ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగుల భవిష్య నిధిని ఈపీఎఫ్‌ఓకు బదిలీ చేసే అంశంపై చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. గతంలో కంపెనీ చెల్లించిన ఈపీఎఫ్‌ఓ పెన్షన్ ఫండ్‌ను తిరిగి సంస్థ అకౌంట్‌లో జమ చేయాలని కోరుతుంది. అయితే సంస్థలోని ఉద్యోగులు, కంపెనీ ఆర్థికస్థితికి సంబంధించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ సమర్పించాలని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. దీనిపై ఇరు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఆగస్టు 8న విచారణ జరగనుంది.
టాటా మోటార్స్ 2019-20, 2020-21, 2021-22 వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలను చవిచూసింది. దాంతో యాక్చురియల్ వాల్యుయేషన్(ఆస్తులు, ఖర్చులను పోల్చి చూసే విశ్లేషణ పత్రం) ద్వారా పెన్షన్ ఫండ్ చెల్లింపులను రద్దు చేయాలని కోరింది. 2019లో కంపెనీ మినహాయింపు పొందిన పెన్షన్ ఫండ్‌ను సరెండర్ చేయడానికి ఈపీఎఫ్‌ఓకు దరఖాస్తు చేసింది.
ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?
భవిష్య నిధికి సంబంధించిన కార్పస్ బదిలీకి ఈపీఎఫ్‌ఓ అంగీకరించింది. కానీ, అధికారులు పెన్షన్ స్కీమ్ వివరాలను కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పెన్షన్ కార్పస్‌కు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర సమాచారాన్ని అందించాలని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది. గతంలో కంపెనీ సమర్పించిన నగదు బదిలీని అనుమతించడానికి అవసరమయ్యే నిర్దిష్ట ఖాతాల సమాచారం అస్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ అంశం ఆగస్టు 8న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment