Woman 'Jiggle Jiggle Dance' in Delhi Metro, Video Viral on Social Media - Sakshi
Sakshi News home page

మెట్రో రైలులో యువతి ‘జిగల్‌’ డ్యాన్స్‌.. సోషల్‌ మీడియా షేక్‌

May 31 2022 12:47 PM | Updated on May 31 2022 12:59 PM

Woman Jiggle Jiggle Dance In Delhi Metro - Sakshi

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు కొందరు నెటిజన్లు వినూత్నంగా థింక్‌ చేస్తుంటారు. ఇందుకోసం స్పెషల్‌ ఫీట్స్‌, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటాయి. ఈ కేటగిరికి చెందిన ఓ వీడియో తాజాగా ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇటీవలే వచ్చిన జిగల్‌ జిగల్‌ డ్యాన్స్‌ ఛాలెంజ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కొందరు నెటిజన్లు ఈ డ్యాన్స్‌పై ఫ్రెండ్స్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నారు. తన ఫ్రెండ్‌ విసిరిన ఛాలెంజ్‌ను ఆక్సెప్ట్‌ చేసిన ఢిల్లీకి చెందిన ఓ యువతి ట్రెండీగా ఆలోచించింది. ఢిల్లీ మెట్రో రైలులో జిగల్‌ జిగల్‌ డ్యాన్స్‌ చేసి.. ఛాలెంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

కాగా, ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా క్షణాల్లో లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. దీంతో వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక, జిగల్‌ జిగల్‌ డ్యాన్స్‌పై ప‍్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్‌ నడుస్తోంది. వివిధ దేశాలకు చెందిన అమ్మాయిలు కూడా డ్యాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఆమె వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. మెట్రోలో డ్యాన్స్‌ చేయాలంటే ఎంతో కరేజ్‌ ఉండాలి అంటూ కామెంట్‌ చేశాడు. 

ఇది కూడా చదవండి: నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్న హైబ్రిడ్‌ భరతనాట్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement