Toshiba
-
అమెజాన్‌లో రూ.96 వేల తోషిబా ఎయిర్ కండిషనర్ రూ.6 వేలకే!
అప్పుడప్పుడు ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక సేల్ పేరుతో చాలా తక్కువ ధరకే ప్రొడక్టులను సేల్ చేస్తుంటాయి. కానీ, ఈ సారి ఎటువంటి ఆఫర్ లేకున్నా అమెజాన్, ఈ కామర్స్ వెబ్ సైట్ సోమవారం రూ.96,700 తోషిబా ఎయిర్ కండిషనర్(ఎసీ)ను 94 శాతం డిస్కౌంట్ తో రూ.5900కు తీసుకొచ్చింది. అయితే, అమెజాన్‌లో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా రూ.5,900కు తోషిబా 2021 రేంజ్ స్ప్లిట్ సీస్టమ్ ఎసీని లిస్టింగ్ అయినట్లు తెలుస్తోంది. దీని అసలు ధర రూ.96,700, కొంత మంది కస్టమర్లు ఈ ఆఫర్ కింద దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. జూలై 5న అమెజాన్ లో ఈ ఎయిర్ కండిషనర్ అసలు ధర రూ.96,700పై రూ.90,800 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం అమెజాన్ అదే తోషిబా 1.8 టన్నుల 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీని రూ.59,000కి లభిస్తుంది. దీని అసలు ధర కంటే 30 శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు లభిస్తుంది. ఇన్వర్టర్ ఎసీ కొన్ని ప్రత్యేక ఫీచర్లలో యాంటీ బాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీహ్యూమిడిఫైయర్ ఉన్నాయి. తోషిబా ఎసీ కంప్రెసర్, పీసీబీలు, సెన్సార్లు, మోటార్స్, ఎలక్ట్రికల్ పార్టులపై 9 సంవత్సరాల అదనపు వారెంటీతో పాటు 1 సంవత్సరం అదనపు వారెంటీని కూడా లభిస్తుంది. ఎసీ 3.3 సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో(ఎస్ఈఆర్)ని కలిగి ఉంది. అమెజాన్ ఇలా తక్కువ ధరకే విలువైన ఉత్పత్తులను తీసుకొని రావడం ఇది మొదటిసారి కాదు. 2019 ప్రైమ్ డే సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం రూ.9 లక్షల విలువైన కెమెరా గేర్ ను రూ.6,500కు విక్రయించింది. ఒక్కసారిగా ఈ ఆఫర్ గురుంచి తెలుసుకోవడంతో దానిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడ్డారు. ఈ లోపాన్ని గుర్తించిన అమెజాన్ ఆ ఆఫరా నిలిపివేసింది. జూలై 5న కూడా అమెజాన్‌లో తలెత్తిన చిన్న లోపం వల్ల రూ.59,000 లభించే ఏసీ రూ.5,900కి లభించింది. -
తోషిబా సంచలన నిర్ణయం
టోక్యో: దిగ్గజ కంపెనీ తొషిబాలో అవినీతి, కుట్రకు ఎట్టకేలకు తిరుగుబాటుతో చెక్ పెట్టారు షేర్ హోల్డర్లు. తొషిబా కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఒసామూ నగయమా(74)ను అర్థాంతరంగా గద్దె దించేశారు. శుక్రవారం సాయంత్రం ఒసామూ రీ ఎలక్షన్ కోసం జరిగిన ఓటింగ్.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ఆపై ఒసామూను చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కావాలనే ఆలస్యంగా ప్రకటించింది బోర్డు. జపాన్ ప్రభుత్వంతో కుమ్మక్కై.. ప్రైవేట్ ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బతీస్తున్నాడని, అధికారులతో కిందటి ఏడాది బోర్డు నామినీల ఓటింగ్‌పై ప్రభావం చూపెట్టాడనేది ఒసామూ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు. ఈ కుంభకోణం బయటపడ్డప్పటికీ ఆయన్నే కొనసాగించాలని పలువురు ఇన్వెస్టర్లు మద్దతు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలగింపుపై బోర్డు తొందరపాటు ప్రదర్శించలేదు. అయితే శుక్రవారం సాధారణ సమావేశాల సందర్భంగా ఉన్నపళంగా ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒసామూను గద్దె దించుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒసామూ మద్దతుదారులు మాత్రం.. సంక్షోభ సమయంలో ఆయన పనితీరును చూసైనా మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహారిస్తామనే సంకేతాల్ని బయటి ఇన్వెస్టర్లకు తోషిబా పంపినట్లయ్యింది. ఇక సంస్కరణలేనా? జపాన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఈ నిర్ణయం ఒక మైలు రాయి అని, ముందు ముందు ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాగా, గతంలో ఒసామూ రాజీనామాను డిమాండ్ చేసిన తొషిబా అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ భాగస్వామి 3డీ కంపెనీ తాజా పరిణామాలను స్వాగతించింది. ఇక చైర్మన్ పదవికి ప్రతిపాదించిన పేర్లను పక్కనపెట్టిన బోర్డు.. తాత్కాలిక చైర్మన్‌గా తొషిబా సీఈవో సతోషి సునాకవా కొనసాగనున్నారు. సతోషి ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని సంస్కరణలతో కంపెనీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బోర్డు తీర్మానం చేసుకుంది. కాగా, ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న నోబువాకి కురుమటాని కూడా అవినీతి ఆరోపణల విమర్శల నేపథ్యంలో రాజీనామా చేశాడు. జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు తోషిబా బ్రాండ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హోం ఎలక్ట్రికల్స్ గూడ్స్ నుంచి న్యూక్లియర్ పవర్ స్టేషన్ రంగంలోనూ తోషిబా ఒకప్పుడు రారాజుగా ఉండేది. అయితే మేనేజ్మెంట్ తప్పిదాలు, సరైన పాలనా-పర్యవేక్షణ లేకపోవడమనే కారణాలు.. మార్కెట్‌ను కోల్పోతూ వస్తోంది. చదవండి: దెబ్బకు 32 కోట్ల డాలర్ల నష్టం -
మూడింతల శక్తిమంతమైన బ్యాటరీ
విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. భారత్ కూడా త్వరలోనే పెట్రోలు, డీజిల్ కార్లను నిషేధిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జపనీస్ సంస్థ తొషీబా బ్యాటరీ టెక్నాలజీలో కీలక పురోగతి సాధించింది. నిమిషాల్లోనే రీచార్జ్ అవడంతోపాటు ఒకసారి చార్జ్ చేసుకుంటే మూడింతలు ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాయి. తొషీబా తాజాగా టైటానియం– నియో యం ఆక్సైడ్‌ను ఆనోడ్‌గా వాడుతూ కొత్త బ్యాటరీని అభివృద్ధి చేసింది. వీటిలో లిథి యం అయాన్లు ఎక్కువగా నిక్షిప్తమయ్యేం దుకు తద్వారా మైలేజీ పెరిగేందుకు మార్గం సుగమమైంది. కొత్త టెక్నాలజీతో తయారు చేసిన 50 ఆంపియర్ హవర్స్ బ్యాటరీ విద్యుత్ నడిచే కారులో ఉపయోగిస్తే అది దాదాపు 320 కి.మీ దూరం ప్రయాణించగలదని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ ఒసము హోరీ చెప్పారు. పైగా కొత్త బ్యాటరీలను ఆరు నిమిషాల్లో రీచార్జ్ చేసుకోవడమే కాక, 5,000 సార్లు రీచార్జ్ చేసుకోవచ్చంటున్నారు. 2019 నాటికి ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తాయని అంచనా. -
తోషిబాకు 32 కోట్ల డాలర్ల నష్టం
టోక్యో: లాభాలను పెంచి చూపిన కుంభకోణంలో చిక్కుకున్న జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తోషిబా గత ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను సవరించింది. ముందుగా 120 బిలియన్ యెన్ల వార్షిక లాభాలు అంచనా వేసినప్పటికీ.. సవరించిన దాని ప్రకారం 37.8 బిలియన్ యెన్ల మేర (సుమారు 31.8 కోట్ల డాలర్ల) నష్టాన్ని ప్రకటించింది. అయితే, నిర్వహణ లాభాలు మాత్రం యథాతథంగా 170 బిలియన్ యెన్ల మేర ఉన్నట్లు వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాలు ప్రకటించడం లేదని పేర్కొంది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థ లాభాలను ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల మేర పెంచి చూపించినట్లు వెల్లడి కావడంతో తోషిబా ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. పలువురు అధికారులు వైదొలిగారు. దీంతో తోషిబా ఆర్థిక పరిస్థితులను కంపెనీయేతర కమిటీ మదింపు చేసింది. -
ఐటీఐ అభ్యర్థులకు నేడు జాబ్‌మేళా
సంగారెడ్డి క్రైం: తోషిబా కంపెనీలో ఐటీఐ ట్రేడ్ ఉద్యోగాల భర్తీ కోసం మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కె.రజని ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ట్రేడ్‌లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, గ్య్రాండర్, స్ప్రే పెయింటర్ ట్రేడ్లలో అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. అభ్యర్థులు మంగళవారం ఉదయం 11 గంటలకు పాత డిఆర్‌ఎడి ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అర్హత సర్టిఫికెట్లతో పాటు మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తీసుకొని రావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,041 జీతం ఉంటుందన్నారు. -
తోషిబా నుంచి 18 ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: జపాన్ టెక్నాలజీ కంపెనీ, తోషిబా శక్రవారం 18 శాటిలైట్ రేంజ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. వాణిజ్య నిపుణులు, యువజనం లక్ష్యంగా ఈ ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నామని తోషిబా ఇండియా కంట్రీ హెడ్ (డీఎస్ డివిజన్) సంజయ్ వార్కె చెప్పారు. వీటి ధరలు రూ.21,736 నుంచి రూ.76,660 రేంజ్లో ఉన్నాయని వివరించారు. ప్రతీ ఒక్కరి అవసరాలు తగ్గట్లుగా ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు తేలిగ్గానూ, స్వల్ప మందంగానూ ఉంటాయని, అత్యున్నత నాణ్యత గల డిజైన్‌తో రూపొందించామని తోషిబా ఇండియా (పీసీ బిజినెస్ డీఎస్ డివిజన్) వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) శివకుమార్ పేర్కొన్నారు. -
విజయ్ ఎలక్ట్రికల్స్... తోషిబా చేతికి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నలభై ఏళ్ల కిందట రాష్ట్రంలో ఆరంభమై అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్... అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన తోషిబా కార్పొరేషన్ చేతుల్లోకి వెళ్లబోతోంది. విజయ్ తాలూకు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వ్యాపారంలో మెజారిటీ వాటాను తోషిబా సొంతం చేసుకుంటోంది. దీనికోసం తోషిబా దాదాపు 200 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.1300 కోట్లు) వెచ్చిస్తోంది. ఈ కొనుగోలు ప్రక్రియ నవంబరు నాటికి పూర్తవుతుందని తోషిబా ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఉన్న విజయ్ ఎలక్ట్రికల్స్ ప్రస్థానం 1973లో ఆరంభమైంది. దీనికి అధినేత దాసరి జై రమేష్. అంచెలంచెలుగా ఎదుగుతూ... 2006లో ప్రపంచంలోనే తొలిసారిగా 1200 కెవి ట్రాన్స్ఫార్మర్లను తయారు చేసిన తొలి సంస్థగా విజయ్ గుర్తింపు పొందింది. దాన్ని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సరఫరా చేసింది. అదే సంవత్సరంలో స్విచ్‌గేర్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది. ప్రస్తుతం విజయ్‌కి హైదరాబాద్, ఉత్తరాఖండ్‌లలో యూనిట్లున్నాయి. ఇవికాక సంరక్షణ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రోటెక్నికా స్విచ్గేర్స్ అనే అనుబంధ సంస్థలున్నాయి. బ్రెజిల్, మెక్సికోల్లో కూడా తమకు యూనిట్లున్నట్లు విజయ్ తెలిపింది. విజయ్ ఎలక్ట్రికల్స్ వ్యాపారాన్ని విలీనం చేసుకోవటానికి కొత్త కంపెనీని ఆరంభిస్తామని, తమ డిజైన్, తయారీ టెక్నాలజీలను కూడా విజయ్‌తో ఇంటిగ్రేట్ చేస్తామని తోషిబా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తకెషి యొగుటా చెప్పారు. ఈ కొత్త కంపెనీ దేశంలోని వివిధ మార్కెట్లలోకి, వివిధ విభాగాల్లోకి ప్రవేశిస్తుందని కూడా ఆయన చెప్పారు. ‘‘అంతర్జాతీయంగా మా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార వ్యూహాలకు ఈ కొనుగోలు అత్యవసరం. వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయంగా మా నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకోవటం ద్వారా ఈ విభాగంలో 20% వాటాను దక్కించుకోవాలన్నదే మా లక్ష్యం’’ అని వివరించారాయన. కాగా కంపెనీ సాంకేతిక బలం, నిపుణుల సామర్థ్యం తోషిబా గ్రూపులో భాగం కానున్నందుకు సంతోషంగా ఉందని విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ దాసరి జై రమేష్ ఈ సందర్భంగా చెప్పారు. 2006లో విజయ్ ఎలక్ట్రికల్స్‌ను 550 మిలియన్ డాలర్లుగా అంచనా కట్టగా... అప్పట్లో నిధులు అవసరమై స్వల్ప వాటాను 3ఐ గ్రూప్ రూ.120 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ట్రాన్స్మిషన్-డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వ్యాపారంలో మాత్రమే విజయ్ మెజారిటీ వాటాను రూ.1300 కోట్లకు (200 మిలియన్ డాలర్లు) విక్రయిస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా 3ఐ గ్రూప్ కూడా ఎగ్జిట్ కానున్నట్లు సమాచారం. అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని తయారు చేసే తోషిబా... 1875లో ఆరంభమయింది. ప్రస్తుతం దానికి అనుబంధంగా 590 కంపెనీలున్నాయి. 2,06,000 మంది ఉద్యోగులున్న దీని వార్షిక టర్నోవర్ 60 బిలియన్ డాలర్లు.