
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ ప్యాసింజర్ వాహన ధరల్ని పెంచనుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ధరల్ని పెంచనున్నట్లు వెల్లడించింది.
హ్యాచ్‌బ్యాక్ టియాగో ప్రారంభం వేరియంట్ ధర రూ. 5.6 లక్షల నుండి రూ. 25.94 లక్షల మధ్య విక్రయించింది. అయితే, ఎంతమేరకు ధర పెంచుతుందనే విషయాన్ని ప్రస్తావించలేదు. ‘జనవరి 2024లో మా ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ధరల్ని పెంచాలని భావిస్తున్నారు.పెంపుదల, ఖచ్చితమైన వివరాలు కొన్ని వారాల్లో ప్రకటిస్తామని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు.
ఇప్పటికే మారుతీ సుజుకీ, ఆడీ కంపెనీలు ధరల పెంపుపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఇప్పుడే ఆ జాబితాలో చేరింది.