సాక్షి, సిటీబ్యూరో: భద్రత ప్రమాణాలే ప్రాముఖ్యతగా వినూత్న సాంకేతికతతో తయారు చేసిన దేశంలోనే మొట్ట మొదటి శక్తివంతమైన సోడియం అయాన్ బ్యాటరీలను ‘సోడియం ఎనర్జీ సంస్థ’ విడుదల చేసింది. బుధవారం నగరంలోని మెర్క్యూరీ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సోడియం ఎనర్జీ సహ–వ్యవస్థాపకులు బాల పచియప్ప బ్యాటరీలను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న లెడ్ యాసిడ్, లిథియం అయాన్ బ్యాటరీల కంటే సోడియం అయాన్ బ్యాటరీలు అధిక శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయన్నారు. 2026 నాటికి విద్యుత్ నిల్వల అవసరం 5 రెట్లు పెరుగుందని, అధిక జనాభా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారన్నారు.
భద్రత, నాణ్యత, వేగవంతమైన చార్జింగ్‌తో ఈ బ్యాటరీలు అధునాతన సేవలందిస్తాయని పేర్కొన్నారు. లిథియం కన్నా సోడియం 500 రెట్లు అధిక సామర్థ్యాలతో పర్యావరణానికి హాని లేకుండా రికవరీ, రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్నారు. అనంతరం సోడియం అయాన్ బ్యాటరీలతో నడిచే వాహనాల పనితీరును ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment