హైడ్రోజన్‌ సెల్‌.. ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు | Toyota And Woven Planet Develops Portable Hydrogen Cell | Sakshi
Sakshi News home page

హైడ్రోజన్‌ సెల్‌.. ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు

Published Sun, Sep 11 2022 9:25 AM | Last Updated on Sun, Sep 11 2022 9:34 AM

Toyota And Woven Planet Develops Portable Hydrogen Cell - Sakshi

హైడ్రోజన్‌ సెల్‌– దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీని ద్వారా విద్యుత్తును పొందవచ్చు. ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా అనుబంధ సంస్థ ‘వోవెన్‌ ప్లానెట్‌’ చిన్నసైజు సిలిండర్‌లాంటి ఈ హైడ్రోజన్‌ సెల్‌కు రూపకల్పన చేసింది. దీని బరువు 5 కిలోలు మాత్రమే! ఈ హైడ్రోజన్‌ సెల్‌ గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇంధనం అయిపోయాక వీటిని రీఫిల్‌ చేసుకోవచ్చు.

ఈ హైడ్రోజన్‌ సెల్స్‌తో వాహనాలకు, విద్యుత్‌ పరికరాలకు, ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసుకోవచ్చు. ప్రత్యేకించి విహారయాత్రకు వెళ్లేవారికి ఈ సెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని హైడ్రోజన్‌ సెల్స్‌ మరింతగా వినియోగంలోకి వస్తే, ఉద్గారాల సమస్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవి అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్‌ టెక్నిక్‌ మైండ్‌బ్లోయింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement