టాటా మోటార్స్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక సంవత్సరం 2025 (ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025)లో ఆటోమొబైల్ విభాగంలో సుమారు రూ.43వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఆర్ధిక సంవత్సరం 2024లో టాటా గ్రూప్ మొత్తం దాదాపు రూ. 41,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాల తయారీ, కొత్త టెక్నాలజీలకు గాను సుమారు రూ. 30,000 కోట్లు, టాటా మోటార్స్‌కు రూ. 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా.. అందులో మిగిలిన మొత్తాన్ని ఇతర విభాగాలకు ఖర్చు చేసింది.
అయితే ఈసారి ఆర్ధిక సంవత్సరం 2025లో మాత్రం పెట్టుబడల మొత్తాన్ని భారీగా పెంచనుందని సమాచారం. టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ ఓ సదస్సులో మాట్లాడుతూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం రూ. 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
అంతేకాదు దశల వారీగా ఉత్పత్తిని పెంచనున్నామని, అందుకే ఆర్ధిక సంవత్సరం 2025లో జేఎల్‌ఆర్ విభాగంపై పెట్టుబడులు ఆరుశాతం పెంచామన్నారు. ఇక తమ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే సంవత్సరం నాటికి తమ ఉత్పత్తుల్ని మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment