టీఏ రామలింగం సీటీవో, బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. 2022 ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం మన రహదారులపై 13 లక్షల పైచిలుకు ఈవీలు ఉన్నాయి. మూడేళ్లుగా వీటి అమ్మకా ల వృద్ధి వార్షికంగా 130 శాతంగా ఉంటోంది. వీటిల్లో అత్యధికంగా త్రిచక్ర రవాణా వాహనాలు, తర్వాత స్థానంలో ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నా యి. అయితే మిగతా వాటి తరహాలోనే విద్యుత్ వాహనాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి..
► ఒక్క సారి చార్జి చేస్తే వాహనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనేది ఒక సవాలు.
► ఈవీలు విజయవంతం కావాలంటే చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాలు భారీగా అవసరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పురోగమన దశలోనే ఉన్నాయి.
► ఈవీ బ్యాటరీ ఖరీదు.. వాహనం రేటులో దాదాపు సగం దాకా ఉంటోంది. కాబట్టి, బ్యాటరీ దీర్ఘాయుష్షు, వారంటీ, రీసేల్ విలువ గురించి చాలా సందేహాలే ఉన్నాయి.
► ఓవర్ చార్జింగ్ వల్ల వాహనంలో మంటలు చెలరే గితే పరిస్థితి ఏమిటనే భయాలూ ఉన్నాయి. అగ్నిప్రమాదాలకు దారి తీస్తే థర్డ్ పార్టీకి వాటిల్లే ఆస్తి, ప్రాణ నష్టానికి లయబిలిటీపైనా సందేహాలు ఉన్నాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక మోటరు బీమా పాలసీ దశాబ్దాల కిందట రూపొందింది. అప్పుడు ఈవీలు, హైబ్రీడ్ వాహనాల ఉనికి లేదు. అయితే, మారే మార్కెట్ అవసరాలు, సమయానికి తగినట్లు కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ నియంత్రణ సంస్థ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగానే బీమా సంస్థలు కూడా పైన పేర్కొన్న పలు సవాళ్లను పరిష్కరించగల యాడ్–ఆన్‌లను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల కోసం బీమా తీసుకునేటప్పుడు కొనుగోలుదారు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
► బ్యాటరీకి విడిగా కవరేజి ఉందా? ఒకవేళ చార్జింగ్ చేసేటప్పుడు వరద లేదా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినట్లయితే బ్యాటరీ పూర్తి నష్టానికి పాలసీలో కవరేజీ ఉండాలి.
► ప్లాస్టిక్, లోహాలు, గాజు లేదా ఫైబర్ ఏవైనా భాగాలు అన్నింటికీ జీరో డిప్రిసియేషన్ కవరేజీ ఉందా అన్నది చూసుకోవాలి.
► ఈవీ వల్ల థర్డ్ పార్టీ ప్రాపర్టీ ధ్వంసమైనా, వారికి గాయాలైనా ఈవీ యజమానిపై దావా వేస్తే పరిహారంపరమైన సమస్యలు ఎదురవకుండా విడి గా లయబిలిటీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి.
► గోడలో బిగించిన చార్జర్‌కు, చార్జింగ్ చేసే కేబుల్‌కు విడిగా కవరేజి ఉందా లేదా. ఈ భాగాలన్నీ వాహనంలో బిగించి ఉండవు కాబట్టి, వాటి గురించి నిర్దిష్టంగా తెలియపరుస్తూ కవరేజీ కల్పించడం ముఖ్యం.
► ఓఈఎం (వాహనం తయారీ సంస్థ) చేసే ప్రామాణికమైన ఫిట్టింగ్స్‌కు అదనంగా కారులో బిగించిన ఇన్ఫోటెయిన్‌మెంట్ గ్యాడ్జెట్లు, మ్యూ జిక్ సిస్టమ్‌లు, ఇతరత్రా ఏవైనా గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కవరేజీ ఉందో లేదో చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment