సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ వివాదంలో ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఐసీఐసీఐ బోర్డు నామినీని తొలగించింది. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. బ్యాంకు బోర్డులో ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా ఉన్న అమిత్ అగర్వాల్ స్థానంలో లోక్ రంజన్‌ను నియమించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్న రంజన్ నియమాకం ఏప్రిల్ 5నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు సమాచారం అందించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
మరోవైపు 3,250 కోట్ల రూపాయల స్కాం ఆరోపణలపై రంగంలోకి దిగిన సీబీఐ.. చందా కొచ్చర్ భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌పై ప్రాథమిక విచారణ చేపట్టింది. అటు ఈ వివాదంలో అవిస్టా సంస్థపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మూడురోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న దీపక్ కొచ్చర్ సోదరుడు విజయ్ కొచ్చర్‌ను శనివారం కూడా విచారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment