భోపాల్: మధ్యప్రదేశ్‌లో రవాణాశాఖ మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఏకంగా రూ.500 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. బయటపడింది. గత నెలలో కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఇంట్లో ఉన్న పాడుబడిన వాహనంలో ఏకంగా రూ.11 కోట్ల రూపాయల నగదు, 52 కిలోల బంగారం, ఒక డైరీ బయటపడింది.
ఇంతేకాక శర్మ మొత్తంగా రూ.500 కోట్ల ఆస్తులు పోగేసినట్లు లోకాయుక్త పోలీసులు కనుగొన్నారు. శర్మ అవినీతి వ్యవహారం ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్లే ఈ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత జితూ పట్వారీ ఆరోపిస్తున్నారు.
ఈ విషయం సౌరభ్‌శర్మ డైరీ చూస్తే తెలుస్తుందన్నారు. తనకు శర్మ డైరీలోని ఆరు పేజీలు మాత్రమే దొరికాయని పట్వారీ చెప్పారు. ఈ ఆరోపణలపై బీజేపీ ధీటుగా స్పందించింది. గతంలో అధికారంలో ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా ఉండేదని కౌంటర్ ఇచ్చారు. అయితే కానిస్టేబుల్ సౌరభ్‌శర్మ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment