
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా హర్యానా రోడ్‌వేస్‌కు 1,000 బస్‌లను సరఫరా చేయనున్నట్టు గురువారం ప్రకటించింది.
52 సీట్ల సామర్థ్యం గల డీజిల్‌తో నడిచే బీఎస్–6 బస్‌లను అందించనుంది. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడానికి తాము కట్టుబడి ఉన్నట్టు టాటా మోటార్స్ ప్రొడక్ట్ లైన్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా తెలిపారు.
చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్!