
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ కొత్త రికార్డ్ సృష్టించింది. విడుదలైన 10 నెలల్లోనే ఒక లక్ష యూనిట్లు రోడ్డెక్కాయి. దేశంలో తక్కువ సమయంలో ఈ స్థాయి అమ్మకాలు సాధించిన ఎస్‌యూవీ ఇదేనని కంపెనీ ప్రకటించింది.
సంస్థ నుంచి అధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచింది. 2021 అక్టోబర్‌లో పంచ్ భారత మార్కెట్లో రంగ ప్రవేశం చేసింది.
ఎక్స్‌షోరూంలో ధర రూ.5.93 లక్షల నుంచి రూ.9.49 లక్షల మధ్య ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఏర్పాటు ఉంది.
చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా?
Comments
Please login to add a commentAdd a comment