సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్‌టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్‌ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ల్లో ఈ వాహనాల బుకింగ్‌లు ప్రారంభమయినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్‌లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు.
ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం
ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్‌తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్ ఇంజిన్ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్‌ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్ హెచ్‌టీ+ 900 కేజీ పేలోడ్ కెపాసిటీతో 800సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment