ఒకసారి చార్జింగ్‌తో 585 కి.మీ.
ప్రారంభ ధర 17.49 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్.ఈవీ ఎస్‌యూవీ కూపే విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.17.49 లక్షలతో ప్రారంభమై రూ.21.25 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ఈ కారు తొలిసారిగా దర్శనమిచ్చింది. కర్వ్.ఈవీ చేరికతో టాటా మోటార్స్ ఖాతాలో ఎలక్ట్రిక్ మోడళ్ల సంఖ్య అయిదుకు చేరుకుంది. 123 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కర్వ్. ఈవీలో పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో 502 కిలోమీటర్లు, 55 కి.వా.అవర్ బ్యాటరీ ప్యాక్‌తో 585 కి.మీ. ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. భారత్ ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది.
ఇవీ అదనపు ఫీచర్లు..
20కిపైగా సేఫ్టీ ఫీచర్స్‌తో లెవెల్–2 అడాస్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటోహోల్డ్‌తో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్, 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 18 అంగుళాల వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ ఇతర హంగులు. 40 నిమిషాల్లో బ్యాటరీ 80% చార్జింగ్ పూర్తి అవుతుంది. కర్వ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మోడల్‌ను సెప్టెంబర్ 2న ఆవిష్కరిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర తెలిపారు. లక్ష టాటా ఈవీలు భారత రోడ్లపై పరుగెడుతున్నాయన్నారు. కంపెనీకి ఎలక్ట్రిక్ కార్ల విపణిలో 70% వాటా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment