న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కఠినతరమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్లతో ప్యాసింజర్ వాహనాల శ్రేణిని ఆవిష్కరించినట్లు టాటా మోటర్స్ వెల్లడించింది. ఈ ఇంజిన్లు ఈ–20 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. వీటితో వాహనాలు మరింత సురక్షితంగానూ, సౌకర్యవంతంగా ఉంటాయని వివరించింది.
ప్రారంభ గేర్లలో కూడా సౌకర్యవంతమైన అనుభూతి కలిగించేలా ఆల్ట్రోజ్, పంచ్ వాహనాలను తీర్చిదిద్దినట్లు టాటా మోటర్స్ వివరించింది. ఈ రెండు మోడల్స్‌లో మరింత మైలేజీనిచ్చేలా ఐడిల్ స్టాప్ స్టార్ట్ ఫీచర్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. పనితీరు మెరుగుపడేలా నెక్సాన్ డీజిల్ ఇంజిన్‌ను కూడా రీట్యూన్ చేసినట్లు కంపెనీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment