సాక్షి, బెంగళూరు: ఇళ్లల్లో పని మనుషులుగా చేరి యజమానులకు నమ్మకం కలిగించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను హెణ్ణూరు పోలీసులు సోమవారం చేశారు. వీరి వద్ద నుంచి 250 గ్రాముల బంగారు నగలు, 100 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీసీపీ డాక్టర్ బీమాశంకర్‌గుళేద్ వివరాలు వెల్లడించారు. హెణ్ణూరు అరవింద అనే వ్యక్తి ఇంట్లో పనిచేస్తున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన సుబ్బలక్ష్మీ అనే మహిళ నమ్మకంగా ఉంటూ బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లిందని ఫిర్యాదు చేశారు. హెణ్ణూరు సీఐ వసంత్‌కుమార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ బృందం సభ్యులు ముంబై వెళ్లి సోమవారం మహాదేవి, ప్రియాంకా రాజేశ్, వనితలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన మహిళలు ఎఫ్‌బీలో రెఫర్ హౌస్ మెయిడ్స్ అనే పబ్లిక్ గ్రూప్‌లో ఖాతాలు తెరిచి పనిమనుషులు అందుబాటులో ఉన్నారని పోస్టు పెట్టారు. దీంతో అరవింద్ అనే వ్యక్తి ఇంటికి వచ్చిన మహిళ నకిలీ ప్రూఫ్‌తో వచ్చినట్లు తేలింది. ఆమె అసలు పేరు ప్రియాంక కాగా సుబ్బులక్ష్మీ అని చెప్పుకుంది. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు ముంబై వెళ్లి అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ముంబైలో పలు ఇళ్లల్లో చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులకు పట్టుబడిన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment