ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పోతో పాటు నిర్వహిస్తున్న 'ది బ్యాటరీ షో ఇండియా' మొదటి ఎడిషన్ సందర్భంగా ఈ ఆవిష్కరణ జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్ ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ దశకు చేరుకుందని, వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ బ్యాటరీలు ఒక ఛార్జ్‌తో 70 నుంచి 75 కిమీ రేంజ్ అందించనున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా బ్యాటరీలను సౌరశక్తిని ఉపయోగించి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
రిలయన్స్ బ్యాటరీలను కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా గృహోపకరణాలకు కూడా ఉపయోగించుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. నిజానికి వాహన వినియోగదారుడు ఛార్జింగ్ అయిపోగానే బ్యాటరీ మార్చుకోవాలి, కావున బ్యాటరీని ఇంట్లో లేదా ఆఫీసులో కూడా మార్చుకోవచ్చు. ఈవీ స్టేషన్స్‌లో ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని ఇచ్చేసి ఫుల్ ఛార్జ్ బ్యాటరీని పొందవచ్చు. ఈ బ్యాటరీ మార్చుకోవడానికి కేవలం ఆరు సెకన్లు సమయం పడుతుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
రిలయన్స్ ఎనర్జీ సొల్యూషన్‌లో సోలార్ ప్యానెల్‌లు, మీటర్లు, ఇన్వర్టర్, క్లౌడ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయని అధికారి తెలిపారు. అంతే కాకుండా టూ వీలర్స్ కోసం ఆటోమేటెడ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ (OE) తయారీదారులతో కలిసి పని చేస్తున్నట్లు, త్వరలోనే అనుకూలమైన మోడల్స్ వస్తాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment