పైలట్ లేకుండానే.. విమానం ల్యాండింగ్!
విమానాన్ని కిందకు దించాల్సిన సమయానికి కాక్పిట్లో పైలట్ లేకపోతే ఏమవుతుంది? ఎయిర్పోర్టు వచ్చేసిందంటే ఎవరు లేకపోయినా దిగాల్సిందే కదా. మిన్నెపొలిస్ నుంచి లాస్ వెగాస్ వెళ్లే విమానం ఒకటి ఇలాగే పైలట్ లేకుండానే కిందకు దిగింది. కాక్పిట్ వెలుపల తలుపు ప్రమాదవశాత్తు మూసుకుపోయింది. దాంతో మెక్ కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అధికారులకు డెల్టా ఎయిర్లైన్స్ విమానం నుంచి ప్రమాదంలో ఉన్నామంటూ కాల్ వచ్చింది. పైలట్ బయట ఉండిపోయారని, కాక్పిట్ తలుపు తెరుచుకోవట్లేదని చెప్పారు.
ఆ సమయానికి విమానంలో 168 మంది ప్రయాణికులున్నారు. అయితే.. వాళ్లకు ఏం జరిగిందన్న విషయం మాత్రం పూర్తిగా తెలియలేదు. తర్వాత మొత్తం అందరికీ కెప్టెన్ ఆ పరిస్థితిని వివరించారు. కో-పైలట్ లోపల ఉన్నారని, ఆయనకు తాను సూచనలిచ్చి, సురక్షితంగా కిందకు దించుతామని చెప్పారు. అన్నట్లుగానే విమానం సురక్షితంగా కిందకు దిగింది. ఎవరికీ గాయాలు కూడా కాలేదు. ఎండి-90 విమానాన్ని ఫస్ట్ ఆఫీసర్ జాగ్రత్తగానే దించారు. నిజానికి పైలట్కు తప్ప, ఫస్ట్ ఆఫీసర్కు విమానాన్ని కిందకు దించే కంట్రోల్స్ నియంత్రించే అధికారం ఉండదు. కానీ అత్యవసర పరిస్థితి కావడంతో.. ఇచ్చారు.