పదేళ్లు పనిచేసే బ్యాటరీలు! | Ten years working batteries! | Sakshi
Sakshi News home page

పదేళ్లు పనిచేసే బ్యాటరీలు!

Published Mon, Feb 13 2017 1:32 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

పదేళ్లు పనిచేసే బ్యాటరీలు! - Sakshi

పదేళ్లు పనిచేసే బ్యాటరీలు!

బోస్టన్  (అమెరికా): దాదాపు దశాబ్ద కాలం పాటు నిరంతరంగా పనిచేసే సామర్థ్యంగల బ్యాటరీలను అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ విషరహిత బ్యాటరీలు నీటిలో కరిగి ఉన్న కర్బన అణువుల రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటాయని హార్వర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు 1000 సైకిల్స్‌ (చార్జింగ్‌/డిస్‌చార్జింగ్‌) పూర్తి కాగానే వాటి జీవిత కాలం ముగుస్తుంది.

కానీ ఈ విషరహిత బ్యాటరీలు మాత్రం 1000 సైకిల్స్‌ పూర్తయ్యేసరికి 1 శాతం సామర్థ్యాన్ని మాత్రమే కోల్పోతాయని హార్వర్డ్‌ యూనివర్సిటీ ఇంజనీర్‌ మైఖేల్‌ అజీజ్‌ తెలిపారు. తటస్థ జలంలో ఎలక్ట్రోలైట్లను కరిగించడం వలన ఆ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయని వివరించారు. పరిశోధన ఫలితాలను ఏసీఎస్‌ ఎనర్జీ లెటర్స్‌ జర్నల్‌లో పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement