టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇవి మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.5 లక్షలు. డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 11.5 లక్షల నుంచి రూ. 17.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
కొత్త టాటా కర్వ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మూడు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది భారతదేశంలో డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ పొందిన ఏకైక డీజిల్ కారుగా నిలిచింది.
టాటా కర్వ్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, రిక్లైనింగ్ రియర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి పొందుతుంది.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఈసీఎస్, డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ పొందుతుంది. ఈ కొత్త కారు సిట్రోయెన్ బసాల్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment