
ప్రయాణాల్లో గర్భంతో ఉన్న మహిళను చూస్తే ఎవరికైనా లేచి సీటు ఇవ్వాలనిపిస్తుంది. నిజానికి అది కనీస ధర్మం కూడా. కానీ చాలామంది యువకులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లను, అందులోనూ గర్భిణీలను గౌరవించాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
ఒక బస్సులో గర్భిణీ స్వయంగా వచ్చి సీటు అడిగినా ఇవ్వలేదు ఒక యువకుడు. సరికదా... అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఒళ్ళో కూచోమన్నట్టుగా సైగ చేశాడు. దీంతో వెనక కూర్చున్న పెద్దాయనకు ఒళ్లు మండింది. వీడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్నాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా..వెంటనే లేచి ఆ మహిళను తన సీట్లో కూర్చోమని చెప్పి, ఠపీమని ఆ పోరగాడి ఓళ్లో కూచున్నాడు. అటు వాడి తిక్క తీరింది. లబోదిబోమన్నాడు. దీంతో ఆ మహిళతో సహా, బస్సులోని వాళ్లందరూ నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేలకొద్దీ కామెంట్లు, రీషేర్లతో నెట్టింట్ వైరల్‌గా మారింది.
— Figen (@TheFigen_) June 19, 2024
తిక్క తీరింది బిడ్డకు.. లేకపోతే.. ఏంటా యాటిట్యూడ్ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు. ‘బుర్రా..బుద్ధీ ఉండాలి కదరా! మారండిరా’ అని మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే కోటి 1.30 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుఉంది.
Comments
Please login to add a commentAdd a comment