నోయిడా: బ్యాటరీ టెక్నాలజీల్లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) మార్కెట్ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల మార్కెట్ 128 గిగావాట్–అవర్ (జీడబ్ల్యూహెచ్) స్థాయికి చేరవచ్చనే అంచనాలు ఉన్నట్లు రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొన్న సందర్భంగా ఇన్ఫర్మా మార్కెట్స్ ఆఫ్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు.
ఈ నేపథ్యంలో నిలకడైన రీసైక్లింగ్ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ విద్యుత్ డిమాండ్‌లో చైనా, భారత్ సారథ్యంలోని ఆసియాకి ప్రస్తుతం 60 శాతం వాటా ఉందని ఉడ్ మెకెంజీ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ విట్‌వర్త్ తెలిపారు.
రాబోయే రెండు దశాబ్దాల్లో సాంకేతిక పురోగతి వల్ల పవన, సౌర విద్యుత్ సామర్థ్యాలు నాలుగింతలు పెరగనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దకాలంలో ఈ రంగంలో 3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపారు. 700 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 900 పైగా బ్రాండ్లు ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. 40,000 మంది సందర్శకులు ఈ ఎక్స్‌పోను సందర్శించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment