హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తేలికపాటి వాణిజ్య వాహనం కొత్త బొలెరో మ్యాక్స్ పికప్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.68 లక్షల నుంచి ప్రారంభం.
1,300 కిలోల సరుకును మోయగలదు. వారంటీ మూడేళ్లు లేదా ఒక లక్ష కిలోమీటర్లు. మెరుగైన రవాణా కోసం ఆర్15 టైర్లను వినియోగించారు. 20,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది.
2–3.5 టన్నుల తేలికపాటి వాణిజ్య వాహన విభాగంలో కంపెనీకి దక్షిణాదిన 43 శాతం వాటా ఉందని మహీంద్రా ఎస్వీపీ వెంకట్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ భారత్‌లో 2–3.5 టన్నుల విభాగం మార్కెట్ ఏటా 8,000 యూనిట్లు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment