రిస్కులో బ్యాటరీ రీసైక్లింగ్‌ పరిశ్రమ | Battery recycling industry faces risks due to underpriced recycling system | Sakshi
Sakshi News home page

రిస్కులో బ్యాటరీ రీసైక్లింగ్‌ పరిశ్రమ

Published Sat, Oct 26 2024 8:00 AM | Last Updated on Sat, Oct 26 2024 9:10 AM

Battery recycling industry faces risks due to underpriced recycling system

న్యూఢిల్లీ: రీసైక్లింగ్‌ వ్యవస్థలో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బ్యాటరీ రీసైక్లింగ్‌ పరిశ్రమ పలు రిస్కులు ఎదుర్కొంటోందని మెటీరియల్‌ రీసైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఆర్‌ఏఐ)  తెలిపింది. పరిశ్రమలోకి మోసపూరిత వ్యాపార సంస్థల ఎంట్రీతో పాటు పర్యావరణంపరంగా విపత్తులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వివరించింది.

ప్రస్తుత ధర విధానం వల్ల లిథియం, కోబాల్ట్‌ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై భారత్‌కు సుమారు 1 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ మారకంపరంగా నష్టం వాటిల్లుతోందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో లిథియం రీసైక్లింగ్‌కు ఫ్లోర్‌ ధరను పెంచాలని, నిబంధనలు పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంఆర్‌ఏఐ వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement