ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే | Lok sabha elections 2024: Auto mobile sales growth flat in April due to high base effect, elections | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే

Published Thu, May 2 2024 5:44 AM | Last Updated on Thu, May 2 2024 8:10 AM

Lok sabha elections 2024: Auto mobile sales growth flat in April due to high base effect, elections

సార్వత్రిక ఎన్నికల నేపథ్యం, అధిక బేస్‌ ప్రభావం 

న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్‌ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్‌ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్‌ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  

⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది.  
⇒ హ్యుందాయ్‌ గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. 
⇒ టాటా మోటార్స్‌ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్‌లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్‌లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement