కరోనా మహ్మమారి కారణంగా ఉద్యోగులు ఆఫీసులు విడిచి వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) అంటూ వారి ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఈ ట్రెండ్‌నే అనుసరిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగుంది గానీ ఈ క్రమంలో కొన్ని కంపెనీలు వింత రూల్స్‌ని తమ ఉద్యోగులపై రుద్దుతున్నాయి. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ కంపెనీ విచిత్రమైన కారణంతో తన ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించడంతో పరిహారం కూడా దక్కింది.
ఫ్లోరిడాకు చెందిన టెలిమార్కెటింగ్ కంపెనీ అయిన చేటు, తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలు బాటు ఇచ్చింది. అయితే ఇందులో ఓ మెలిక కూడా పెట్టింది. ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటల పాటు కెమెరాను ఆన్‌లో ఉంచాలని కోరింది. దీంతో పాటు వారి ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని కూడా షేర్ చేయాలని తెలిపింది. ఓ ఉద్యోగి మాత్రం వెబ్‌క్యామ్ ద్వారా తనపై ఎప్పటికప్పుడు కంపెనీ నిఘా ఉంచడం, అంతేకాకుండా తన ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను షేర్ చేయమని అడగడం ద్వారా ట్రాక్ చేయడం అతనికి ఇష్టపడలేదు. ఇది తన ప్రైవసీకి ఇబ్బందిగా ఉందని భావించి ఈ రూల్స్‌ని పక్కన పెట్టాడు. దీంతో నిబంధనలను పాటించని కారణంతో అతడిని కంపెనీ తొలగించింది.
ఈ అంశంపై ఆ ఉద్యగి కోర్టుకు వెళ్లగా.. కంపెనీ ఆదేశాలు సక్రమంగా లేవని, ఉద్యోగిని విధుల నుంచి తొలగించడానికి సరైన కారణాలు లేవని నెదర్లాండ్స్ కోర్టు స్పష్టం చేసింది. తొలగించిన ఉద్యోగికి 72,700 అమెరికన్ డాలర్లను (సుమారు రూ. 60 లక్షలు) డాలరలు చెల్లించాలని ఆదేశించింది. కాగా తమ ఉద్యోగులపై నిఘా ఉంచడానికి మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న ఏకైక సంస్థ చేటు మాత్రమే కాదు. Digital.com నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతించే 60 శాతం కంపెనీలు వారి ఉత్పాదకత, ఉద్యోగ కార్యకలాపాలపై పర్యవేక్షించేందుకు ఈ రకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి.
చదవండి: వామ్మో.. ఒక్కరోజే రూ. 3,000 కోట్ల బంగారం కొన్నారు, ఎందుకో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment