Web camera
-
వర్క్ ఫ్రమ్ హోమ్: కంపెనీ వింత రూల్స్.. ఈ ఉద్యోగి లక్ బాగుంది!
కరోనా మహ్మమారి కారణంగా ఉద్యోగులు ఆఫీసులు విడిచి వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) అంటూ వారి ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఈ ట్రెండ్‌నే అనుసరిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగుంది గానీ ఈ క్రమంలో కొన్ని కంపెనీలు వింత రూల్స్‌ని తమ ఉద్యోగులపై రుద్దుతున్నాయి. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ కంపెనీ విచిత్రమైన కారణంతో తన ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించడంతో పరిహారం కూడా దక్కింది. ఫ్లోరిడాకు చెందిన టెలిమార్కెటింగ్ కంపెనీ అయిన చేటు, తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలు బాటు ఇచ్చింది. అయితే ఇందులో ఓ మెలిక కూడా పెట్టింది. ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటల పాటు కెమెరాను ఆన్‌లో ఉంచాలని కోరింది. దీంతో పాటు వారి ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని కూడా షేర్ చేయాలని తెలిపింది. ఓ ఉద్యోగి మాత్రం వెబ్‌క్యామ్ ద్వారా తనపై ఎప్పటికప్పుడు కంపెనీ నిఘా ఉంచడం, అంతేకాకుండా తన ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను షేర్ చేయమని అడగడం ద్వారా ట్రాక్ చేయడం అతనికి ఇష్టపడలేదు. ఇది తన ప్రైవసీకి ఇబ్బందిగా ఉందని భావించి ఈ రూల్స్‌ని పక్కన పెట్టాడు. దీంతో నిబంధనలను పాటించని కారణంతో అతడిని కంపెనీ తొలగించింది. ఈ అంశంపై ఆ ఉద్యగి కోర్టుకు వెళ్లగా.. కంపెనీ ఆదేశాలు సక్రమంగా లేవని, ఉద్యోగిని విధుల నుంచి తొలగించడానికి సరైన కారణాలు లేవని నెదర్లాండ్స్ కోర్టు స్పష్టం చేసింది. తొలగించిన ఉద్యోగికి 72,700 అమెరికన్ డాలర్లను (సుమారు రూ. 60 లక్షలు) డాలరలు చెల్లించాలని ఆదేశించింది. కాగా తమ ఉద్యోగులపై నిఘా ఉంచడానికి మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న ఏకైక సంస్థ చేటు మాత్రమే కాదు. Digital.com నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతించే 60 శాతం కంపెనీలు వారి ఉత్పాదకత, ఉద్యోగ కార్యకలాపాలపై పర్యవేక్షించేందుకు ఈ రకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. చదవండి: వామ్మో.. ఒక్కరోజే రూ. 3,000 కోట్ల బంగారం కొన్నారు, ఎందుకో తెలుసా! -
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్..!
జియో తన కస్టమర్లకు తీపికబురును అందించింది. జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు ఏలాంటి వెబ్‌కెమెరా లేకుండా టీవీల్లో వీడియో కాలింగ్ చేసే సదుపాయాన్ని జియో తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. 'కెమెరా ఆన్ మొబైల్' అనే కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్ ఆప్షన్‌ను పొందవచ్చును. అందుకోసం జియోజాయిన్ అనే యాప్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను జియో పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకునే కస్టమర్లకు జియోఫైబర్‌వాయిస్‌తో వీడియోకాలింగ్ ఆప్షన్‌ను ఎనెబుల్ చేయవచ్చును. కస్టమర్లు తమ మొబైల్లోని జియోజాయిన్ యాప్ ద్వారా ల్యాండ్‌లైన్ నంబర్లకు కూడా వాయిస్‌కాల్స్ చేసుకోవచ్చును. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్‌ను జియోజాయిన్ యాప్‌లో నమోదు చేయాలి. జియోఫైబర్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, జియో జాయిన్ యాప్ సెట్టింగ్‌లలో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌తో వీడియోకాల్స్ చేసుకోవచ్చును. స్పష్టమైన వీడియో కాలింగ్ సేవల కోసం జియోఫైబర్ మోడమ్‌ను 5GHz Wi-Fi బ్యాండ్‌కి మార్చాల్సి ఉంటుంది. 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాలింగ్ ఫీచర్‌ను పొందవచ్చును, కానీ వీడియో కాలింగ్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చును. -
పోల్ కేక
అత్యధికం.. పెందుర్తిలో 92.1 అత్యల్పం.. కశింకోటలో 69.66 6.30 గంటలకేబారులు తీరిన ఓటర్లు ఓటింగ్ సరళిని వెబ్కెమేరా ద్వారా తెలుసుకున్న అధికారులు డీఎల్‌పురంలో ఓటేసి వృద్ధుని మృతి బ్యాలెట్‌పై సిరాతో అనకాపల్లి బీఆర్టీ కాలనీలో వివాదం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తొలిదశ ప్రాదేశిక పోరు ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనా..ఆ తర్వాత క్రమంగా వేగం పుంజుకుంది. 22 జెడ్పీటీసీలకు, 379 ఎంపీటీసీ స్థానాలకు సాయంత్రానికి అంచనాలకు మించి 83.2 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా పెందుర్తిలో 92.10 శాతం ఓటింగ్ జరగగా, అత్యల్పంగా కశింకోటలో 69.66 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఉదయం 6.30 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోలాహలం మొదలైంది. ఎండ తీవ్రత ఉన్నా.. యువ ఓటర్ల నుంచి పండుటాకుల వరకూ ఉత్సాహంగా తరలి వచ్చి కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ఇంటర్నెట్ సదుపాయమున్న 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి అధికారులు జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. రాష్ట్ర పరిశీలకుడు టి. కృష్ణబాబు నక్కపల్లి మండలపరిషత్ కార్యాలయం నుంచి వెబ్కెమేరా ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అలాగే 225 మంది వీడియోగ్రాఫర్లను నియమించి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును వీడియో తీయించారు. కొన్ని చోట్ల ఆలస్యంగా.. : 22 మండలాల్లో 2397 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కొని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ విధానం ద్వారా జరిగిన ఈ క్రతువులో ఎన్నికల సిబ్బంది ప్రారంభంలో కొంత ఇబ్బం దులు పడ్డారు. దీంతో పెందుర్తి మండలం కోట్నివానిపాలెం దాదాపు 45 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైంది. గొరపల్లిలో 7.30 అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అనేక కేంద్రాల్లో నిర్ణీత సమయం కంటే 10 నుంచి 20 నిమిషాలు ఆల స్యంగా పోలింగ్ మొద లైంది. ఆ తరువాత మాత్రం ఓటర్లు అధిక సంఖ్యలో కేంద్రాలకు వచ్చినప్పటికీ వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేశారు. నక్కపల్లి మండలం డిఎల్పురంలో కిల్లాడ నాగరాజు ఉరఫ్ కొండయ్య(68) ఓటేసి ఇంటికెళ్లాక మృతి చెందాడు. అనకాపల్లి మండలం బీఆర్టీకాలనీ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్‌పై సిరా అంటుకోవడం వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు అత్యత్సాహం కనబరిచి లాఠీచార్జి చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో ఏఎస్పీ పకీరప్ప అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎండను లెక్క చేయక.. : ఓటర్ల సంకల్పం ముందు ఎండ చిన్నపోయింది. ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత సైతం ఓటర్లను నిలువరించలేకపోయిం ది. మంటలు పుట్టించే వేడి వాతావరణంలో భారీగా లైన్లలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు సైతం ఇబ్బందులు పడుతూనే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ తొలి రెండు గంటలు భీమిలి(21 శాతం), ఎస్.రాయవరం(21 శాతం), రాంబిల్లి(18 శాతం) మినహా మి గిలిన మండలాల్లో కాస్త మందకొడిగానే జరిగింది. 9 గంటలకు 13.39 శాతం జరగగా...11 గంటలకు 30 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 47.30 శాతం నమోదైంది. ఒకే సమయంలో భారీగా కేంద్రాలకు రావడంతో క్యూలైన్లలో ఇబ్బం దులు పడ్డారు. వసతుల కల్పనలో అధికారుల వైఫల్యంతో అవస్థలకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు 62.70 శాతం, సాయంత్రం 5 గంటలకు మొత్తంగా 83.2 శాతం పోలింగ్ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఈ ఎన్నికల కోసం అధికారులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాకుండా అన్ని కేంద్రాల్లోను పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పెందుర్తి, భీమిలి మండలంలో కొన్ని కేంద్రాల వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఓటర్లు కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా ఎటువంటి కొట్లాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిలువరించగలిగారు. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండో దశ ఎన్నికలు ఈ నెల 11న 17 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్నాయి. సిబ్బంది గైర్హాజరుపై కలెక్టర్ కొరడా ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. ప్రాదేశిక ఎన్నికలకు 220 మంది గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణించారు. వారందరిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తొలివిడత పోలింగ్‌కు 1295 మంది పీవోలు, 3883 మంది ఏపీవో, 1295 మంది ఓపీవోలు మొత్తంగా 6473 మందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరిలో 220 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాలమేరకు విధులకు రాని వారి జాబితాను జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రమే అందజేశారు. వారందరిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. విశాఖ డివిజన్లోనివి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లోను, అనకాపల్లి డివిజన్‌వి ఏఎంఏఎల్ కళాశాలలోను, నర్సీపట్నం డివిజన్‌వి డాన్‌బాస్కో స్కూల్లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచారు. -
స్నానం చేస్తుండగా రహస్య చిత్రీకరణ
= కేబుల్ ఆపరేటర్‌ను పట్టుకున్న స్థానికులు = నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు బంజారాహిల్స్, న్యూస్‌లైన్: బాత్రూమ్లో వెబ్‌కెమెరా బిగించి మహిళలు స్నానం చేయడాన్ని దొంగచాటుగా చూస్తూ.. తన కంప్యూటర్లో బంధిస్తున్న ఓ నీచుడిని బస్తీవాసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్సై ఎ.అన్వేష్‌రెడ్డి కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణానికి చెందిన తిరునగరి రవిశంకర్ ప్రసాద్ (40) రెండేళ్లుగా బంజారాహిల్స్ రోడ్డునెం.10లోని సింగాడికుంట బస్తీతో పాటు పరిసర ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం సింగాడిబస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో కేబుల్‌కు సంబంధించిన కార్యాలయాన్ని తెరిచి.. అక్కడ ఓ కంప్యూటర్ను ఏర్పాటు చేశాడు. ఇదే ఇంట్లో ఉన్న మరో రెండు గదుల్లో తల్లీకూతురుతో పాటు ఇంకో జంట అద్దెకుంటున్నారు. ఈ మూ డు గదులకు కలిపి ఒకే బాత్రూం ఉంది. మూడు రోజుల క్రితం రవిశంకర్ బాత్రూంలో ఓ మూలకు కెమెరా బిగించాడు. వైర్ ద్వారా తన గదిలో ఉన్న కంప్యూటర్‌కు కనెక్షన్ ఇచ్చి మహిళలు స్నానం చేస్తుండగా కెమెరాలో బంధించడమే కాకుండా కంప్యూటర్లో చూస్తున్నాడు. పక్కగదిలో ఉండే యువతి (18) సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చి.. ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లింది. గది మూలన లైట్లు వెలుగుతూ ఆరుతూ ఓ పరికరం కనిపించడంతో ఆమె కంగారుపడింది. ఆ పరికరాన్ని బయటకు లాగి చూడగా కెమెరా అని తేలింది. మరింత లోతుగా పరిశీలించగా కెమెరాకు అమర్చిన వైర్ తమ పక్కనే అద్దెకుంటున్న కేబుల్ ఆపరేటర్ రవిశంకర్ ఇంట్లోకి అనుసంధానమై ఉంది. ఈ విషయాన్ని తన తల్లితో పాటు చుట్టుపక్కల వారికి తెలియజేసింది. వెంటనే వారంతా రవిశంకర్ గది తలుపులు తెరిచి చూడగా కంప్యూటర్లో యువతి నగ్న దృశ్యాలను చూస్తూ దొరికిపోయాడు. స్థానికులు అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354(సీ) నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.