేసింది!
హూస్టన్: ఊహించని ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్టీఎస్బీ)తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం. కాగా, గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవలే సదరు విమాన సంస్థకు రూ.12.80 లక్షల జరిమానా విధించారు. -
పైలట్ లేకుండానే.. విమానం ల్యాండింగ్!
విమానాన్ని కిందకు దించాల్సిన సమయానికి కాక్‌పిట్‌లో పైలట్ లేకపోతే ఏమవుతుంది? ఎయిర్‌పోర్టు వచ్చేసిందంటే ఎవరు లేకపోయినా దిగాల్సిందే కదా. మిన్నెపొలిస్ నుంచి లాస్ వెగాస్ వెళ్లే విమానం ఒకటి ఇలాగే పైలట్ లేకుండానే కిందకు దిగింది. కాక్‌పిట్ వెలుపల తలుపు ప్రమాదవశాత్తు మూసుకుపోయింది. దాంతో మెక్ కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అధికారులకు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం నుంచి ప్రమాదంలో ఉన్నామంటూ కాల్ వచ్చింది. పైలట్ బయట ఉండిపోయారని, కాక్‌పిట్ తలుపు తెరుచుకోవట్లేదని చెప్పారు. ఆ సమయానికి విమానంలో 168 మంది ప్రయాణికులున్నారు. అయితే.. వాళ్లకు ఏం జరిగిందన్న విషయం మాత్రం పూర్తిగా తెలియలేదు. తర్వాత మొత్తం అందరికీ కెప్టెన్ ఆ పరిస్థితిని వివరించారు. కో-పైలట్ లోపల ఉన్నారని, ఆయనకు తాను సూచనలిచ్చి, సురక్షితంగా కిందకు దించుతామని చెప్పారు. అన్నట్లుగానే విమానం సురక్షితంగా కిందకు దిగింది. ఎవరికీ గాయాలు కూడా కాలేదు. ఎండి-90 విమానాన్ని ఫస్ట్ ఆఫీసర్ జాగ్రత్తగానే దించారు. నిజానికి పైలట్‌కు తప్ప, ఫస్ట్ ఆఫీసర్‌కు విమానాన్ని కిందకు దించే కంట్రోల్స్ నియంత్రించే అధికారం ఉండదు. కానీ అత్యవసర పరిస్థితి కావడంతో.. ఇచ్చారు.