తన నెల జీతం పూర్తిగా ఇవ్వలేదని ఓ యువకుడితో పనిమనిషి వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తనకు రూ 1800 చెల్లించలేదని మహిళ మరాఠీలో వాదిస్తుండగా, పూర్తి జీతం ఇచ్చామని యువకుడు చెబుతున్నారు. తాము రూ 500 నోట్లు మూడు, ఒక రూ .రెండు వందల నోటు, ఒక వంద నోటును ఇచ్చామని మొత్తం 1800 రూపాయలు చెల్లించామని అతడు చెబుతుండగా, ఆమె తనకు 1500 రూపాయలు, 300 రూపాయలు ఇచ్చారు కానీ 1800 రూపాయలు పూర్తిగా ఇవ్వలేదని వాదించారు. ఎంత చెప్పినా ఆమెకు అర్ధం కాకపోవడంతో కాలిక్యులేటర్‌లో లెక్క వేసి చూపినా మహిళ సమాధానపడలేదు.
‘వీరు పనిమనిషికి 1800 రూపాయలు చెల్లించారు..అయితే వారు రూ 1500 రూ 300లే ఇచ్చారని మహిళ చెబుతోంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. 1800 రూపాయల నోటు విడుదల చేస్తే సమస్య పరిష్కారమవుతుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. చదవండి : స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్‌గేట్స్
These guys paid their house help 1800 bucks but she’s saying they paid her 1500 and 300 😫 pic.twitter.com/KTwGW1NyQW
— Daaktarni (@DrVW30) August 30, 2020
Comments
Please login to add a commentAdd a comment