న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2030 నాటికి ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాల్లో 50 శాతం వాటా ఈవీల నుంచే ఉంటుందని అంచనా వేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. 2040 నాటికి ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకు రావాలన్నది సంస్థ లక్ష్యం. అయిదేళ్లలో ఈవీల వాటా ప్యాసింజర్ కార్స్ విక్రయాల్లో 25 శాతానికి చేరుతుంది. (ఆధార్-ఫ్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన)
ప్రస్తుతం సంస్థ నెక్సన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను విక్రయిస్తోంది. 2022-23లో టాటా మోటార్స్ 5,40,965 యూనిట్ల ప్యాసింజర్ కార్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 50,043 యూనిట్ల ఈవీలు ఉన్నాయి. 2022– 23లో అడుగుపెట్టిన టియాగో ఈవీ తమ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాల జోరు పెంచిందని తెలిపింది. తొలి రోజే సుమారు 10,000 బుకింగ్స్‌ను నమోదు చేసిందని వివరించింది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!)
హ్యారియర్ ఈవీ, సియర్రా ఈవీ, అవిన్యా కాన్సెప్ట్ మోడళ్లను కంపెనీ ఇప్పటికే ఆవిష్కరించింది. ఈ మోడళ్లు ఈవీల పట్ల మరింత ఆసక్తిని పెంచుతాయని కంపెనీ భావిస్తోంది. (మరిన్ని బిజినెస్ వార్తలు, అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్)
Comments
Please login to add a commentAdd a comment