jewellery heist
-
బాత్రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు..
ముంబై: యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది ఓ పనిమనిషి. భర్తతో కలిసి బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించింది. వెండి, బంగారం, వజ్రాభరణాలు, నాణేలు.. ఇలా రూ.47 లక్షలు విలువచేసే నగలు ఎత్తుకెళ్లింది. మహారాష్ట్ర పూణెలోని కల్యాణి నగర్ కుమార్ సిటీలో డిసెంబర్ 26-27 మధ్యన ఈ ఘటన జరిగింది. యజమాని సూరజ్ అగర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పనిమినిషి ఊర్మిల హర్గే, ఆమె భర్త రాజ్‌పాల్ హర్గెను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.27లక్షలు విలువచేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా సొమ్ము కోసం ఆమెను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఘటన జరిగినప్పుడు యజమాని సూరజ్ అగర్వాల్ కుటుంబం ఇంట్లో లేదు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అలీబాగ్ వెళ్లారు. దీన్నే అదునుగా తీసుకున్న పనిమనిషి.. మొగుడితో కలిసి పథకం పన్ని చోరీకి పాల్పడింది. చివరకు కటకటాలపాలైంది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
కలిసికట్టుగా కొట్టేశారు.. సినిమాలోనూ ఇలాంటి దొంగతనం చూసుండరు !
రణస్థలం(శ్రీకాకుళం): ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి రెండు కేజీల వెండితో గుర్తు తెలియని వ్యక్తులు పరారయ్యారు. రణస్థలంలోని శ్రీ కనకదు ర్గా జ్యూయలర్స్ దుకాణంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. షాపు యజమాని కెల్ల జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు కలిసి దుకాణానికి ఆభరణాలు కొనేందుకని వచ్చారు. వెండి పట్టీలు, ఇతర వస్తువులను పావుగంట సేపు పరిశీలించారు. ఈలోగా ఓ మహిళ వెండి పట్టీలను పరిశీలించినట్లుగా నటించి చాకచక్యంగా రెండు కిలోల వెండిని లోదుస్తుల్లో పెట్టింది. పక్కనే ఉన్న వ్యక్తి మిగతా పట్టీలను సరిచేసి యజమానికి ఇచ్చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు జత పట్టీలు రూ. 4500, కాలి మట్టెలు రూ.500కు కొనుగోలు చేసి వెళ్లిపోయారు. వారు వెళ్లిన కొద్దిసేపటికి దుకాణం యజమానికి అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలు పరిశీలించగా వెండిని సదరు వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే పరిసర ప్రాంతాల వారికి తెలియజేయగా అప్పటికే వారు పరారయ్యారు. జె.ఆర్.పురం ఏఎస్ఐ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది -
స్పెయిన్‌లో రూ. 189 కోట్ల వాచీల చోరీ, 17 మంది అరెస్ట్
స్పెయిన్‌లో జరిగిన 189 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు వాచీల చోరీ కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు. స్పెయిన్ చరిత్రలో ఇదే అతిపెద్ద బంగారు వస్తువుల దొంగతనమని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో 11 మంది చైనా జాతీయులున్నారు. గతేడాది చివర్లో దొంగలు మాడ్రిడ్‌లోని ఓ కంపెనీలోకి చొరబడి 1700 స్విస్ బ్రాండ్ వాచీలను దోచుకెళ్లారు. దొంగల నుంచి 300 విలువైన వాచీలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.