జీవిత బీమాలో అగ్రస్థాయి కంపెనీ అయిన ఎల్‌ఐసీ.. కొత్త పెన్షన్ ప్లాన్‌ను (ప్లాన్ నంబర్ 867) విడుదల చేసింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్ ప్లాన్. రెగ్యులర్‌గా ఈ ప్లాన్‌లో పొదుపు చేసుకుంటూ.. కాల వ్యవధి తర్వాత యాన్యుటీ ప్లాన్ తీసుకుని పెన్షన్ పొందొచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. ఒకేసారి చెల్లించే సింగిల్ ప్రీమియం ప్లాన్ లేదంటే రెగ్యులర్‌గా పాలసీ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
కనిష్ట, గరిష్ట ప్రీమియం పరిమితుల మధ్య పాలసీదారు తనకు అనుకూలమైన మొత్తాన్ని ప్రీమియంగా ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం రూపంలో చేసిన చెల్లింపులను నాలుగు ఫండ్స్‌లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది పాలసీదారు అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రీమియం అలోకేషన్ తదితర చార్జీలను ప్రీమియం నుంచి మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఆయా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పాలసీలో 5–15 శాతం మధ్య గ్యారంటీడ్ అడిషన్ కూడా చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment