
యశవంతపుర: కర్ణాటక బ్యాంక్ లీగల్ అఫీసర్ ఒకరు ఇంటిలో కాలిపోయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఉడుపిలో జరిగింది. రాజ్‌గోపాల్ సామగ (42) హైదరాబాద్‌లోని కర్ణాటక బ్యాంక్‌లో లీగల్ అధికారిగా పనిచేస్తూ నెల కిందటే మంగళూరుకు బదిలీ అయ్యారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కొడుకు ఉన్నారు. ఉడుపి కృష్ణమఠ సమీపంలోని వాదిరాజ రోడ్డులో ఉంటున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఇంటిలో నుంచి మంటలు, పొగలు రావడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి పరిశీలించగా పడక గదిలో శరీరం సగభాగం కాలిపోయి చనిపోయి ఉన్నాడు. లోపల నుంచి తాళం వేసుకొన్నట్లు గుర్తించారు. మొబైల్‌ఫోన్ పేలడమా, లేక ఆత్మహత్య చేసుకొన్నారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
(చదవండి: ప్రేమించాలంటూ వెంటపడి మరీ కత్తితో...)
Comments
Please login to add a commentAdd a comment