
ఏడంతస్తులపై వేలాడుతూ మహిళ.. ఓనర్ క్రూరత్వం!
సాటివారు కష్టాల్లో ఉంటే ఎవరైనా అయ్యోపాపం అంటారు. చేతనైనా సాయం చేసేందుకు ముందుకొస్తారు. కానీ తన పనిమనిషి ప్రమాదవశాత్తు ఏడంతస్తుల భవనంపైనున్న కిటికికి వేలాడుతున్నా.. ఆమె యజమానికి కనికరం కలుగలేదు. తనను కాపాడాలని ఎంత వేడుకున్నా.. పట్టుకోమని బాధితురాలు ఎంతగా అర్థించినా.. ఆమె పట్టించుకోలేదు సరికదా.. ఏడంతస్తుల భవనంపైనుంచి వేలాడుతూ.. ప్రాణభయంతో కేకలు పెడుతున్న పనిమనిషిని తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో పెట్టింది. ఈ భయంకరమైన ఘటన కువైట్‌లో జరిగింది.
ప్రమాదవశాత్తు ఇథియోపియాకు చెందిన తన పనిమనిషి ఏడంతస్తుల భవనంపై కిటికికి వేలాడుతుండగా.. ఆమె యజమాని మాత్రం సాయం చేయడానికి బదులు ఆ ఘటనను వీడియో తీసింది. ఎలాంటి సాయం అందకపోవడంతో ఆమె ఏడంతస్తుల భవనంపైనుంచి దమ్మున కిందపడింది. అదృష్టం బాగుండి ఆమె కిటికిలకు అమర్చే రేకులపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సోషల్ మీడియా ద్వారా వెలుగుచూసిన ఈ ఘటనపై కథనాలు రావడంతో కువైట్ మానవహక్కుల సంఘం స్పందించింది. మరోవైపు క్రూరంగా వ్యవహరించిన యాజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1/ Shocking vid of Ethiopian domestic worker screaming 4 help just before falling 7floors down. Her female Kuwaiti employer simply films her pic.twitter.com/4byHSKVoNa
— Jenan Moussa (@jenanmoussa) 31 March 2017
4/ Here is a video of the Ethiopian lady after the fall. There are reports that the employer is under investigation. pic.twitter.com/tQ0ZMJeN0g
— Jenan Moussa (@jenanmoussa) 31 March 2017