![Google India Is Countrys Most Attractive Employer Brand For 2021 - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/30/google.jpg.webp?itok=6PmbdFbl)
న్యూఢిల్లీ: ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. అమెజాన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియా తర్వాత స్థానాల్లో నిల్చాయి. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2021 సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన గూగుల్ ఇండియా అత్యధికంగా మార్కులు దక్కించుకున్నట్లు రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. టాప్ 10 ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్స్ జాబితాలో ఇన్ఫోసిస్(4వ స్థానం), టాటా స్టీల్(5), డెల్(6), ఐబీఎం(7), టీసీఎస్(8), విప్రో(9), సోని(10) ఉన్నాయి. 34 దేశాల్లో 6,493 కంపెనీలపై నిర్వహించిన ఈ సర్వేలో 1,90,000 మంది పాల్గొన్నారు.
ఉద్యోగం, కుటుంబానికి సమ ప్రాధాన్యం..
ఉద్యోగార్థుల ఆలోచనా ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచి్చనట్లు ఈసారి సర్వేలో వెల్లడైంది. వారు అటు ఉద్యోగ విధులు, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. వేతన ప్యాకేజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. ఈ అంశానికీ అంతే ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వే పేర్కొంది. దీని ప్రకారం.. ఆకర్షణీయమైన జీతభత్యాలతో పోలిస్తే (62%).. ఉద్యోగం, కుటుంబం మధ్య సమతౌల్యానికే(65%) ఉద్యోగార్థులు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైంది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణమైన పని వాతావరణం(61%), ఉద్యోగ భద్రత(61%) అంశాలు తర్వాత స్థానా ల్లో ఉన్నాయి. కంపెనీల ఎంపికలో ఉద్యోగార్థుల కొలమానాలు మారుతున్నాయని విశ్వనాథ్ తెలిపారు. తమకు విలువనిచి్చ, అండగా నిలవడంతో పాటు తమ అభిప్రాయాలు, లక్ష్యాలకు అనుగుణమైన సంస్థలనే ఉద్యోగార్థులు ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment