
ప్రతీకాత్మక చిత్రం
చాంద్రాయణగుట్ట( హైదరాబాద్): తన ఇంట్లో పనిచేస్తున్న ఓ యువతికి సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌లో షేర్ చేస్తున్న యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ యువతి (19) స్థానికంగా ఓ ఇంట్లో పనులు చేస్తోంది. ఇంటి యజమాని కుమారుడు (23) గత కొన్ని రోజులుగా ఆమెను ప్రేమ పేరుతో వేధించసాగాడు.
అంతటితో ఆగకుండా ఆమె ఫొటోలను తీసి తన వాట్సాప్‌లో పెట్టుకోవడంతో పాటు షేర్ చేస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
విజయనగర్‌కాలనీ: వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఓవ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనయ్య తెలిపిన వివరాల ప్రకారం...టోలిచౌకిలో నివసించే మహ్మద్ సాబెర్ (36) భార్య నవ్యా సుల్తానా ఆదివారం పనిపై ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్‌కు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి టోలిచౌకిలోని తన ఇంటికి వెళ్తుండగా మెహిదీపటపట్నం పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం. 35 వద్ద వెనుకనుంచి ఢీకొట్టి సాబెర్ తలపై నుంచి లారీ చక్రం వెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment