బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా.. | Sakshi
Sakshi News home page

బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..

Published Tue, Mar 19 2024 9:18 AM

Why Companies Introduce Non Removable Batteries In Mobile - Sakshi

నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్‌ ఫీచర్‌తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్‌మొబైల్‌, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్‌ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్‌ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్‌ఆన్‌ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్‌లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్‌ ‍బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. 

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్‌ రిమువెబుల్‌ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్‌ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్‌పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్‌ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ప్రీమియం డిజైన్‌
స్మార్ట్‌ఫోన్‌లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్‌ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్‌ను మరింత స్లిమ్‌గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్‌ను గ్లాస్ / మెటల్‌తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్‌ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. 

వాటర్‌, డస్ట్‌ ప్రూఫ్‌ 
ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్‌లో ఎలాంటి గ్యాప్‌లు లేకుండా అంతర్గత సీలింగ్‌ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి.

ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే..

అదనపు ఫీచర్లు
ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్‌ రిమువెబుల్‌ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్‌కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్‌ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement