హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో కొత్త మైలురాయిని అధిగమించింది. మొత్తం 50 లక్షల యూనిట్ల విక్రయాలతో రికార్డు సాధించింది. 10 లక్షల యూనిట్ల మార్కును కంపెనీ 2004లో చేరుకుంది. ఆ తర్వాత ఆరేళ్లలోనే 20 లక్షల యూనిట్ల స్థాయిని తాకింది.
2015లో 30 లక్షల యూనిట్లు, 2020లో 40 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2020 తర్వాత అతి తక్కువ కాలంలోనే 50 లక్షల మార్కును చేరుకోవడం విశేషం. కోవిడ్–19, సెమికండక్టర్ల కొరత ఉన్నప్పటికీ నూతన రికార్డును అందుకున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతి మైలురాయి వెనుక ఒడిదుడుకుల ప్రయాణం ఉందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment