ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్‌లో వచ్చే ఏడాది కార్ల తయారీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ధరలో ‘రెడ్‌వుడ్’ అనే పేరుతో కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. టెస్లా 2025 మధ్యలో ‘రెడ్‌వుడ్’ కోడ్‌నేమ్‌తో కొత్త 'మాస్ మార్కెట్' ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
రాయిటర్స్ ప్రకారం, రాబోయే మోడల్‌లు ప్రారంభ కారు ధర 25వేల డాలర్లతో చవకైన కార్లను విడుదల చేసి చైనాకు చెందిన బీవైడీ తయారు చేసే అధిక ధరలతో కూడిన ఈవీ కార్ల కంటే పెట్రోల్ వేరియంట్ కార్లతో పోటీ పడేలా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని టెస్లా యాజమాన్యం భావిస్తున్నది.
ఎలాన్ మస్క్ తొలిసారి 2020లో 25 వేల డాలర్ల ధరతో కార్లను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాగా, అమెరికాలో టెస్లా బడ్జెట్ కారు మోడల్ 3 సెడాన్ ప్రారంభ ధర 38,990 డాలర్లుగా ఉంది. అయితే ఎలాన్ మస్క్ ఈ కార్లను అమెరికాతో పాటు భారత్‌లో తయారు చేస్తారా? లేదా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment