
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ డైరెక్టర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్ నియామకం దాదాపు ఖరారైంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఓటు వేసింది. ఆగష్టు 30, గురువారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలోఈ మేరకు బోర్డు ఆమోద ముద్ర వేసింది.
వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చందా కొచర్‌ను సెలవుపై పంపారు. ఆమెపై ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతుండగా, 2018 జూలై 19 నుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఓటు వేయడంపై విమర్శలు చెలరేగాయి.
ఐసీఐసీఐ వీడియోకాన్ రుణాల కుంభకోణంలో ప్రధాన ఆరోపణల నేపథ్యంలో సెలవులో ఉన్న ఆమెకు కంటితుడుపు చర్యగా ఈ డైరెక్టర్ పదవిని కట్టబెడుతున్నారని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ, ఇన్‌గవర్న్ విమర్శించిందికాగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు 80 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment