
విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. భారత్ కూడా త్వరలోనే పెట్రోలు, డీజిల్ కార్లను నిషేధిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జపనీస్ సంస్థ తొషీబా బ్యాటరీ టెక్నాలజీలో కీలక పురోగతి సాధించింది. నిమిషాల్లోనే రీచార్జ్ అవడంతోపాటు ఒకసారి చార్జ్ చేసుకుంటే మూడింతలు ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాయి. తొషీబా తాజాగా టైటానియం– నియో యం ఆక్సైడ్‌ను ఆనోడ్‌గా వాడుతూ కొత్త బ్యాటరీని అభివృద్ధి చేసింది. వీటిలో లిథి యం అయాన్లు ఎక్కువగా నిక్షిప్తమయ్యేం దుకు తద్వారా మైలేజీ పెరిగేందుకు మార్గం సుగమమైంది.
కొత్త టెక్నాలజీతో తయారు చేసిన 50 ఆంపియర్ హవర్స్ బ్యాటరీ విద్యుత్ నడిచే కారులో ఉపయోగిస్తే అది దాదాపు 320 కి.మీ దూరం ప్రయాణించగలదని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ ఒసము హోరీ చెప్పారు. పైగా కొత్త బ్యాటరీలను ఆరు నిమిషాల్లో రీచార్జ్ చేసుకోవడమే కాక, 5,000 సార్లు రీచార్జ్ చేసుకోవచ్చంటున్నారు. 2019 నాటికి ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తాయని అంచనా.