స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ చిన్న కంపెనీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్టయిన కంపెనీ ఈ2ఈ నెట్‌వర్క్స్. తాజాగా డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ పెట్టుబడుల రూపంలో 21 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. అయితే అతిచిన్న కంపెనీగా ప్రారంభమైన ఈ షేరు ప్రస్తుతం మిడ్‌క్యాప్ స్థాయికి చేరుకోవడం విశేషం!
ప్రస్థానమిలా..
2018 మే 15న ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో షేరుకి రూ. 57 ధరలో ఐపీవోకు వచ్చిన కంపెనీ ఈ2ఈ నెట్‌వర్క్స్. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 4,978 వద్ద ముగిసింది. వెరసి వరుసగా ఏడో రోజు అప్పర్ సర్క్యూట్ వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రూ. 8,404 కోట్లకు చేరింది. గత 8 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు 48 శాతం జంప్‌చేసింది. గత నెల రోజుల్లో చూస్తే 70 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 3 శాతం నీరసించడం గమనార్హం!
ఇటీవల ధూమ్‌ధామ్
గత 9 వారాలను పరిగణిస్తే అంటే సెపె్టంబర్ 2నుంచి ఈ2ఈ షేరు రూ. 2,332 నుంచి 113 శాతం ఎగసింది. నిజానికి 2024 జనవరి నుంచి 621 శాతం దూసుకెళ్లింది. ఈ సమయంలో నిఫ్టీ 10 శాతం మాత్రమే బలపడింది. ఇక 2023 ఆగస్ట్ 4న రూ.
285 వద్ద కదిలిన ఈ షేరు గత 15 నెలల్లో 17 రెట్లు లేదా 1,644 శాతం పురోగమించింది. కాగా.. 2024 సెపె్టంబర్30న సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా 1.05 శాతం వాటాకు సమానమైన 1,77,043 షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ2ఈ కంపెనీ షేరు మెయిన్‌బోర్డ్‌లో ట్రేడవుతోంది.
కంపెనీ ఏం చేస్తుందంటే?
ఈ2ఈ నెట్‌వర్క్స్ సీపీయూ, జీపీయూ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉంది. తద్వారా కస్టమర్లకు భారీస్థాయి జనరల్ అండ్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను నిర్వహించడంలో సహకారమందిస్తుంది. చిప్ దిగ్గజం ఎన్‌విడియా సాంకేతిక సహకారం ఇందుకు కంపెనీకి తోడ్పాటునిస్తోంది. ఈ బాటలో చిప్ తయారీ దిగ్గజాలు ఎన్‌విడియా, ఇంటెల్, ఏఎండీసహా హెచ్‌పీఈ, మైక్రోసాఫ్ట్, డెల్‌తో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఓపెన్‌సోర్స్ టెక్నాలజీ ద్వారా ప్రొప్రయిటరీ వర్చువలైజేషన్, క్లౌడ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్(ఐపీ) అభివృద్ధి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment