ఆఫ్ఘనిస్తాన్‌ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్! | Entop Simurgh Supercar From Afghanistan As Special Attraction In 2023 Geneva International Motor Show - Sakshi

Simurgh: ఆఫ్ఘనిస్తాన్‌ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్!

Oct 10 2023 11:13 AM | Updated on Oct 10 2023 12:06 PM

Simurgh As Special Attraction In 2023 Geneva International Motor Show - Sakshi

Afghanistan Simurgh Super Car: ఈ నెల 5 నుంచి జెనీవాలో ప్రారంభమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో గురించి అందరికి తెలిసిందే. ఖతార్‌లోని దోహా వేదికగా జరుగుతున్న ఈ షోలో ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక సూపర్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మొదటి చూపులోనే చూపరుల మదిదోచిన ఈ సూపర్ కారు తాలిబన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్మించిన సూపర్‌కార్ మాడా 9 ఆధారంగా తయారైనట్లు తెలుస్తోంది. కాబూల్‌కు చెందిన తయారీ సంస్థ ఎన్‌టాప్‌ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (ATVI)చే నిర్మితమైన ఈ కారుకి 'సిముర్గ్' అని పేరు పెట్టారు.

సిముర్గ్ కారు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొట్టమొదటి స్వదేశీ సూపర్‌కార్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆటోమోటివ్ ఈవెంట్‌లలో ఒకటైన జెనీవా మోటార్ షోలో ఈ సూపర్‌కార్ ఎంతోమంది ఔత్సాహికులను ఆకర్షించింది.

30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు..
బ్లాక్ కలర్‌ పెయింట్ థీమ్‌ కలిగిన ఈ కారుని 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో కరోలా నుంచి తీసుకున్న ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. అయితే దీని సాంకేతిక వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. బహుశా త్వరలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డిజైన్ విషయానికి వస్తే.. ఈ సూపర్ కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, షార్ప్ ఫ్రంట్ స్ప్లిటర్, పెద్ద బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లేర్డ్ ఫెండర్లు, ఎయిర్ ఇన్‌టేక్ కోసం ప్రత్యేకంగా తయారైన సైడ్ ప్రొఫైల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, బోల్డ్-లుకింగ్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది.

ఇదీ చదవండి: ఏఐ చాట్‌బాట్‌ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే?

మోటార్ షోలో ఎంతోమందిని అలరించిన సిముర్గ్ దాని ఇతర మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న కారు కేవలం ప్రోటోటైప్ దశలో ఉంది. దీనిని ఉత్పత్తి చేయడానికి తయారీదారుకు బలమైన ఆర్థిక మద్దతు అవసరం ఉంది, కావున ఈ సూపర్ తయారీ ఎప్పుడనేది తయారీదారు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement