nominee
-
ట్రంప్ వీరవిధేయుడి నోట ‘జై శ్రీ కృష్ణ’
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. భారతీయ మూలాలను, సంప్రదాయాలను, విలువలనూ పాటించే వ్యక్తులు తరచూ తారసపడుతుంటారు. అది ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా!. అలాంటి వాళ్లలో ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి నామినీ అయిన కశ్యప్ పటేల్ ఒకరు. తాజాగా ఆయన చేసిన చర్య ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.44 ఏళ్ల కశ్యప్ క్యాష్ పటేల్.. తాజాగా(గురువారం) సెనేట్ జ్యూడీషియరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో తనకు మద్ధతు తెలపడానికి సుదూరాల నుంచి వచ్చిన తల్లి అంజనా, తండ్రి, సోదరిని కమిటీకి ఆయన పరిచయం చేశారు. చివర్లో ‘జై శ్రీ కృష్ణ’ అంటూ ముగించారు. అంతకు ముందు.. కమిటీ విచారణ ప్రారంభానికి ముందు ఆయన తన తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.WATCH | FBI Director-Designate Kashyap Patel delivers opening statement at confirmation hearing, thanks his parents who flew from India and concludes with “Jai Shri Krishna.”#FBI #KashyapPatel #US pic.twitter.com/mFLx0uEVAz— Organiser Weekly (@eOrganiser) January 30, 2025విచారణ ఎందుకంటే..ఎఫ్‌బీఐ డైరెక్టర్ నామినీ అయిన కశ్యప్ పటేల్‌ను సెనేట్ జ్యూడీషియరీ కమిటీ విచారణ జరుపుతుంది. సాధారణంగా ఈ కమిటీ ఆ పదవికి నామినీకి ఉన్న అర్హతలను సమీక్షించడంతో పాటు గతంలో చేసిన వ్యాఖ్యలను, వివాదాస్పద చర్యలను పరిశీలిస్తుంది. చివరకు సదరు నామినేషన్‌ను అంగీకరించాలా? తిరస్కరించాలా? అనేది ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.ఇక విచారణలో భాగంగా గతంలో.. జర్నలిస్టులను ప్రాసిక్యూషన్ చేయాలని, ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేయాలని కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ట్రంప్‌ను ఆయనకు ఉన్న అనుబంధంపైనా ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వీటితో పాటు జాత్యహంకారానికి గురయ్యారా?అనే ప్రశ్నకు.. ఆయన అవుననే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘గతంలో నేనూ గతంలో జాత్యహంకారానికి గురయ్యాను. అమెరికాలో ఎలాంటి హక్కు లేని ఓ వ్యక్తిగా నన్ను పేర్కొనేవారు. మీరు ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లిపోవాలంటూ నాకు మెసేజ్‌లు వచ్చేవి. చట్టాన్ని కాపాడుతున్న ఎంతోమంది వ్యక్తులు ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్నదిగా అనిపించింది. నా కుటుంబసభ్యులు ఇక్కడ ఉండగా.. ఆ సంఘటనను గురించి పూర్తిగా వెల్లడించలేను’’ అని పటేల్ అన్నారు. కాష్ పటేల్ గురించి..ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. గుజరాత్లో ఈయన కుటుంబమూలాలు ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అయితే ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా కాష్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. ప్రస్తుతం ఆయన కొలంబియాలో ఉంటున్నారు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు.కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో ఈయన పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి ఆయన పేరును ట్రంప్ నామినేట్ చేశారు. సెనేట్ కమిటీ గనుక ఆయన పేరుకు క్లియరెన్స్ ఇస్తే.. దాదాపుగా ఆయనకు అగ్రరాజ్య దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పగ్గాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్ చరిత్ర సృష్టించినట్లే!. -
నోబెల్ శాంతి బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్
లండన్: నోబెల్ శాంతి బహుమతి–2025కి ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక పిటిషన్ సమర్పించినట్లు యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్ కావడం ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడటానికి ఆయన చేసిన కృషికి ఒక గుర్తింపు అని వెల్లడించారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ కొత్త రూల్: ఎంతో మేలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. బ్యాంక్ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడానికి కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో పెద్ద సంఖ్యలో డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేదని వెల్లడించింది. తప్పనిసరిగా ఖాతాదారులకు నామినీలు ఉండాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.మరణించిన డిపాజిటర్ల ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే.. దానిని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని నివారించడానికి ఆర్బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు లేదా కొత్త ఖాతాదారులందరికీ.. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లు వంటివి ఉన్నట్లయితే వారందరికీ నామినీలు ఉండేలా చూడాల్సిందిగా ఆర్బీఐ చెప్పింది.అర్హత కలిగిన వ్యక్తి నామినీ అయితే.. మరణించిన వ్యక్తి పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేఫ్ డిపాజిట్ లాకర్ల నుంచి నిధులను ఎటువంటి సమస్య లేకుండానే బదిలీ చేయవచ్చు.ఖాతాదారులు.. నామినీలను కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను గురించి బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఓ సారి.. దీనికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన దరఖాస్తు పత్రాలలో కూడా.. నామినీ పేరును తెలియజేసేలా, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.నామినీ ఎవరు?ఖాతాదారుడు మరణిస్తే.. తమ నిధులను ఎవరికి బదిలీ చేయాలనుకుంటున్నాడో అతడే.. నామినీ. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో నామినీ పేరును చేర్చవచ్చు లేదా అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత అయినా నామినీ పేరును యాడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
అమెరికా వ్యవసాయ మంత్రిగా బ్రూక్ రోలిన్స్
వాషింగ్టన్: చిరకాల మిత్రురాలు బ్రూక్ రోలిన్స్‌ను వ్యవసాయ మంత్రిగా డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. రిపబ్లికన్ల థింక్ టాంక్ అమెరికా ఫస్ట్పాలసీ ఇనిస్టిట్యూట్ అధిపతిగా ఉన్న బ్రూక్ నియామకంతో కేబినెట్ జాబితా దాదాపు పూర్తయ్యింది. దేశానికి నిజమైన వెన్నెముక అయిన అమెరికా రైతులను రక్షించేందుకు బ్రూక్ నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. అమెరికా ఫస్ట్ అధ్యక్షురాలిగా ఉన్న బ్రూక్స్ ట్రంప్ మిత్రురాలు. ట్రంప్ తొలి పర్యాయంలో వైట్‌హౌస్ సహాయకురాలిగా పనిచేశారు. ఆఫీస్ ఆఫ్ అమెరికన్ ఇన్నోవేషన్ డైరెక్టర్‌గా, డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేశారు. వ్యవసాయ అనుబంధ కుటుంబం నుంచి వచ్చిన రోలిన్స్.. దేశవ్యాప్త వ్యవసాయ క్లబ్ అయిన 4హెచ్‌తో పాటు ఫ్యూచర్ ఫార్మర్స్ ఆఫ్ అమెరికాతోనూ మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ డిగ్రీ అందుకున్న ఆమె తరువాత న్యాయవాదిగానూ పనిచేశారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పునఃసమీక్షించడంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. రోలిన్స్ ఎంపికతో ట్రంప్ కేబినెట్ జాబితా ఎంపిక దాదాపు పూర్తయ్యింది. ప్రతి అభ్యరి్థని సెనేట్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. 15 మంది సలహాదారుల బృందం అమెరికన్ ప్రభుత్వంలో ఒక బ్యూరోక్రటిక్ విభాగానికి నాయకత్వం వహిస్తుంది.ట్రంప్ టీమ్‌లోకి మరో భారతీయుడు ట్రంప్ అధికార బృందంలో మరో భారతీయుడు చేశారు. కోల్‌కతాలో పుట్టిన జై భట్టాచార్యను అమెరికా హెల్త్ ఏజెన్సీ డైరెక్టర్‌గా ట్రంప్ ఎంపిక చేశారు. స్టాన్‌ఫర్డ్‌లో చదివిన భట్టాచార్య వైద్యుడు, ఆర్థికవేత్త. ఎన్‌ఐహెచ్‌ను మార్చే ఆలోచనలను కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనయర్తో ఆయన ఇటీవల పంచుకున్నారు. అనంతరం ఆయనను ట్రంప్ తన టీమ్‌లోకి ఎంపిక చేశారు. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్, శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగే అవార్డు రేసులో ఉండగా.. మహిళల విభాగంలో శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐర్లాండ్ ఓపెనర్ గాబీ లూయిస్ పోటీలో ఉన్నారు.కేశవ్ మహారాజ్: ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మహారాజ్ ఈ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.జేడెన్ సీల్స్: ఈ విండీస్ ఫాస్ట్ బౌలర్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో సీల్స్ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు.దునిత్ వెల్లలగే: ఈ లంక ఆల్‌రౌండర్ గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. వెల్లలగే తొలి వన్డేలో 67 నాటౌట్, రెండో వన్డేలో 39 మరియు రెండు వికెట్లు, మూడో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
Banking Laws Amendment Bill: ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది. ఒక బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను ప్రస్తుతమున్న ఒకటి నుండి నలుగురికి పెంచడంసహా పలు కీలక అంశాలకు సంబంధించిన ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ, సేవల విస్తృతి బిల్లు ప్రధాన లక్ష్యం. అన్‌క్టైమ్డ్ డివిడెండ్లను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదలాయించడం, బ్యాంకింగ్ పరిపాలనా, ఆడిట్ వ్యవహారాల్లో మరింత మెరుగుదలకూడా ఈ బిల్లు దోహదపడనుంది. డైరెక్టర్íÙప్లకు సంబంధించిన వడ్డీ పరిమితిని పునరి్నర్వచించటానికి సంబంధించిన అంశం బిల్లులో మరో కీలకాంశం. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచడం దీని ఉద్దేశం. 2024–25 వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ఈ బిల్లును గత వారం క్యాబినెట్ ఆమోదించింది. -
ఫ్యామిలీ పెన్షన్ నామినేషన్ : మహిళా ఉద్యోగులకు భారీ ఊరట
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ కోసం మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు నామినేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన వారికి కుటుంబ పింఛను మంజూరు చేసేందుకు వీలు కల్పిస్తూ 2021 కేంద్ర పౌర సేవల (పెన్షన్) రూల్స్, 2021కి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) సవరణను ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకనటలో తెలిపారు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు భర్తలను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబ సభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
పింఛనుకు సంతానాన్నీ నామినేట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగుల కుటుంబ పింఛను విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబసభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
పింఛను నామినీలుగా ఉద్యోగినుల పిల్లలు
న్యూఢిల్లీ: భర్త నుంచి వేరుగా ఉండే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. కుటుంబ పింఛను కోసం నామినీలుగా ఇకపై తన పిల్లల పేర్లను పేర్కొనవచ్చని తెలిపింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పింఛను)నిబంధనలు–2021లోని 50వ క్లాజ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భాల్లో కుటుంబ పింఛను మంజూరవుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు మరణించినప్పుడు ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి కుటుంబపింఛను అందుతుందని తెలిపింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామి కుటుంబ పింఛనుకు అనర్హులైనప్పుడు లేదా చనిపోయినప్పుడు కుటుంబ పింఛను ఇతర కుటుంబసభ్యులకు అందుతుందని వివరించింది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ పింఛనుకు నామినీలుగా భర్త కంటే ముందుగా సంతానాన్ని పేర్కొనేందుకు వీలు కలి్పస్తూ తాజాగా నిబంధనలను మార్చినట్లు కేంద్ర పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం పేర్కొంది. తాజా సవరణ.. మహిళా ప్రభుత్వోద్యోగి విడాకుల పిటిషన్, గృహ హింస కేసు, మహిళల రక్షణ చట్టం కింద కేసులను దాఖలు చేసిన అన్ని సందర్భాల్లో, ఆమె భర్త కంటే ముందు అర్హత ఉన్న బిడ్డకు కుటుంబ పెన్షన్‌ను పంపిణీ చేయడానికి అనుమతిస్తుందని విభాగం కార్యదర్శి వి శ్రీనివాస్ పిటిఐకి తెలిపారు. -
చనిపోయినా సంపద సేఫ్..! కానీ..
చావు పుట్టుకలు చెప్పిరావు.. చావే వస్తే మనం కూడబెట్టిన కొద్ది మొత్తం డబ్బు ఏమౌతుంది.. ఆ డబ్బు మన తర్వాత ఉన్నవాళ్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి.. స్టాక్మార్కెట్లో మదుపు చేయాలని చాలా మంది అంటుంటారు. దీర్ఘకాలంగా అందులో మదుపుచేసిన వారు చనిపోతే ఆ డబ్బు ఎవరికి చెందుతుంది.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.. ప్రభుత్వం అందుకు విధిస్తున్న గడువులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించాలని చాలా మందికి ఉంటుంది. దాంతో అందులో మదుపు చేస్తూంటారు. కానీ చివరకు ఏదైనా జరిగి వారు మరణిస్తే ఆ డబ్బు ఎవరికీ కాకుండా అలా ఉండిపోతుంది. కానీ ఆ సంపద ఎవరికి చెందాలో నామినీగా వారి వివరాలను డీమ్యాట్ అకౌంట్‌కు జతచేయాలి. ఫలితంగా ఖాతాదారుడు చనిపోయినా నామినీ వెళ్లి ఆ డబ్బును తీసుకునే వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీల పేర్లు నమోదు చేయడానికి గడువు 2024 జూన్ 30 వరకు పొడిగిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 వరకు మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల నామినీల పేర్లు నమోదు చేసేందుకు డెడ్ లైన్ విధించింది. కానీ ఆ తేదీని పొడగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది ‘మార్కెట్ భాగస్వాముల నుంచి అభ్యర్థనలు, ఇన్వెస్టర్ల సౌకర్యార్థం డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ మదుపర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేందుకు గడువు పొడిగించాం’ అని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేలా ప్రోత్సహించాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లను (ఆర్టీఏ) సెబీ కోరింది. -
‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ నామినీల్లో నీరజ్ చోప్రా
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది ‘ప్రపంచ పురుషుల ఉత్తమ అథ్లెట్’ పురస్కారం రేసులో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిలిచాడు. 2023 సంవత్సరానికిగాను ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య 11 అథ్లెట్లను నామినీలుగా ప్రకటించింది. నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఆసియా క్రీడల్లో తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మూడు పద్ధతుల్లో ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈ–మెయిల్ ద్వారా వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్, వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ సభ్యులు... ఆన్లైన్ విధానంలో అభిమానులు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. అక్టోబర్ 28వ తేదీతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 13, 14 తేదీల్లో టాప్–5 ఫైనలిస్ట్‌లను... డిసెంబర్ 11న తుది విజేతలను ప్రకటిస్తారు. -
బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు నిర్మలా సీతారామన్ కీలక సూచన
ముంబై: కస్టమర్లు తమ నామినీలను నమోదు చేసేలా, నామినీలను అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంక్‌లు, ఆర్థిక సేవల సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. దీంతో భవిష్యత్తులో నిధుల క్లెయిమ్ సమస్య ఏర్పడబోదన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్)లో భాగంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో భాగమైన మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించే విషయమై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. కస్టమర్లు తమ వారసులను నామినీలుగా నమోదు చేసి, వారి పేరు, చిరునామా ఇచ్చేలా చూడాలి’’ మంత్రి పేర్కొన్నారు. ఒక నివేదిక ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలోనే క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.35,000 కోట్ల మేర ఉంది. మొత్తం మీద ఆర్థిక వ్యవస్థలో ఇలా క్లెయిమ్ చేయని మొత్తం రూ.లక్ష కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రజలు తాము క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు తెలుసుకుని, వాటిని పొందేందుకు వీలుగా ఆర్బీఐ ఆగస్ట్ 17న యూడీజీఏఎం పేరుతో ఓ కేంద్రీకృత పోర్టల్‌ను తీసుకొచ్చింది. వివిధ బ్యాంకుల పరిధిలో అన్‌క్లెయిమ్Šడ్ డిపాజిట్ల వివరాలను ఈ పోర్టల్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కలగడం గమనార్హం. బాధ్యతాయుతమైన ఆర్థిక ఎకోసిస్టమ్‌ను నిర్మించడం తప్పనిసరిగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. పన్నుల స్వర్గధామాలు, నిధులను రౌండ్ టిప్ చేయడం బాధ్యాయత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా అభివర్ణించారు. (పాత కారే అని చీప్‌గా చూడకండి: ఈ విషయం తెలిస్తే..!) దాడుల ముప్పు.. ‘‘భౌతిక సరిహద్దు ముప్పులు ఉన్నాయి. ఇవి సంప్రదాయ యుద్ధ తరహావి. ఇక సైబర్ దాడుల్లో తీవ్రత, ఊహించలేనంత నష్టం ఉంటుంది. ఫైర్‌వాల్స్‌ను ఎంత పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నా, కొత్త కొత్త మార్గాల్లో దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. క్రిప్టోలు అనేవి ముప్పు మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. ఈ విషయంలో తక్షణ అంతర్జాతీయ సహకారం అవసరం’’అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. సంఘటిత ఆర్థిక వ్యవస్థ ‘‘రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ సిప్‌లు రిజిస్టర్ అవుతున్నాయి. ఇవి దీర్ఘకాలంలో సంపద సృష్టికి వీలు కలి్పంచేవి. నెలవారీ సిప్ పెట్టుబడులు జూలై నెలలో రూ.15,245 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు గత దశాబ్ద కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి. 2014 మే నాటికి ఉన్న రూ.10 లక్షల కోట్ల నుంచి 2023 జూలై నాటికి రూ.46.37 లక్షల కోట్లకు పెరిగాయి’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. ఆదాయపన్ను రిటర్నుల సంఖ్య పెరుగుతుండడంపై స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితంగా మారుతోందన్నారు. రుణ సదుపాయాలు, సామాజిక భద్రత, పెన్షన్, ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తోందన్నారు. ఫిన్‌టెక్ సంస్థలు బలమైన రక్షణ వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలని మంత్రి సూచించారు. యూజర్ల డేటా, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని గోప్యతను కాపాడేందుకు అత్యాధునిక ఎన్క్రిప్షన్ను వినియోగించుకోవాలని కోరారు. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష బరిలో ఆయనొక్కరే.. అజయ్ బంగా ఎన్నిక లాంఛనమే!
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది.ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తదుపరి ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ల సమర్పణకు గడువు మార్చి 29తో ముగిసింది. బరిలో అజయ్ బంగా ఒక్కరే నిలిచారు. దీంతో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఇతర అభ్యర్థులెవరూ నామినేట్ కానందున తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా నామినేషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో విజయవంతమైన సంస్థలకు నాయకత్వం వహించిన విస్తృత అనుభవం కలిగిన వ్యాపార నాయకుడైన అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రకటించారు. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన మాస్టర్‌కార్డ్‌కు ప్రెసిడెంట్, సీఈవోగా చేశారు. సెంట్రల్ అమెరికా కోసం పార్టనర్షిప్ కో-చైర్‌గా వైస్ ప్రెసిడెంట్ హారిస్‌తో కలిసి పనిచేశారు. ప్రపంచ బ్యాంక్ అధిపతిగా కాబోతున్న మొట్ట మొదటి భారతీయ అమెరికన్ అజయ్ బంగా ఇటీవల భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలవాల్సి ఉంది. అయితే ఆయనకు కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దయ్యాయి. మహారాష్ట్రలోని పుణె నగరంలో జన్మించిన బంగా ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్ నుంచి మేనేజ్మెంట్లో పట్టా పొందారు. 2016లో అజయ్బంగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్: నామినీ నమోదు ఎలా?
సాక్షి,ముంబై: మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారులకు సెబీ భారీ ఊరటనిచ్చింది. నామినీ వివరాల నమోదుకు గడువు పొడిగిస్తూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాదారులకు సమర్పించే గడువును ఆరు నెలలపాటు, అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30వరకు పొడిగించింది. (ఇదీ చదవండి: దిల్ ఉండాలబ్బా..! ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో) ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్డేట్ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువు మార్చి 31తో ముగియనున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా 2021 జూలైలో సెబీ ఆదేశించింది. ఆ తరువాత ఈ గడువును పెంచడంతోపాటు 2023 మార్చి31లోగా డీమ్యాట్ ఖాతాలు, ఎంఎఫ్ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం మ్యాండేటరీ చేసింది. (హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్ ) నామిని అంటే నామినేషన్ అనేది మరణం సంభవించినప్పుడు ఖాతాదారుడి ఆస్తులకు వారసుడిగా ఒకవ్యక్తిని నియమించే ప్రక్రియ. ఇన్వెస్టర్లు ప్రారంభించిన కొత్త ఫోలియోలు/ఖాతాలకు నామిని నమోదు తప్పనిసరి. దీంతో పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో నామినీకి నిధులను బదిలీ చేయడం సులభమవుతుంది. లేదంటే వారి వారసులు ఆయా యూనిట్లను అతడు లేదా ఆమె పేరు మీద బదిలీ చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా వీలునామా, చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రం, ఇతర చట్టపర వారసుల నుండి ఎన్వోసీలు లాంటి అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) నామినీ నమోదు ఎలా? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు స్వయంగా సంబంధిత శాఖల ద్వారా, లేదా CAMD, KFintech వంటి RTA వెబ్సైట్ల ద్వారా నామినేషన్ పూర్తి చేయవచ్చు. వన్-టైమ్-పాస్వర్డ్ (OTP) ధృవీకరణ ద్వారా ఆ ప్రక్రియనుపూర్తి చేయవచ్చు. -
నామినీ అప్డేట్ గడువు పొడిగింపు: సెబీ
న్యూఢిల్లీ: ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్డేట్ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువును ఆరు నెలలు పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 31తో ముగియనుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకూ అనుమతిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 2021 జూలైలో తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. ఇలా చేయని ఖాతాలను డెబిట్లు చేపట్టేందుకు వీలులేకుండా నిలిపివేయనున్నట్లు తెలియజేసింది. తదుపరి 2023 మార్చి31లోగా డీమ్యాట్ ఖాతాలు, ఎంఎఫ్ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం తప్పనిసరి చేసింది. వెరసి నామినీ వివరాలు అందించడం లేదా నామినేషన్‌ను ఉపసంహరించేందుకు మరో ఆరు నెలల గడువు లభించింది. 2022 ఆగస్ట్1లోగాఎంఎఫ్ సబ్స్క్రయిబర్లకు నామినీ వివరాలివ్వడం లేదా నామినేషన్ నుంచి తప్పుకునేందుకు 2022 జూన్‌లో సెబీ తప్పనిసరి చేసింది. ఆపై 2022 అక్టోబర్ 1వరకూ గడువు పెంచింది. తదుపరి 2023 మార్చి31వరకూ మరోసారి గడువు పొడిగించింది. 2021 అక్టోబర్ తదుపరి డీమ్యాట్ ఖాతాలు తెరిచే ఇన్వెస్టర్లకు డిక్లరేషన్ ఫామ్ ద్వారా నామినీ వివరాలిచ్చేందుకు వీలు కల్పించింది. ఇదేవిధంగా నామినేషన్‌ను తప్పించేందుకూ వీలుంది. -
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్ ముగియకముందే మేల్కొండి!
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు నామినేషన్ సమర్పించేందుకు ఇచ్చిన గడువు మార్చి 31తో ముగియనుంది. ఎవరినైనా నామినీగా నమోదు చేయడం లేదంటే, నామినేషన్ ఆప్ట్ అవుట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడం తప్పనిసరి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇన్వెస్టర్ ఎంపిక చేసుకోకపోతే గడువు ముగిసిన తర్వాత వారి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులన్నీ స్తంభనకు గురవుతాయి. దాంతో పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. ఫండ్స్ పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాలకు నామినేషన్ లేదా నామినేషన్ వద్దంటూ డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ సెబీ 2022 జూన్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జూలై ఆఖరి వరకు గడువు ఇవ్వగా.. అక్టోబర్ వరకు పొడిగించారు. అప్పటికే పెట్టుబడులు కలిగిన వాటికి నామినేషన్ సమర్పించేందుకు 2023 మార్చి 31 వవరకు గడువు ఇచ్చింది. నామినేషన్ లేకుండా పెట్టుబడిదారు మరణించినట్టయితే.. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వారసులు లేదా కుటుంబ సభ్యులు క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా నామినేషన్‌ను సెబీ తీసుకొచ్చింది. -
వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్
ప్రపంచ బ్యాంకు కాబోయే అధ్యక్షుడు (అమెరికన్ నామినీ) భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు కోవిడ్ సోకింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా చేసిన రొటీన్ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అజయ్ బంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ వెల్లడించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన అజయ్ బంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తదితరులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అజయ్ బంగా మూడు వారాల ప్రపంచ పర్యటనలో భారత్ సందర్శన చివరిది. ఆఫ్రికా నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్, లాటిన్ అమెరికా మీదుగా ఆసియాకు చేరుకుంది. తన గ్లోబల్ లిజనింగ్ టూర్లో బంగా.. ఆయా ప్రాంతాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, వ్యాపార నాయకులు, వ్యవస్థాపకులు, పౌర సమాజంతో సమావేశమవుతూ వస్తున్నారు. దేశంలో గత కొద్ది రోజులుగా ఇన్ఫ్లూయెంజాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో క్రియాశీల కేసులు 7,026కి పెరిగాయి. -
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!?
న్యూయార్క్: నోబెల్ బహుమతుల ప్రకటనల నడుమ.. ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరికి వెళ్లబోతోందా? అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్ టైమ్ ఒక కథనం ప్రచురించింది. భారత్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హాలు నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్‌గా ఉన్నట్లు టైమ్ మ్యాగజీన్ కథనం ప్రచురించడం గమనార్హం. ఆల్ట్ న్యూస్ సైట్ తరపున ఫ్యాక్ట్ చెకర్స్గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్మేకర్ల నుండి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్‌గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్ విషయంలో అరెస్టైన జుబేర్.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. ‘‘భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్‌లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది’’ అంటూ అమెరికాలోని జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం.. 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా హౌజ్‌లు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి. ఇక ఈ ఇద్దరు ఫ్యాక్ట్ చెకర్స్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవెల్నీ, బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాత్లానా, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ అటన్‌బోరఫ్ తదితరులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: ఈసారి టార్గెట్ జపాన్? -
మీ పీఎఫ్ ఖాతాకు ఈ-నామినేషన్ కంపల్సరీ.. సులభమైన అప్డేట్ కోసం 10 స్టెప్స్ ఇవే!
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్లో నామినీ వివరాలు అప్డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్లు కూడా ఉంటాయి. కనుక ఇప్పుడే ఆలస్యం కాకుండా త్వరగా మీ ఈపీఎఫ్ ఈ- నామినేషన్ చేయండి. ఈ నామినేషన్ సులభంగా చేసేయండి ఇలా... ►ఈపీఎఫ్ఓ( EPFO ) వెబ్సైట్లోకి వెళ్లి, ‘సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లండి. ►‘ఫర్ ఎంప్లాయిస్’ విభాగంలో ‘మెంబర్ UAN/ఆన్లైన్ సర్వీస్’ ఆఫ్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ►మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ►లాగిన్ అయ్యాక 'మేనేజ్' ట్యాబ్ కింద, 'ఇ-నామినేషన్' ఎంచుకోండి. ►ఇప్పుడు అందులో మీ 'వివరాలను నింపి' ట్యాబ్ కింద ఉన్న 'సేవ్' క్లిక్ చేయండి. ►తర్వాత మీ కుటుంబ డిక్లరేషన్‌ను అప్డేట్ చేసేందకు మీ కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, జెండర్,రిలేషన్, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు (ఆఫ్షనల్), గార్డియన్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి అవసరమైన వివరాలను నింపిన తర్వాత ‘ఎస్’పై క్లిక్ చేయండి. ►ఇక ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను వివరాలను నింపే ఆఫ్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న 'యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్'పై క్లిక్ చేయండి. ►ఇందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు నింపిన తర్వాత వారి నగదు వాటాను నిర్ణయించుకుని ఆ మొత్తాన్ని అందులో నింపాలి. ఆపై ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి. ►ఇప్పుడు 'ఈ-సైన్' ఆఫ్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని(otp) సబ్మిట్ చేయండి. ►అయితే ఈ-నామినేషన్‌ను దాఖలు చేసేందుకు, ఈపీఎఫ్ సభ్యలు ముందుగా యూఏఎన్( UAN )మెంబర్ పోర్టల్‌లో వారి యూఏఎన్ ఖాతాను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారి మెంబర్ ఐడీ, ఎస్టాబ్లిష్మెంట్ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, తండ్రి/భార్య పేరు, సంబంధం, ఉద్యోగంలో చేరిన తేదీని నిర్ధారించుకోవాలి. వీటితో పాటు ప్రతి నామినీకి కేవైసీ( KYC) వివరాలను సమర్పించడంతో పాటు వారి PF/ EDL మొత్తం వాటాను కూడా తెలిపాల్సి ఉంటుంది. చదవండి: షావోమీ భారీ షాక్, లాభాలు రాలేదని వందల మంది ఉద్యోగులపై వేటు! -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త.. నామినీ పేరు మార్చుకోండి ఇలా..!
ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇక నుంచి నామినీ పేరును కూడా ఆన్లైన్ ద్వారా మార్చుకోవచ్చు అని తెలిపింది. పీఎఫ్ ఖాతాదారులందరూ నామినీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇందు కోసం ఈపీఎఫ్ఓ ఈ-నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇది పూర్తిగా డిజిటల్. దీని కోసం పీఎఫ్ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ పీఎఫ్ ఖాతాకు నామినీ పేరును జత చేసుకోవచ్చు. సామాజిక భద్రత పీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐ బీమా ప్రయోజనాలను పొందడానికి ఆన్లైన్ ఈ-నామినేషన్ తప్పనిసరి విషయం మనకు తెలిసిందే. ఒకవేళ నామినీ పేరు తప్పుగా నమోదు చేసిన, ఏదైనా ఇతరత్రా కారణాల వల్ల ఇంతకముందు మీరు నమోదు చేసిన నామినీ పేరును మార్చుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ తాజాగా కల్పిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం వరకు ఈ ఆప్షన్ అందుబాటులో లేదు, ఒకవేళ వచ్చిన ఆ ఆప్షన్ సరిగా పనిచేయలేదు. కానీ, ఇప్పుడు బగ్స్ తొలిగించడంతో పీఎఫ్ ఖాతాదారులు ఎటువంటి ఆటంకం లేకుండా నామినీ పేరు మార్చుకోవచ్చు. నామినీ పేరును మార్చడానికి ఈపీఎఫ్ఓ అనుమతి అవసరం లేదు. పీఎఫ్ నామినేషన్లో నమోదు చేసిన తాజా పేరు మాత్రమే చట్టపరమైన హోదా కల్పిస్తారు. పీఎఫ్ నామినీ పేరును ఎలా మార్చాలో కొత్త పేరును ఎలా చేర్చాలో తెలుసుకుందాం. #EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination. ईपीएफ सदस्य मौजूदा ईपीएफ/ईपीएस नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPFO #Services #Pension #ईपीएप #पीएफ #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/sBfHhMjLbp — EPFO (@socialepfo) March 1, 2022 పీఎఫ్ నామినీ పేరును ఎలా మార్చాలి? ఈపీఎఫ్ఓ https://unifiedportal-mem.epfindia.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ యుఏఎన్, పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. ‘మేనేజ్మెంట్’ ట్యాబ్ కింద ‘ఈ-నామినేషన్’పై క్లిక్ చేయండి. మీ కుటుంబం ఉంటే ‘అవును’ అని క్లిక్ చేయండి ఇప్పుడు నమోదు చేయలని అనుకున్న కొత్త నామినీ పేరు ఎంటర్ చేయండి. ‘నామినేషన్ వివరాలు’పై క్లిక్ చేయండి డిక్లరేషన్ తర్వాత, ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి ఓటీపీని పొందడానికి ‘e-Sign’ని ఎంచుకోండి ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఫిల్ చేయండి. ఇప్పుడు కొత్త నామినీ ఈపీఎఫ్ఓలో నమోదు అయింది. (చదవండి: ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు లక్కీ ఛాన్స్.. రూ.1కే సినిమా టికెట్!) -
ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్ చేయకపోతే..?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) చందాదారులకు అలర్ట్. ఈపీఎఫ్ సంస్థ ఈ-నామినేషన్ ప్రక్రియను ఇప్పుడు తప్పనిసరి చేసింది. గతంలో పలుమార్లు గడువు పొడిగించిన పీఎఫ్ సంస్థ.. తాజాగా ఆ వివరాలు నమోదు చేసేవరకు కొన్ని సేవలు పొందకుండా ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎలాంటి గడువు విధించక పోవడం గమనర్హం. ఈపీఎఫ్ నుంచి నిధుల ఉపసంహరణతో పాటు ఖాతాలో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయో చూసుకునే అవకాశాన్ని ఈ నెల జనవరి 1 నుంచి తొలగించింది. ఈ-నామినేషన్ పూర్తి చేసిన చందాదారులే ఆన్లైన్ సేవలు పొందవచ్చని స్పష్టం చేస్తోంది. ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ ఈపీఎఫ్ఓ గత కొంత కాలంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ.. భవిష్యత్తులో మరిన్ని సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొనిరావాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఈపీఎఫ్ చందాదారుడిగా నమోదైనప్పుడే సభ్యుల నామినీ వివరాలను కాగితం రూపంలో సేకరించింది. ఆ వివరాలు పూర్తిస్థాయిలో డిజిటైలేషన్ కాలేదు. దీంతో చందాదారుడు చనిపోయినపుడు వారసులకు ఈపీఎఫ్ మొత్తం, పింఛను, ఉద్యోగి డిపాజిట్ ఆధారిత బీమా(ఈడీఎల్ఐ) అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు ఈ-నామినేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. చందాదారులు ఈ వివరాలను నమోదు చేసుకోవాలని గత కొంతకాలంగా సూచిస్తూ వస్తోంది. ఇందుకు 2021 డిసెంబరు 31ను గడువని పేర్కొంది. అయినప్పటికీ కోట్ల మంది చందాదారులు వివరాలు నమోదు చేయలేదు. చివరి నిమిషంలో సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో సాధ్యం కాలేదు. దీంతో డిసెంబరు 31 తర్వాతా ఈ-నామినేషన్ నమోదుకు సంస్థ అనుమతి ఇచ్చింది. (చదవండి: కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు.. కోరుతుందేంటి?) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త..!
ఈపీఎఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబరు 31 తరువాత కూడా ఈ-నామినేషన్ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ-నామినేషన్ చేయడానికి ఎలాంటి గడువు తేదీ లేదు అని పేర్కొనడం కొసమెరుపు. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఈ రోజే నామినేషన్ దాఖలు చేయమని ఈపీఎఫ్ఓ ట్వీట్లో తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే బీమా డబ్బు, పెన్షన్ డబ్బుతో పాటుగా ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతారు. కొత్త నిబంధనల ప్రకారం, చందాదారుల ఆకస్మిక మరణం సంభవించినప్పుడు నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈపీఎఫ్ పొదుపును విత్ డ్రా చేయగలరు. Empower your family, file enomination. #EPFO pic.twitter.com/sY8EjuDjSs — EPFO (@socialepfo) December 29, 2021 ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్‌కు ఇంకా 4 రోజులే గడువు..!
ఈపీఎఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాకు డిసెంబర్ 31, 2021 లోపు నామినీని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే బీమా డబ్బు, పెన్షన్ డబ్బుతో పాటుగా ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతారు. కొత్త నిబంధనల ప్రకారం, చందాదారుల ఆకస్మిక మరణం సంభవించినప్పుడు నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈపీఎఫ్ పొదుపును విత్ డ్రా చేయగలరు. అలాగే, ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీం(ఈడిఎల్ఐ) ప్రయోజనాలను ఈపిఎఫ్ నామినేషన్లో పేర్కొన్న నామినీ మాత్రమే క్లెయిం చేసుకోవచ్చు. చందాదారులు ఒకరికంటే ఎక్కువ మంది నామినీలను కూడా జత చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ నామినీలందరి మధ్య వాటా శాతాన్ని కూడా నిర్ణయించవచ్చు. ఆన్లైన్లో ఖాతాదారులు నామినీని జతచేయవచ్చు. ఈపీఎఫ్ ఖాతాకు నామినీ ఏ విధంగా జత చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: అదిరిపోయిన బ్రిటన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్‌లోనే!) -
PF New Rule: ఈ-నామినేషన్ ఫైల్ చేయకపోతే.. ఈపీఎఫ్ ప్రయోజనాలు బంద్?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త రూల్ తీసుకొని వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 31 లోపు ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలకు నామినీ పేరును జత చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ నామినీ పేరును యాడ్ చేయకపోతే, ఈ రిటైర్మెంట్ బాడీ అందించే పలు ప్రయోజనాలను ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఈపీఎఫ్ అందించే ప్రయోజనాలను పొందాలంటే డిసెంబర్ 31 లోపల నామినీ పేరును తమ ఖాతాలకు జత చేసుకోవాలని, ఈ-నామినేషన్ ప్రక్రియను కూడా ఆన్లైన్ చేసినట్లు పేర్కొంది. భారత్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ దాదాపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వారికి ఈపీఎఫ్ఓ ఫండ్ ఒక ముఖ్యమైన ఆదాయపు వనరుగా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఖాతా నుంచి ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తంలో కట్ చేస్తారు. ఉద్యోగి ఖాతా నుంచి ఎంత మొత్తమైతే కట్ అవుతుందో, అంతే మొత్తంలో ఎంప్లాయర్స్ కూడా ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తారు. డిసెంబర్ 31 లోపల నామినీ వివరాలను అప్డేట్ చేయకపోతే, జనవరి 2022 నుంచి పెన్షన్, ఇన్సూరెన్స్ మనీ ఎలాంటి ప్రయోజనాలను ఉద్యోగులు పొందలేరు. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాల ప్రయోజనాలు నామినీ పొందేలా కొత్త నిబంధనను ఈపీఎఫ్ రూపొందించింది. ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్బీఐ బ్యాంక్..!) -
ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే రూ.7 లక్షలు రానట్లే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్లైన్ సేవలు అందిస్తుంది. దీంతో చిన్న చిన్న పనుల కోసం ప్రతిసారీ ఈపీఎఫ్ఓ సంస్థ కార్యాలయానికి సందర్శించాల్సిన అవసరం లేదు. ఈపిఎఫ్ ఈ-నామినేషన్ సర్వీస్ అనేది అలాంటి ఒక కొత్త ఫెసిలిటీ, దీనిని ఆన్లైన్లో ఉపయోగించుకోవచ్చు. ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్ఓ తన తాజాగా ట్వీట్ లో తెలిపింది. తాజా పీఎఫ్ నామినేషన్ లో పేర్కొన్న నామినీ పేరును ఫైనల్ గా పరిగణిస్తారు. అయితే ఖాతాదారుని తాజా నామినేషన్ తర్వాత ఇంతకు ముందు నామినేషన్ క్యాన్సిల్ చేసినట్లు పరిగణిస్తారు. ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే నామినీ జత చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువ పేర్కొన్న విధంగా చేయవచ్చు. #EPF सदस्य मौजूदा EPF/#EPS नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.#EPFO #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/rm3G2FaqKy — EPFO (@socialepfo) November 18, 2021 ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఎఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: 2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ?) -
జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..?
మనం ఎంతగానో ప్రేమించే వారు దూరమైతే కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో దూరమైన వ్యక్తికి సంబంధించి కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. జీవిత బీమా ఉంటే ఈ సవాళ్లను కొంత వరకైనా అధిగమించే శక్తిని సమకూర్చుకోవచ్చు. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణానికి గురైతే నామినీగా నమోదై ఉన్న వారు క్లెయిమ్ (జీవిత బీమా పరిహారం కోసం) ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా, వేగంగా నిర్వహిస్తే.. అంతే వేగంగా పరిహారం చేతికి అందుతుంది. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనమే ఇది. క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నామినీగా ఉన్నవారు పాలసీదారు మరణానికి సంబంధించి సమాచారాన్ని జీవిత బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. ఈ మెయిల్ లేదా ఫోన్ రూపంలో సమాచారం ఇవ్వొచ్చు. ఆ తర్వాత కావాల్సిన పత్రాలతో క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో పాలసీదారుల సౌలభ్యం కోసం బీమా సంస్థలు ఆన్లైన్లోనే చాలా వరకు ప్రక్రియలను అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేపడుతున్నాయి. ఆన్లైన్లో అనుమతిస్తున్నాయంటే.. భౌతికంగా శాఖల రూపంలో అనుమతించడం లేదని పొరపడకండి. వీలుంటే ఆయా బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి అయినా క్లెయిమ్‌ను దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మెయిల్ లేదా వాట్సాప్ లేదా కంపెనీ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించొచ్చు. ఏజెంట్ సాయాన్ని అయినా తీసుకోవచ్చు. కరోనా మరణ కేసుల్లో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు గాను ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. కొన్ని సాధారణ డాక్యుమెంట్లను కూడా క్లెయిమ్ దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి వస్తుంది. క్లెయిమ్ ఫారమ్‌ను బీమా సంస్థల పోర్టళ్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికెట్, వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్, మెడికల్ రికార్డులు లేదా పరీక్షల ఫలితాల కాపీలను క్లెయిమ్ ఫారమ్‌తోపాటు జత చేయాల్సి ఉంటుంది. అలాగే, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ కేవైసీ (చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలతో), క్యాన్సిల్డ్ చేసిన చెక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాద మరణం అయినా, కరోనా మరణం అయినా, సాధారణ మరణం అయినా క్లెయిమ్ ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థలు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేశాయి. ఆన్లైన్లోనే క్లెయిమ్‌ను దాఖలు చేసి, డాక్యుమెంట్లను ఆప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్, మొబైల్ యాప్, చాట్‌బాట్స్, వెబ్ పోర్టల్ ఏ రూపంలో అయినా బీమా కంపెనీని సంప్రదించొచ్చు. 30 రోజుల ప్రక్రియ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు మరణ పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. క్లెయిమ్ దాఖలు చేసిన రోజు నుంచి ఈ గడువు అమలవుతుంది. ఒకవేళ పాలసీదారు మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు బీమా సంస్థలు దర్యాప్తు అవసరమని భావించొచ్చు. కనుక దర్యాప్తు అవసరమైన కేసుల్లో 90 రోజుల సమయాన్ని బీమా సంస్థలు తీసుకోవచ్చు. అంటే 90 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి సందేహాల్లేకుండా, అన్ని పత్రాలు దాఖలు చేసిన కేసుల్లో ఏడు రోజుల వ్యవధిలోనే బీమా సంస్థలు పరిహారాన్ని విడుదల చేస్తున్నాయి. గతంతో పోలిస్తే క్లెయిమ్ ప్రక్రియ డిజిటలైజ్ కారణంగా వేగాన్ని సంతరించుకుందని చెప్పుకోవాలి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు క్లెయిమ్‌ను చాలా ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ 48 గంటల్లోనే క్లెయిమ్‌ను పరిష్కరించేస్తున్నాయి. కాకపోతే కంపెనీ కోరిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత 48 గంటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24 గంటల్లోనే ఈ ప్రక్రియను ముగించేస్తోంది. ఇక పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ కేవలం మూడు గంటల్లోనే పరిష్కరిస్తుండడం గమనించాలి. గతంతో పోలిస్తే క్లెయిమ్‌ల విషయంలో బీమా సంస్థలు మరింత వేగాన్ని, నాణ్యతను సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ల పరంగా.. కొన్ని బీమా సంస్థలు డాక్యుమెంట్ల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాయి. కరోనా వైరస్ నియంత్రణ వల్ల అమలవుతున్న ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నాయి. ఆస్పత్రిలో మరణం నమోదైతే సాధారణంగా క్లెయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ (మరణ ధ్రువీకరణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి డెత్ సర్టిఫికెట్ అందుకునేందుకు సాధారణంగా 10–15 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టే పరిస్థితి ఉండచ్చు. అందుకనే ఎల్ఐసీ డెత్ సర్టిఫికెట్ బదులు.. మరణించిన తేదీ, సమయం, కారణం తదితర వివరాలతో ఆస్పత్రులు జారీ చేసే డెత్ సమ్మరీని కూడా అనుమతిస్తోంది. డెత్ సమ్మరీ సర్టిఫికెట్‌పై ఎల్ఐసీ క్లాస్–1 అధికారి లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకంతోపాటు.. క్రిమేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించడం ద్వారా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఎల్ఐసీ అనుమతిస్తోంది. అలాగే, ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్ డెత్ సర్టిఫికెట్ దాఖలు నుంచి మినహాయింపునిచ్చాయి. ఆస్పత్రుల్లో చనిపోయిన వారికే ఈ మినహాయింపు పరిమితం. ఎందుకంటే ఆస్పత్రి యాజమాన్యాలు మరణానికి కారణం, ఇతర వివరాలతో డెత్ సమ్మరీని జారీ చేస్తాయి. కనుక దీన్ని ఆధారంగా పరిగణిస్తున్నాయి. ఇతర క్లెయిమ్‌లు జీవిత బీమా కంపెనీల నుంచి తీసుకునే ఇతర పాలసీల విషయంలోనూ క్లెయిమ్‌లకు సంబంధించి నిబంధనల పరంగా సడలింపు అమలవుతోంది. గడువు తీరిన పెన్షన్ పాలసీల (యాన్యుటీ ప్లాన్లు) విషయంలో పాలసీదారు లైఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం సాధారణంగా వ్యక్తిగతంగా హాజరుకావాలి. కరోనా మహమ్మారి తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఎల్ఐసీ కూడా యాన్యుటీ ప్లాన్ల విషయంలో లైఫ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపును కల్పించింది. వీడియోకాల్ రూపంలో ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎస్బీఐ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ సంస్థలు సైతం యాన్యుటీ ప్లాన్ల విషయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తున్నాయి. -
ఎల్ఐసీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఏ విధంగా ధరఖాస్తు చేసుకోవాలి..?
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. దేశంలోని ప్రతి మధ్య తరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఫ్యామిలీ ఉండదంటే అతిశయోక్తి కాదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతీ చిన్న పల్లెకు ఎల్ఐసీ విస్తరించింది. ఎప్పటికప్పుడు పాలసీదారుల కోసం కొత్త కొత్త పాలసీలు తీసుకొని వస్తూ వారికి అండగా ఉంటుంది. ఒకవేల ఆ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలి. తెలియకపోతే ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే, డెత్ క్లెయిం ఫైల్ చేసే ప్రక్రియ ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి. డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. దీని కోసం ముందుగా మీరు పాలసీ జారీ చేసిన హోమ్ శాఖను సంప్రదించాలి. ఆ బ్యాంచ్‌కి వెళ్లేముందు అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లాలి. డెత్ క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించే ముందు పాలసీ చేసిన ఏజెంట్ లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకాన్ని తీసుకోవాలి.(చదవండి: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!) ఎల్ఐసీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా చేయాలి..? డెత్ క్లెయిం ఫైలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి, పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ హోమ్ బ్రాంచీని నామినీ సందర్శించాలి. నామినీ పాలసీదారుడి మరణం గురించి వారికి తెలియజేయాలి. నామినీ బ్యాంకు ఖాతాలోకి నిధుల బదిలీ కోసం బ్రాంచ్ అధికారి ఫారం 3783, ఫారం 3801, ఎన్‌ఈఎఫ్‌టి ఫారాలను ఇస్తారు. పైన పేర్కొన్న ఫారాలతో పాటుగా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ల్లో ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డు కాపీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్ పోర్ట్, మరణించిన పాలసీదారుడి ఏదైనా ఐడి రుజువు(ప్రాధాన్యతగా ఆధార్ కార్డు). పూర్తిగా నింపిన ఫారాలు, డాక్యుమెంట్లతో పాటుగా నామినీ డిక్లరేషన్ ఫారమ్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాలసీదారుడు మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం, మరణానికి కారణం గురించి పేర్కొనాల్సి ఉంటుంది. ఎన్‌ఈఎఫ్‌టి ఫారంతో పాటు నామినీ బ్యాంకు ఖాతాదారుని పేరు, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ గల రద్దు చేసిన చెక్ లీఫ్, కాపీని నామినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు పాస్ బుక్, ఫోటోకాపీని ఇతర డాక్యుమెంట్లతో పాటుగా జతచేయకపోతే డాక్యుమెంట్లు ఆమోదించబడవు. పైన పేర్కొన్న డాక్యుమెంట్లను సబ్మిట్ చేసే సమయంలో నామినీ తన పాన్, మరణించిన పాలసీదారుడి ఐడి ప్రూఫ్, వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ బ్యాంక్ పాస్ బుక్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. డెత్ క్లెయిం ప్రాసెసింగ్ కోసం డాక్యుమెంట్లు ఆమోదించడానికి ముందు ఎల్ఐసీ ఆఫీసర్ ఒరిజినల్ పాస్ బుక్ కాపీతో వెరిఫై చేస్తారు. ఈ డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచనాత్మకంగా మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి. తుది మొత్తాన్ని నామినీ బ్యాంకు ఖాతాలోకి క్రెడిట్ చేయడానికి ముందు ఎల్ఐసీ అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. డాక్యుమెంట్లు ఎల్ఐసీ బ్రాంచీలో సబ్మిట్ చేసిన తర్వాత, ఎక్ నాలెడ్జ్ మెంట్ రసీదును సురక్షితంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇతర అదనపు డాక్యుమెంట్లు అవసరం లేనట్లయితే, అప్పుడు నామినీ ఒక నెల వ్యవధిలో సెటిల్ మెంట్ మొత్తాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే, ఒకవేళ ఒక నెలలోపు మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ కాకపోతే, అప్పుడు నామినీ రసీదుని తీసుకొని ఎల్ఐసీ బ్రాంచ్‌కు వెళ్లి స్టేటస్ కోసం అడగాల్సి ఉంటుంది. -
కరోనాతో మరణిస్తే డబ్బులు డ్రా చేయడం ఎలా?
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2.83 లక్షలు. కరోనాతో మరణించిన వారిలో ధనవంతుల నుంచి దినసరి కూలీల వరకు ఉన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు/ఖాతాదారులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న సందేహాలు వస్తున్నాయి. సాధారణంగా పదవి విరమణ తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీ మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ పథకం కింద రూ.7 లక్షల వరకు బీమా డబ్బులు ఉద్యోగి కుటుంబ సభ్యులకు లభిస్తాయి. చనిపోయినవారి ఈపీఎఫ్ ఖాతా నుంచి వారి కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోవడానికి నామినీ ఈపీఎఫ్ ఫారం 20 ద్వారా ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణను పొందవచ్చు. సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ -19 వల్ల చాలా మంది చనిపోతున్నందున, ఈ బీమా ప్రయోజనం మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎంతో సహాయపడుతుంది. మరణించిన వ్యక్తికి నామినీ లేకపోతే, చట్టబద్ధమైన వారసుడు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఫారం 20 నింపేటప్పుడు ఈపీఎఫ్ సభ్యుడి పేరు, తండ్రి / భర్త పేరు, సభ్యుడు చివరిగా పనిచేసిన సంస్థ పేరు & చిరునామా, ఈపీఎఫ్ ఖాతా సంఖ్య, చివరి పనిదినం, ఉద్యోగం మానెయ్యడానికి కారణం(మరణించిన సభ్యుడి విషయంలో “మరణం” పేర్కొనండి), మరణించిన తేదీ (dd / mm / yyyy), అతని / ఆమె మరణించిన రోజున సభ్యుడి వైవాహిక స్థితి వంటి వివరాలు నింపాలి. అలాగే, నామినీ/చట్టబద్ధమైన వారసుడు వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. నామినీ/చట్టబద్ధమైన వారసుడు పేరు, తండ్రి / భర్త పేరు, లింగం, వయస్సు (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), వైవాహిక స్థితి (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), మరణించిన సభ్యుడితో సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి. అలాగే, పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పొందాలనుకుంటే ఆ కాలమ్ టిక్ చేయాలి. లేదా అకౌంట్ ద్వారా పొందాలనుకుంటే అకౌంట్ వివరాలు, క్యాన్సల్డ్ చెక్ సబ్మిట్ చేయాలి. నామినీ/ హక్కుదారుడు ఆధార్ లింకైన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. క్లెయిమ్ ప్రాసెస్‌లో పలు దశల్లో ఎస్ఎంఎస్లు వస్తాయి. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పొందాలంటే క్యాన్సల్డ్ చెక్ ఇవ్వడం తప్పనిసరి. పూర్తి అడ్రస్ పిన్‌కోడ్‌తో సహా వెల్లడించాలి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది. చదవండి: టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి -
భారత సంతతి సాధికారతకు శుభరూపం
యూఎస్‌లోని ఉన్నతస్థాయి బాధ్యతల్లోకి భారత సంతతి మహిళలు రావడం ఇటీవలి కాలంలో సాధారణం అయింది! స్త్రీ సాధికారతకు ఇది శుభరూప తరుణంలా కనిపిస్తోంది. తాజాగా రూప రంగ పుట్టగుంట ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయ్యారు. శుభా తటవర్తి విప్రో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదవి చేపట్టనున్నారు. రూప రంగ పుట్టగుంట ప్రస్తుతం వాషింగ్టన్ ‘డీసీ రెంటల్ హౌసింగ్ కమిషన్’ అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆమెను వాషింగ్టన్ డీసీ జిల్లా ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె ఎంపికను సెనెట్ ఆమోదిస్తే కనుక అమెరికాలో ఫెడరల్ జడ్జి అయిన తొలి భారత సంతతి మహిళగా రూప గుర్తింపు పొందుతారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కావడానికి ముందు 2013 నుంచి 2019 వరకు ఆమె క్రిమినల్ న్యాయవాదిగా ఉన్నారు. రూపతోపాటు మరో తొమ్మిది మందిని అత్యున్నస్థాయి న్యాయ సంబంధ స్థానాలకు నామినేట్ చేసిన వైట్ హౌస్.. ‘‘ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నిష్ణాతులు అమెరికాలోని భిన్నజాతుల ప్రజలకు ప్రయోజనకరమైన సేవలను అందిస్తారని అమెరికా అధ్యక్షుడు బలంగా విశ్వసిస్తున్నారు..’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. రూపకు ఫ్యామిలీ కోర్టు న్యాయవాదిగా కూడా రెండేళ్ల పాటు అనేక కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. 2008 నుంచి 2011 వరకు ఆమె లా క్లర్క్‌గా పని చేశారు. 2007లో ఒహియో స్టేట్ మోర్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ‘లా’లో పట్టభద్రురాలయ్యారు. ఇక శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న సీనియర్ టెకీ శుభా తటవర్తి మంగళవారం విప్రో కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సి.టి.ఓ.) గా నియమితులయ్యారు. వాల్‌మార్ట్ నుంచి విప్రోకి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్‌లో పదేళ్లు సేవలు అందించారు. వాల్‌మార్ట్‌లో సీనియర్ డైరెక్టర్‌గా, పేపాల్‌లో హెడ్ ఆఫ్ ప్రాడక్ట్‌గా ఆమె అనుభవం విప్రో సి.టి.వో. అయేందుకు తోడ్పడింది. రూప కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి ఎస్బీఐ వినియోగదారులు ఇంట్లో నుంచే నామినీ పేరు జత చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం ఇక నుంచి ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది.(చదవండి: అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం!) మీరు బ్యాంక్ అకౌంట్‌ను నామినీ పేరును మూడు రకాలుగా జత చేయవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేల కనుక మీరు ఎస్బీఐ యోనో యాప్ ఇంస్టాల్ చేసుకుంటే అందులోకి లాగిన్ అయిన తర్వాత కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్లాలి. ఇప్పుడు మీకు ఆన్లైన్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు సులభంగానే మీ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఏమైనా అంటే చనిపోతే అయితే అప్పుడు ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులుపై నామినీకి పూర్తి అధికారం ఉంటుంది. We have a good news! Now SBI customers can register their nominee by visiting our branch or logging into https://t.co/YMhpMw26SR.#SBI #StateBankOfIndia #OnlineSBI #InternetBanking pic.twitter.com/AMvWhExDre — State Bank of India (@TheOfficialSBI) February 3, 2021 ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా: మీరు మీ యూజర్పేరు, పాస్‌వర్డ్‌తో onlinesbi.com లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత మెను నుంచి 'రిక్వెస్ట్ & ఎంక్వైరీస్' టాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్ నామినేషన్ ఎంపికను ఎంచుకోండి. మీరు కొత్త నామినీని ఏ ఖాతాకు జోడించాలని అనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి. ఇప్పుడు 'ప్రొసీడ్' టాబ్‌పై క్లిక్ చేయండి. నామినీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఖాతాదారుడితో సంబంధిత వివరాలు నమోదు చేయండి ఇప్పుడు "సబ్మిట్" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన హై-సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. కొత్త నామినీని జోడించడానికి 'Confirm' టాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. -
రూత్ స్థానంలో మహిళనే నామినేట్ చేస్తాం
వాషింగ్టన్: కేన్సర్‌తో పోరాడి కన్నుమూసిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్ స్థానంలో మరో మహిళనే నామినేట్ చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉత్తర కరోలినాలోని ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ సుప్రీం న్యాయమూర్తిని వచ్చేవారంలో నామినేట్ చేస్తామని మహిళకే ఆ అవకాశం దక్కుతుందన్నారు. ఒక అధ్యక్షుడిగా సుప్రీం జడ్జిని నియమించే అధికారం పూర్తిగా తనకి ఉందన్నారు. సంప్రదాయ భావ జాలం కలిగిన రిపబ్లికన్ పార్టీ సుప్రీం కోర్టు జడ్జిని నియమించడం ద్వారా న్యాయవ్యవస్థపైనా, ఇతర సామాజిక అంశాలపైనా పట్టు సాధిస్తుందన్న ఆందోళన ఇప్పటికే డెమొక్రాట్లలో ఉంది. అధ్యక్ష ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో తనకి అంది వచ్చిన ఈ అవకాశాన్ని ట్రంప్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే అధ్యక్ష ఎన్నికల తర్వాతే సుప్రీం కోర్టు జడ్జి నియామకం జరగాలన్న డెమొక్రాట్ల వాదనని ఆయన పట్టించుకోలేదు. 45 మంది వరకు తమ జాబితాలో ఉన్నారని, త్వరలోనే వారిలో షార్ట్ లిస్ట్ చేసి వచ్చే వారమే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ట్రంప్ వెల్లడించారు. -
ఇలా చనిపోతే బీమా హుళక్కే!
బీమా పాలసీ ఉన్న వారు మరణానికి గురైతే బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం అన్నది సహజమే. బీమా పాలసీ తీసుకునేదే అందుకు కదా..! అయితే, ఏ కారణంతో మరణించినా జీవిత బీమా పరిహారం వస్తుందని నిశ్చింతగా ఉంటే కుదరదు. ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రకాల మరణాలకు జీవిత బీమా పాలసీల్లో కవరేజీ ఉండదన్న విషయం ముమ్మాటికీ నిజం. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కలిగిన వారు లేదా తీసుకోవాలనుకునే వారు ఏ మరణాలకు పరిహారం ఉండదన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలే ఇవి... హత్యకు గురైతే.. ఉదాహరణకు.. పాలసీదారుడు హత్య కారణంగా చనిపోయినట్టు ధ్రువీకరణ అయితే, అదే సమయంలో నామినీయే హత్యలో పాల్గొన్నట్టు విచారణలు స్పష్టం చేస్తుంటే బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. నామినీపై హత్యాభియోగాలు తొలగిస్తే లేదా నిర్దోషి అయితేనే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. కేసు నామినీకి అనుకూలంగా వచ్చేంత వరకు బీమా సంస్థ పరిహార చెల్లింపులను నిరవధికంగా నిలిపివేస్తుంది’’ అని ఇండియన్ మనీ డాట్ కామ్ సీఈవో సీఎస్ సుధీర్ తెలిపారు. అలాగే, పాలసీదారులు నేరపూరిత చర్యల్లో పాల్గొని చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీలు పరిహార చెల్లింపును తిరస్కరిస్తాయి. ‘‘నేర కార్యకలాపాల్లో పాలసీదారుడు పాల్గొన్నట్టు నిరూపితం అయితే నామినీలకు పరిహార చెల్లింపు జరగదు. ఎటువంటి నేర కార్యక్రమంలో పాల్గొని చనిపోయినా కానీ, చట్ట ప్రకారం అది కవరేజీ పరిధిలోకి రాదు. ఒకవేళ పాలసీదారుకు నేరపూరిత చరిత్ర ఉండుండి, సహజ కారణాల వల్ల.. ఉదాహరణకు స్వైన్ ఫ్లూ లేదా డెంగీ లేదా పిడుగుపాటు కారణంగా చనిపోతే పరిహారాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు’’ అని పాలసీబజార్‌కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సంతోష్ అగర్వాల్ తెలిపారు. ముందస్తు వ్యాధుల వల్ల.. టర్మ్ పాలసీ తీసుకునే నాటికి ఉన్న అనారోగ్య సమస్యలను దరఖాస్తు పత్రంలో తప్పకుండా వెల్లడించాలి. లేదంటే ఆ సమస్యల కారణంగా ఆ తర్వాత కాలంలో పాలసీదారుడు మరణించినట్టయితే.. బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజీ కాని మరణ కేసులు ఎన్నో ఉన్నాయని సుధీర్ వెల్లడించారు. ‘‘స్వయంగా చేసుకున్న గాయాల కారణంగా, లేదా ప్రమాదకర విన్యాసాల కారణంగా, లైంగింకంగా సంక్రమించే హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటి వ్యాధుల కారణంగా లేదా మందుల అధిక మోతాదు కారణంగా చనిపోతే.. వారికి ప్రత్యేక రైడర్లు ఉంటే తప్ప బీమా సంస్థలు పరిహారాన్ని నిరాకరిస్తాయి’’ అని సుధీర్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్నా.. బీమా పాలసీ తీసుకున్న వారు, మొదటి ఏడాది కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టయితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. అయితే, చాలా కంపెనీలు పాలసీదారులకు రెండో ఏడాది నుంచి ఆత్మహత్యకు కూడా పరిహారాన్ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ నియమ, నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రకృతి విపత్తుల వల్ల.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వ్యక్తి భూకంపం, తీవ్ర తుపాను వంటి ప్రమాదాల్లో మరణించినట్టయితే నామినీలకు పరిహారం రాదు. ‘‘సునామీ, భూకంపం వంటి ప్రకృతి ఉత్పాతాల వల్ల తలెత్తే మరణాలు టర్మ్ పాలసీల్లో కవర్ అవ్వవు’’ అని సుధీర్ తెలిపారు. ప్రసవం కారణంగా.. పాలసీ కలిగిన వారు గర్భధారణ కారణంగా లేదా ప్రసవం సమయంలో చనిపోయినట్టయితే బీమా సంస్థ నామినీకి పరిహారం చెల్లించదు. ఇటువంటి మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవర్ కావని అగర్వాల్ వెల్లడించారు. ప్రమాదకరమైన కార్యకలాపాలు.. సాహసోపేత లేదా ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మరణానికి గురైతే అటువంటి సందర్భాలకు బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ఎందుకంటే ఈ తరహా కార్యకలాపాల్లో ప్రాణ ప్రమాదం అధికంగా ఉంటుంది. ‘‘ప్రమాదకరమైన క్రీడలు.. కార్, బైక్ రేసింగ్, స్కైడైవింగ్, పారాగ్లైడింగ్, పారాచ్యూట్ తదితర వాటిల్లో పాల్గొనే వారు పాలసీ తీసుకునే సమయంలోనే వాటి గురించి వెల్లడించాలి. లేకపోతే ఈ వివరాలను వెల్లడించని కారణంగా బీమా కంపెనీలు భవిష్యత్తులో వచ్చే క్లెయిమ్‌లను అంగీకరించవు’’ అని అగర్వాల్ సూచించారు. మద్యం ప్రభావం కారణంగా.. ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాలు తీసుకుని వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీ పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తుంది. ‘‘మద్యం తరచుగా తీసుకునే వారికి, మాదకద్రవ్యాల అలవాటు ఉన్న వారికి బీమా కంపెనీలు అరుదుగానే పాలసీలను ఇస్తుంటాయి. టర్మ్ బీమా తీసుకునే సమయంలో ఈ అలవాట్ల గురించి వెల్లడించకపోతే, ఆ తర్వాత ఈ అలవాట్ల కారణంగా పాలసీదారులు మరణానికి గురైతే.. పరిహారాన్ని కంపెనీలు నిలిపివేస్తాయి. అధికంగా మద్యం సేవించే వారికి టర్మ్ ఇన్సూరెన్స్ లభించడం కష్టమే’’ అని సుధీర్ వివరించారు. ‘‘ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకునే వారు అయితే, భవిష్యత్తులో మరణ పరిహార క్లెయిమ్ తిరస్కరణకు గురికాకూడదని భావిస్తే.. ఆల్కహాల్‌ను ఏ మోతాదులో తీసుకుంటారనే వివరాలను ప్రపోజల్ పత్రంలో వెల్లడించడం తప్పనిసరి’’ అని కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ అక్చుయరీ సునీల్‌శర్మ సూచించారు. పొగతాగే అలవాటు దాచిపెడితే.. సాధారణంగా పొగతాగే అలవాటును చాలా మంది బీమా పాలసీ దరఖాస్తు పత్రాల్లో వెల్లడించరు. వెల్లడిస్తే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుందని అలా చేస్తుంటారు. కానీ, పొగతాగే అలవాటు ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అనారోగ్య అలవాటు కారణంగా వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలవాటు తీవ్రతను బట్టి కేన్సర్ వంటివి సోకి మరణించే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ విధమైన రిస్క్ ఉంటుంది కనుకనే బీమా కంపెనీలు పొగతాగే అలవాటు ఉన్న వారికి బీమా ప్రీమియంను అధికంగా నిర్ణయిస్తుంటాయి. పొగతాగే అలవాటును బీమా పాలసీల్లో వెల్లడించని వారు, ఆ తర్వాత అదే అలవాటు కారణంగా అనారోగ్యంతో మరణిస్తే పరిహారాన్ని తిరస్కరించేందుకు దారితీస్తుందని సుధీర్ తెలిపారు. పాలసీ దరఖాస్తును పూర్తిగా చదివిన తర్వాతే టర్మ్ పాలసీని తీసుకోవాలని.. మినహాయింపుల గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని సూచించారు. -
ప్రణాళికతోనే ప్రశాంతత
భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా. భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి... అనురాగ్ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్ చేస్తాడు. తన కెరీర్ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్ టైమ్ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్‌టైమ్ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి. వైద్యనాథన్ (44) ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్‌కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఆస్తుల వివరాలు... వైద్య నాథన్ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్ లేదా డిజిటల్ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైద్యనాథన్ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. వైద్యనాథన్ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు. దాంతో వైద్యనాథన్ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్ సభ్యుడు కావడంతో వైద్యనాథన్‌కు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్ మరణించే నాటికి అతని ఈపీఎఫ్ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్డేట్ అయి లేదు. బ్యాలన్స్ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వైద్యనాథన్ రియల్ ఎస్టేట్‌లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్ ఎస్టేట్‌పైనా ఎక్స్పోజర్ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్‌లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి. -
మీకొక నామినీ కావాలి..?
ఎన్నో రకాల ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమనే అలవాటు నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు ఆర్జించే ప్రతీ వ్యక్తి పేరిట బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో పెట్టుబడులు ఉంటుంటాయి. భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం వీటిని ఆశ్రయించే వారు ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్ చేయడమనే కాకుండా, సంబంధిత వ్యక్తికి ప్రాణ ప్రమాదం జరిగితే పెట్టుబడులన్నీ కుటుంబానికి చెందేలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పెట్టుబడి సాధనంలో నామినీ పేరును రిజిస్టర్ చేయడం లేదా విల్లు రాయడం... ఈ రెండింటిలో ఏదో ఒక్కటైనా తప్పనిసరిగా చేయడాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడినట్టు అవుతుంది. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది... ఓ ఇన్వెస్టర్ తను మరణం సంభవిస్తే, తన పేరిట ఉన్న పెట్టుబడులను స్వీకరించేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఫలానా అంటూ వారి పేరును నమోదు చేయడమే నామినేషన్ . ఆర్థిక సేవల సంస్థ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ, బీమా సంస్థలకు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ఇది. నామినీ నమోదు చేయడం వల్ల పెట్టుబడులను వారి పేరిట బదిలీ చేయడం సులభతరం అవుతుంది. ఇన్వెస్టర్ మరణించిన తర్వాత వారి పేరిట ఉన్న పెట్టుబడులను నామినీగా ఉన్న వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ నమోదు చేసుకోకుండా, ఓ ఇన్వెస్టర్ మరణించినట్టయితే అప్పుడు వారసులు ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తుంది. క్లెయిమ్ చేసుకునే వారు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, ఇన్వెస్టర్‌తో తనకున్న అనుబంధం (లీగర్ హేర్ సర్టిఫికెట్), తనకున్న హక్కులను రుజువు చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కువ సమయం, శ్రమతో కూడిన పని. ప్రతీ ఇన్వెస్టర్ నామినీ పేరును నమోదుతో పాటు, నిర్ణీత కాలానికి ఓసారి సమీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే, ఉదాహరణకు... వివాహానికి పూర్వం బ్యాంకు ఖాతా తెరిచిన వారు, పెట్టుబడులు పెట్టిన వారు తమ తండ్రి లేదా తల్లి లేదా సోదరుల్లో ఒకరి పేరును నామినీగా ఇచ్చి ఉండొచ్చు. వివాహం అయిన తర్వాత నామినీగా తన భార్యను చేర్చుకోవడం సరైన చర్య. మరో ప్రత్యామ్నాయంగా విల్లు రాసుకోవడం కూడా మంచిదే. తన తదనంతరం తన పేరిట ఉన్న పెట్టుబడులు, ఆస్తులు ఎవరికి ఎంత మేర చెందాలనేది విల్లులో స్పష్టం చేసినా సరిపోతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... విల్లు రాసినట్టయితే, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన నామినేషన్ రద్దయినట్టే. షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో మాత్రం నామినేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. భిన్న సాధనాల్లో నామినేషన్ , క్లెయిమ్ ప్రక్రియ వివరాలను పరిశీలిద్దాం... జీవిత బీమా కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల పాలవకుండా ఆదుకునే సాధనమే జీవిత బీమా. కనుక జీవిత బీమా పాలసీల్లో నామినీ పేరును నమోదు చేయడం ఎంతో అవసరం. ఎవరిని: పాలసీ హోల్డర్ మరణిస్తే బీమా పరిహారం ఎవరికి చెందాలని భావిస్తే వారి పేరును నామినీగా పేర్కొనాలి. సాధారణంగా వారసులు లేదా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులను బీమా సంస్థ సూచిస్తుంది. రక్త సంబంధీకులను అయినా నామినీగా నమోదు చేయవచ్చు. రక్త సంబంధీకులు కాని వారిని నామినీగా నమోదు చేయడానికి అవకాశం లేదు. నామినీ ఎన్ఆర్ఐ అయినా నమోదుకు అనుమతి ఉంటుంది. కాకపోతే క్లెయిమ్ మొత్తాన్ని భారత్‌లోని బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించడం జరుగుతుంది. ప్రక్రియ: నామినీ పూర్తి పేరు, వయసు, వారితో ఇన్వెస్టర్‌కు ఉన్న అనుబంధం వివరాలను బీమా పాలసీ తీసుకునే సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా నామినీలుగా పేర్కొనవచ్చు. అప్పుడు విడిగా ఒక్కో నామినీకి ఎంత మొత్తం అనేది శాతం వారీగా ఆప్షన్ ఇవ్వాలి. పాలసీ కాల వ్యవధిలో నామినీని ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. చివరిగా ఇచ్చిన నామినేషనే వ్యాలిడేషన్ లో ఉంటుంది. బీమా పాలసీ తీసుకున్న తర్వాత మూడేళ్లు ముగిసేలోపు క్లెయిమ్ దరఖాస్తు వస్తే బీమా సంస్థలు 120 రోజుల్లోపు పరిష్కరిస్తాయి. మూడేళ్లు దాటితే 15 రోజుల్లోపు క్లెయిమ్ పరిష్కారాన్ని పూర్తి చేస్తాయి. ఎవరికి: నామినీకి క్లెయిమ్ హక్కు ఉంటుంది. ఒకవేళ విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తులకే పరిహారం చెల్లిం స్తారు. గందరగోళానికి అవకాశం లేకుండా ఉండాలంటే, నామినీగా, విల్లులోనూ ఒకే పేరును పేర్కొనడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిబంధనల మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు నామినీ ఆప్షన్ ఇవ్వాలి. అయితే, నామినేషన్తప్పనిసరేమీ కాదు. ఇన్వెస్టర్లు స్వీయ ప్రయోజనాల కోణంలోనే నామినీని తప్పనిసరిగా రికార్డు చేసుకోవడం అవసరం. ఎవరిని: ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వ్యక్తి ఎవరినైనా నామినీగా పేర్కొనవచ్చు. కాకపోతే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. మైనర్లనూ నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఎన్ర్ఐలను కూడా నామినీగా నమోదు చేసుకోవచ్చు. అయితే, సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్త, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్లను నామినీగాలు పేర్కొనరాదు. నమోదు ప్రక్రియ: పెట్టుబడులకు సంబంధించి తొలుత దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ నామినేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లయినా నామినీలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఒక్కో నామినీకి మొత్తం విలువలో ఎంత మేర చెల్లించాలన్న శాతాన్ని కూడా పేర్కొనవచ్చు. ఎంతన్నది పేర్కొనకపోతే ఒకరికి మించి నామినీలు ఉంటే అప్పుడు అందరు నామినీలకు సమానంగా చెల్లిస్తారు. నామినీ పేరును పేర్కొంటూ దరఖాస్తుపై ఇన్వెస్టర్ సంతకం చేయాలి. జాయింట్ హోల్డర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే అందరి సంతకాలు అవసరం. ముఖ్యంగా ఫండ్స్‌లో ప్రతీ ఫోలియోకు విడిగా నామినేషన్ రిజస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అన్నింటికీ ఒకటే వర్తించదు. క్లెయిమ్: నామినీ ఎవరైనా కానీ, ఇన్వెస్టర్ మరణించిన తర్వాత క్లెయిమ్ చేసుకునే మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టబద్ధమైన వారసులకు అందించాల్సి ఉంటుంది. అందుకే వారసులనే నామినీగా పేర్కొనడం మంచిదనేది నిపుణుల మాట. ఈక్విటీ షేర్లు కంపెనీల చట్టం, వాటాదారులు తమ పేరిట నామినేషన్ నమోదుచేసుకునేందుకు అనుమతిస్తోంది. కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు, జాయింట్ అకౌంట్ హోల్డర్స్ సైతం నామినేట్ చేయవచ్చు. అయితే, వ్యక్తులనే నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది. సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్తను నామినీగా నమోదు చేయడం కుదరదు. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా నమోదు చేయొచ్చు. నమోదు ప్రక్రియ: డీమ్యాట్ రూపంలో షేర్లను కలిగి ఉంటే డీమ్యాట్ ఖాతాను నిర్వహించే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) నామినేషన్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా ప్రారంభ సమయంలో నామినీ కోసం ప్రత్యేకంగా ఒక పేజీ కూడా ఉంటుంది. అక్కడే నామినీ పేరు, ఫొటో, వయసు, ఈ మెయిల్ ఐడీ, అనుబంధం, బ్యాంకు ఖాతా, చిరునామా వివరాలు ఉంటాయి. ఖాతా ప్రారంభంలో నామినీ వివరాలను ఇవ్వని వారు ఆ తర్వాత ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లెయిమ్: ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లో నామినీ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే వారి పేరిట డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. నామినేషన్ లేకపోతే సంబంధిత షేర్లను ఇన్వెస్టర్ వారసులకు అందించడం జరుగుతుంది. ఇన్వెస్టర్ నామినేషన్ తోపాటు విల్లు కూడా రాసి ఉంటే కేవలం నామినేషన్నే పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకు డిపాజిట్లు గతంలో అయితే నామినేషన్‌ను బ్యాంకులు అంతగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలి కాలంలో ఖాతా ప్రారంభ సమయంలో, డిపాజిట్ సమయంలోనూ బ్యాంకు సిబ్బంది నామినేషన్ గురించి కస్టమర్లకు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ నామినేషన్లేకుండానే ఖాతా తెరిచేందుకు, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నామినీ ఎవరిని?: వ్యక్తులను నామినీగా నమోదు చేసుకోవచ్చు. అసోసియేట్, ట్రస్ట్, సొసైటీ లేదా ఇతర ఆర్గనైజేషన్ ఆఫీసుబేరర్ అయితే నామినీగా అవకాశం ఉండదు. ప్రక్రియ: నామినేషన్ నమోదు కోసం నామినీ పేరు, అనుబంధం, చిరునామా వివరాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు పాస్‌బుక్‌లో, అకౌంట్ స్టేట్మెంట్, డిపాజిట్లో నామినేషన్ రిజిస్టర్డ్ అని పేర్కొనడం తప్పనిసరి. నామినీ నమోదు, మార్పులకు, రద్దుకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. క్లెయిమ్: ఖాతాదారుడు లేదా డిపాజిట్ దారుడు మరణిస్తే నామినీలకు బ్యాంకులు బ్యాలన్స్‌ను చెల్లిస్తాయి. డిపాజిట్‌దారుని వారుసుల తరఫున ట్రస్టీగానే నామినీ వ్యవహరించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినట్టు బ్యాంకులో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీకి సంబంధించి కేవైసీ ఇతర ధ్రువీకరణలు కూడా అవసరం. నామినేషనన్ రిజిస్టర్ కాకపోతే, వారసులకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. అందుకు వారసత్వ ధ్రువీకణ పత్రం, డెత్ సర్టిఫికెట్వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోవాలి... బీమా పాలసీలు, మ్యూచువల్ఫండ్స్, షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో జాయింట్ అకౌంట్ హోల్డర్స్‌గా ఉంటే, అప్పుడు జాయింట్ హోల్డర్స్ అందరూ ఒకే సందర్భంలో మరణించినట్టయితేనే నామినేషన్ అమల్లోకి వస్తుంది. మైనర్‌ను నామినీగా నమోదు చేసేవారు, ఆ మైనర్ సంరక్షణ చూసే వారి పేరు వివరాలనూ నమోదు చేయాల్సి ఉంటుంది. బీమా పాలసీలయితే నామినీ క్లెయిమ్ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇందుకు క్లెయిమ్ ఫామ్‌ను పూర్తి చేసి, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం(ఒరిజినల్), పాలసీ డాక్యుమెంట్ ఒరిజినల్‌ను జత చేయాలి. ఒకవేళ ప్రమాదంలో మరణించినట్టయితే ఎఫ్ఐఆర్/పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీ తనకు సంబంధించి కేవైసీ వివరాలను కూడా సమర్పించాలి. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ విషయంలోనూ క్లెయిమ్ కోసం ఇవే పత్రాలు అవసరం అవుతాయి. అదే షేర్లు అనుకుంటే, నామినీ అకౌంట్ క్లోజర్ ఫామ్(మరణించిన ఇన్వెస్టర్ అకౌంట్), ట్రాన్సమిషన్ రిక్వెస్ట్ (ఇన్వెస్టర్ పేరిట ఉన్న షేర్లను బదిలీ కోరుతూ), డెత్ సర్టిఫికెట్, క్లయింట్ మాస్టర్ రిపోర్ట్(డీమ్యాట్ ఖాతాకు సంబంధించి) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, క్లెయిమ్ దాఖలు చేసే నామినీలు తమ డీమ్యాట్ ఖాతాను జాయింట్‌గా కలిగి ఉండరాదు. ఒకవేళ ఇన్వెస్టర్ నామినీని నమోదు చేసి లేకపోతే, ఇక్కడ పేర్కొన్న పత్రాలతోపాటు, వారసులు వారసత్వ సర్టిఫికెట్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధ వారసుల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ లేదా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ మైనర్ అయితే, గార్డియన్ గా ఉన్న వారు నామినీ తరఫున ఈ డాక్యుమెంట్లు అన్నీ ఇవ్వాలి. -
మీ ‘పాలసీ’ ఏంటి..?
ఓ వ్యక్తి జీవితానికి, అతనిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణ, భరోసాను కల్పించేది బీమా పాలసీ. ఆర్జనా పరులు, మరొకరికి ఆధారమైన వారు ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం తప్పనిసరి బాధ్యతలో ఒక్కటి. అయితే, జీవిత బీమా పాలసీ ఎంపికలో చాలా కచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరైన పాలసీ తీసుకోవడం, దీనికి ముందు దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి తెలియజేసే కథనమే ఇది. టర్మ్ – హోల్‌లైఫ్ నిర్ణీత కాలానికి (టర్మ్) పాలసీ తీసుకోవాలా లేక జీవితాంతం రక్షణనిచ్చే పాలసీ తీసుకోవాలా? అన్నది ముందుగా ఆలోచించుకోవాలి. మరణం సంభవిస్తే కుటుంబానికి బీమా మొత్తాన్ని చెల్లించే టర్మ్ పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ టర్మ్ పాలసీల్లో లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించినప్పుడు ఆ తర్వాత ఎటువంటి మెచ్యూరిటీ టర్మ్ ప్లాన్లలో ఉండదు. కేవలం రక్షణకే ఇవి పరిమితం. దీనికి బదులు పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా జీవితాంతం (80–100 సంవత్సరాల వరకు) రక్షణను హోల్‌లైఫ్ పాలసీలు ఇస్తుంటాయి. కానీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రీమియం అధికంగా ఉంటుంది. ఈ పాలసీల్లో పాలసీదారుడు ఎప్పుడు మరణించినా కానీ, పరిహారం లభించే సౌకర్యం ఉంటుంది. పెట్టుబడి సాధనం కాదు... జీవిత బీమా పాలసీలను సంప్రదాయ పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు, టర్మ్ ప్లాన్లు ఈ మూడు రకాల్లోనూ జీవితానికి రక్షణ ఉంటుంది. అయితే, యులిప్ ప్లాన్లు ఈక్విటీ ఆధారిత పెట్టుబడి, బీమా కలగలిపిన సాధనం. ఈక్విటీ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి రాబడులు ఉంటాయి. కానీ, జీవిత బీమా అన్నది పెట్టుబడి సాధనం కాదు. అలా చూడడం కూడా సరికాదు. రాబడులే కావాలనుకుంటే అందుకోసం ఇతర పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. బీమా రక్షణ కోసం టర్మ్ ప్లాన్లను తీసుకోవాలి. ప్రీమియం పెంచినా సరే... టర్మ్ ప్లాన్లు తీసుకునేవారు ప్రీమియం చెల్లించిన తర్వాత వైద్య పరీక్షలకు వెళ్లాలని బీమా సంస్థ కోరుతుంది. వైద్య పరీక్షల అనంతరం ఫలితాల ఆధారంగా రిస్క్ ఉందనుకుంటే ప్రీమియాన్ని పెంచుతాయి. అయితే, పెంచిన మేర ప్రీమియం చెల్లించేందుకు ఇష్ట పడక కొందరు వేరే బీమా కంపెనీని ఆశ్రయిస్తుంటారు. కానీ, పెంచిన మేర ప్రీమి యం చెల్లించడం వల్ల వైద్య పరమైన సమస్యలకు సంబంధించిన రిస్క్ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ మేరకు రిస్క్‌ను బీమా కంపెనీ ప్రీమియం పెంచడం ద్వారా ఆమోదించినట్టు అవుతుంది. భవిష్యత్తులో వైద్య పరమైన సమస్యలతో మరణం సంభవిస్తే... క్లెయిమ్ విషయంలో బీమా సంస్థ కొర్రీలు వేయకుండా ఉంటుంది. మైనర్ పేరిట వద్దు కొంత మంది తమ పిల్లల పేరిట బీమా పాలసీలు తీసుకుంటుంటారు. పిల్లలకు ఎటువంటి ఆర్జనా శక్తి ఉండదు కనుక వారి పేరిట బీమా పాలసీ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. పిల్లలకు బదులు సంపాదనా శక్తి కలిగిన వారి పేరుతో బీమా పాలసీ తీసుకోవాలి. పాలసీ డాక్యుమెంట్ పరిశీలన పాలసీ తీసుకున్నాక చూడాల్సిన అంశాలూ ఉన్నాయి. అందులో పాలసీ డాక్యుమెంట్ మీకు చేరిన తర్వాత దాన్ని ఓ సారి పూర్తిగా చదవడం మరవొద్దు. డాక్యుమెంట్‌లోని ప్రతీ కాలమ్‌ను పరిశీలించాలి. అందు లోని వివరాలు మీరు అనుకున్న విధంగానే ఉన్నాయా? అప్పటి వరకు మీకు తెలియని నచ్చని అంశాలు ఏవైనా ఉన్నాయేమో చూడాలి. సమ్ అష్యూర్డ్, పాలసీ కాల వ్యవధి, చెల్లించాల్సిన ప్రీమియం, ఎంత కాలానికోసారి ప్రీమియం చెల్లించాలి... ఈ వివరాలన్నీ సరిగానే ఉన్నా యా, లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులుంటే వెంటనే వాటి గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. మీ పాలసీ పత్రంలో అన్ని వివరాలు సరిగ్గానే ఉంటే, క్లెయిమ్ సమయంలో నామినీకి ఇబ్బందులు ఎదురుకావు. అయితే, పాలసీ పత్రంలో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, కాంటాక్ట్ సమాచారం, నామినీ పేరు వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత పాలసీదారులపై ఉంటుంది. వివరాల్లో తప్పులు ఉంటే సులభంగానే కరెక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే వెంటనే ఈ పని చేయాలి. బీమా సంస్థ కస్టమర్ పోర్టల్‌లో లాగిన్ అయి, మార్పులకు సంబంధించిన రిక్వెస్ట్ పెట్టుకోవ చ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా కస్టమర్‌కేర్ మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు. లిఖిత పూర్వకంగానూ తెలియజేయవచ్చు. సకాలంలో ప్రీమియం ప్రీమియం చెల్లింపు క్రమం కూడా ముఖ్యమే. చాలా మంది వార్షిక ప్రీమియానికి మొగ్గు చూపితే. కొందరు నెలవారీ చెల్లింపు ఎంచుకుంటారు. కొందరు త్రైమాసికం, అర్ధ సంవత్సరం ఆప్షన్ ఎంచుకుంటుంటారు. ఎంత కాలానికి ప్రీమియం ఎంత మేర చెల్లింపు సౌకర్యంగా ఉంటుందో చూసి ఎంచుకోవాలి. ఇక, ఆ గడువు నాటికి సకాలంలో ప్రీమియం చెల్లించాలి. దీనికంటే కూడా ఈసీఎస్ విధానంలో నేరుగా గడువు నాటికి బ్యాం కు ఖాతా నుంచి ప్రీమియం చెల్లింపు జరిగేలా చూసు కుంటే మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఇలా చేయనప్పుడు మర్చిపోయి సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఆ సమయంలో ప్రాణ ప్రమాదం ఎదురైతే నామినీలకు సమస్యలు తప్పవు. ఇక పాలసీ తీసుకున్నాం పనైపోయిందనుకోవద్దు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పాలసీ తీసుకున్న వారు... వివాహం, పిల్లలు పుట్టాక తమ జీవన అవసరాలు, తీసుకున్న రుణాలు, పెరిగిన బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకని ఐదేళ్ల కోసారి అయినా సమీక్షించుకుని పాలసీ కవరేజీని పెంచుకోవడం అవసరం. పాలసీ నచ్చకపోతే తిప్పి పంపొచ్చు పాలసీ డాక్యుమెంట్‌ను ఆసాంతం పరిశీలించిన తర్వాత అందులోని నియమ నిబంధనలు అనుకూలంగా లేవని భావిస్తే సంబంధిత పాలసీని తిరిగి వాపసు చేయవచ్చు. ఇందుకు 15–30 రోజుల గడువు ఉంటుంది. ఆన్లైన్ పాలసీల్లో 30 రోజుల గడువు ఉంటుంది. దీన్నే ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. ఈ లోపు తగిన కారణాలను పేర్కొంటూ పాలసీని వాపస్ చేస్తే బీమా కంపెనీకి చెల్లించిన ప్రీమియంను తిరిగి పొందొచ్చు. వైద్య పరీక్షల వంటివి చేసి ఉంటే, అందుకు అయిన ఖర్చులు, పాలనా ఖర్చులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. నామినీకి సమాచారం నామినీలు సహజంగా జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు అయి ఉంటారు. బీమా పాలసీ తీసుకుని, అందులో ఒకరిని నామినీగా పేర్కొన్న వెంటనే, ఆ వివరాలను వారికి తెలియజేయాలి. ఫలానా సంస్థ నుంచి పాలసీ తీసుకున్నట్టు, అందులో నామినీగా వారి పేరును రిజిస్టర్ చేసినట్టు చెప్పాలి. కొన్ని టర్మ్ ప్లాన్లు మరణ పరిహారాన్ని ఏక మొత్తంలో చెల్లించడానికి అదనంగా, ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పదేళ్ల వరకు చెల్లించే రైడర్లతో వస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ ఏవి ఉన్నా, నామినికీ పూర్తి వివరాలు తెలపడం ఎందుకైనా మంచిది. -
‘రాజ్యసభ బరి’లో కాంగ్రెస్ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి అధికార ఎన్డీఏ హరివంశ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించగా ప్రతిపక్షాలు కాంగ్రెస్‌కే ఆ అవకాశం ఇచ్చాయి. దీంతో తమ అభ్యర్థి బరిలో ఉంటారని కాంగ్రెస్ ప్రకటించింది. జేడీయూకు చెందిన హరివంశ్‌ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. అదే సమయంలో అధికార బీజేపీ మరో అడుగు ముందుకేసింది. బిహార్ సీఎం ద్వారా ఒడిశా సీఎం పట్నాయక్‌కు ఫోన్ చేయించి అనుకూలమైన ఫలితాలను రాబట్టగలిగిందని సమాచారం. దీంతో బిజూ జనతాదళ్‌కు చెందిన 9 మంది సభ్యులు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ రేసులో బీజేడీ మద్దతు కీలకంగా మారనుంది. కేంద్రంలోని బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే శివసేన కూడా ఎన్డీఏకు సానుకూల సంకేతాలు పంపిందని సమాచారం. అయితే, ఓటింగ్ మొదలయ్యే గంట ముందు తమ నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. తెలంగాణలో టీఆర్ఎస్ హరివంశ్‌కే ఓటేస్తామని తెలిపింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరగనుండగా నామినేషన్లకు నేడే చివరి తేదీ. కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశం ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో ఉంచేందుకు మంగళవారం ఢిల్లీలో పలు దఫాలు చర్చలు జరిపారు. ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, బీఎస్పీ, వామపక్ష పార్టీలు తమ తరఫున ఎవరినీ బరిలో ఉంచబోమని ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కే ఆ అవకాశం వదిలిపెట్టాయి. ఆ పార్టీ ప్రకటించే అభ్యర్థినే బలపరుస్తామని టీడీపీ సహా ప్రతిపక్షం ప్రకటించింది. దీంతో నామినేషన్లకు ఆఖరి రోజైన బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోందని ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారు. తమ మాట వినని పార్టీలు, నేతలపై కేసులు, ఆరోపణలు, సీబీఐ దాడులు తదితర అస్త్రాలతో బెదిరింపులకు పాల్పడుతుందని అంటున్నారు. -
ఐసీఐసీఐ స్కాం: ప్రభుత్వ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ వివాదంలో ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఐసీఐసీఐ బోర్డు నామినీని తొలగించింది. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. బ్యాంకు బోర్డులో ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా ఉన్న అమిత్ అగర్వాల్ స్థానంలో లోక్ రంజన్‌ను నియమించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్న రంజన్ నియమాకం ఏప్రిల్ 5నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు సమాచారం అందించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరోవైపు 3,250 కోట్ల రూపాయల స్కాం ఆరోపణలపై రంగంలోకి దిగిన సీబీఐ.. చందా కొచ్చర్ భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌పై ప్రాథమిక విచారణ చేపట్టింది. అటు ఈ వివాదంలో అవిస్టా సంస్థపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మూడురోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న దీపక్ కొచ్చర్ సోదరుడు విజయ్ కొచ్చర్‌ను శనివారం కూడా విచారిస్తోంది. -
కోహ్లి నీ కళ్లకు కనిపించటం లేదా?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ ఆఫ్ ది ఇయర్-2017 గానూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆయన ఓటు వేయటంతో అసలు వ్యవహారం మొదలైంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో 2017 సంవత్సరానికి గానూ ఉత్తమ కెప్టెన్ అవార్డులకు నామినీలను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ కెప్టెన్లు స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ అహ్మద్, అస్గర్ స్టానిక్‌జై, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్ పేర్లను ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన మంజ్రేకర్ తాను మాత్రం సర్ఫరాజ్ అహ్మద్‌కే ఓటేస్తానని చెప్పాడు. మంజ్రేకర్ అభిప్రాయం ఏంటంటే... ‘‘కష్టకాలంలో సర్ఫరాజ్ కెప్టెన్సీ పాకిస్థాన్‌కు ఎంతో తోడ్పాటు అందించింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై తడబడే పాక్ జట్టును కెప్టెన్‌గా విజయతీరాలకు చేర్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీని తన దేశానికి అందించటం.. ఎక్కువ మ్యాచ్‌లను గెలిపించిన ట్రాక్ రికార్డు ఉంది.(మొత్తం 13 వన్డే మ్యాచ్..11 గెలుపు, 2-ఓటమి.. టీ20మ్యాచ్‌లు 10.. 8-గెలుపు, 2-ఓటమి). మిగతా వారికంటే సర్ఫరాజ్ కష్టం ఎక్కువ కనిపిస్తోంది. అందుకే అండర్ డాగ్ జట్టయిన పాక్ సారథికే నా ఓటు’’ అని తెలిపాడు. అంతే... కోహ్లిని కూడా కాదని, దాయాది జట్టు కెప్టెన్ కు ఓటేయటంపై మంజ్రేకర్ పై మండిపడుతున్నారు. ‘ఆటగాడిగా, విశ్లేషకుడిగా ఫేలయిన నువ్వు ఇప్పుడు దేశభక్తుడిగా కూడా విఫలమయ్యావ్’ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కోహ్లి, సర్ఫరాజ్ ఓవరాల్ ప్రదర్శనలను పోలుస్తూ కోహ్లి గ్రేట్.. మంజ్రేకర్ వేస్ట్ అంటూ సందేశాలు పెడుతున్నారు. మరోవైపు మంజ్రేకర్ అభిప్రాయంపై పాక్‌లోనూ వ్యతిరకత వ్యక్తమవుతోంది. పాక్‌ను అండర్ డాగ్ గా పొల్చటంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఐసీసీ టోర్నమెంట్లను జేజిక్కిచ్చుకున్న పాక్‌ను మంజ్రేకర్ తక్కువ చేసి మాట్లాడాల్సింది కాదని అంటున్నారు. ఏది ఏమైనా మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పటంలో తప్పేం లేదన్న కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. -
మీ బీమాకు నామినీ ఉన్నారా?
జీవిత బీమా పాలసీ ఎందుకు? అనుకోనిదేమైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడానికే కదా!! మరి పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఆ పరిహారం ఎవరికి అందించాలన్న వివరాలను పేర్కొనకపోతే లాభమేంటి? కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టినట్టే కదా!! అందుకే జీవిత బీమా పాలసీకి నామినీ చాలా అవసరం. దీని ప్రాధాన్యాన్ని తెలియజేసే కథనమే ఇది. నామినీ ఎందుకు? నామినేషన్ ప్రాధాన్యం తెలుసుకునే ముందు నామినీ గురించి తెలుసుకోవాలి. పాలసీదారు మరణిస్తే జీవిత బీమా పరిహారం అందుకునేందుకు అర్హులైన వారే నామినీ. నిజానికి టర్మ్ పాలసీల్లో ఇది తప్పనిసరి కనక అంతా నామినీ పేరు పేర్కొంటారు. కానీ కొన్ని రకాల మెచ్యూరిటీ తీరాక నగదు అందే పాలసీలకు కొందరు నామినీ వివరాలివ్వరు. తామే తీసుకుంటాం కదా అనే భరోసాయే దీనిక్కారణం. నిజానికి వాటికీ కొంత కవరేజీ ఉంటుంది. పాలసీదారు మరణించిన సందర్భంలో ఆ కవరేజీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. అయితే పాలసీలో ఎవరినీ నామినీగా పేర్కొనకపోతే అలాంటి సందర్భంలో పరిహారం చట్టబద్ధమైన వారసులకే చెందుతుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు చట్టబద్ధమైన వారసులు. కాకపోతే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ‘‘బీమాసంస్థ వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అడుగుతుంది. అది చట్టబద్ధమైన వారసులను సూచించేలా ఉండాలి. ఇందుకు సమయం పడుతుంది. వారి కుటుంబ సభ్యులకు వ్యయాలు కూడా అవుతాయి. ఇది సరైనది కాదు. ఎందుకంటే బీమా పాలసీ తీసుకోవడం అన్నది తమపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రత చేకూర్చేందుకే’’ అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసుఫ్ పచ్‌మరివాలా వివరించారు. ఒకరికి మించి వారసులుంటే... నామినీగా ఎవరినీ పేర్కొనని సందర్భాల్లో ఒకరికి మించి వారసులు ఉంటే క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ మరింత జటిలం అవుతుంది. బీమా సంస్థలు పలు రకాల పత్రాలు, ఇండెమ్నిటీ బాండ్ అడగొచ్చు. ఇందుకు సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇరు పార్టీల మధ్య వివాదానికి దారితీయవచ్చు. ఒకవేళ పాలసీదారుడు నామినీగా ఎవరినీ పేర్కొనకపోయినా, విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తికి బీమా సంస్థ నిబంధనల మేరకు అన్ని ప్రయోజనాలను చెల్లిస్తుంది. ఒకవేళ బీమా పాలసీలో నామినీగా ఒకరిని నమోదు చేయించి, విల్లులో మరొకరిని చట్టబద్ధమైన వారసుడిగా పేర్కొంటే, అప్పుడు బీమా సంస్థ విల్లులో ఉన్న వారికే ప్రయోజనాలను బదలాయిస్తుంది. అందుకే పాలసీలో నామినీగా ప్రతిపాదించిన వారినే విల్లులోనూ పేర్కొనడం మర్చిపోవద్దు. నమోదు ప్రక్రియ ఇలా... జీవిత బీమా పాలసీ తీసుకునే సమయంలోనే నామినీ వివరాలిస్తే మంచిది. దీని వల్ల భవిష్యత్తులో వారి కుటుంబానికి సమస్యలు రాకుండా ఉంటాయి. ‘‘నామినీ నమోదు ప్రక్రియ చాలా సులభం. నామినీగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పూర్తి పేరు (అధికారిక ధ్రువీకరణ పత్రాల్లో ఉన్నట్టుగా), వయసు, పాలసీదారునితో ఉన్న అనుబంధం వివరాలు ఇస్తే చాలు’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ పునీత్ నందా తెలిపారు. నామినీ అంటే ఒక్కరనే పరిమితి లేదు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే ఆప్షన్ పాలసీదారునికి ఉంటుంది. ఇలా పేర్కొంటే ఒక్కో నామినీకి ఎంత మేర పరిహారం చెల్లించాలన్న వివరాలూ ఇవ్వాలి. ఒకవేళ నామినీ మైనర్ అయితే ఆ మైనర్‌కు సంబంధించి అపాయింటీ లేదా ట్రస్టీని పేర్కొనాల్సి ఉంటుంది. ‘‘చట్ట ప్రకారం మైనర్లు ఓ కాంట్రాక్టు పరిధిలో చేరేందుకు అర్హులు కారు. దాంతో బీమా పరిహారం నేరుగా పొందేందుకు అవకాశం లేదు. ఇటువంటి సందర్భం ఎదురైతే అపాయింటీకి పరిహారం చెల్లిస్తారు’’ అని పునీత్ వివరించారు. ఒకసారి నామినీగా ఎవరి పేరును అయినా నమోదు చేసిన తర్వాత పాలసీ కాల వ్యవధిలోపు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తిరిగి మార్చుకోవచ్చు. చివరిగా పేర్కొన్న నామినీయే చట్టప్రకారం అర్హులుగా ఉంటారు. ఒకవేళ నామినీలో మార్పులు చేయదలిస్తే సంబంధిత దరఖాస్తును పూర్తి చేసి బీమా సంస్థకు అందజేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నామినేషన్ వివరాలను సమీక్షించుకుంటూ, జీవితంలో వివాహం, నామినీగా ప్రతిపాదించిన వారు మరణించడం వంటి సందర్భాల్లో కొత్తగా మరొకరిని నామినీగా చేర్చుకోవడం పాలసీదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రస్తుతం బీమా సంస్థలు ఆన్లైన్లోనే నామినీ వివరాలు మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. చెల్లుబాటు జీవిత బీమా పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీకి పరిహారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో కాదు. ఉదాహరణకు పాలసీదారుడు ఏదైనా రుణం తీసుకుని హామీగా బీమా పాలసీని తనఖాగా ఉంచితే, అప్పుడు ఆ పాలసీని అసైన్ చేయాల్సి ఉంటుందని యూసుఫ్ పేర్కొన్నారు. ‘‘పాలసీని తనఖాగా ఉంచి ఇతరులకు అప్పగించితే అప్పుడు పాలసీదారుడు ఆ విషయాన్ని కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. దాంతో బీమా సంస్థ అసైన్మెంట్ను రిజిస్టర్ చేస్తుంది. అప్పుడు పాలసీ డాక్యుమెంట్‌ను అసైనీ (ఎవరికి అయితే తనఖా పెట్టారో)కి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఏ పాలసీదారుడు మరణిస్తే పరిహారం అసైనీకే చెల్లించడం జరుగుతుంది’’ అని యూసుఫ్ వివరించారు. తనఖా పెట్టి ఆ తర్వాత విడిపించుకుంటే తిరిగి పాలసీదారుడు తన పాలసీకి నామినేషన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నామినీ ఎవరు? నామినీ అంటే పాలసీదారుడి కుటుంబమే. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు. అయితే, పాలసీదారుడు ఇంకెవరినైనా కూడా నామినీగా ప్రతిపాదించొచ్చు. ‘‘చట్టబద్ధమైన వారసులు కాకుండా, రక్త సంబధీకులు కాకుండా మరెవరినో నామినేట్ చేస్తే, క్లెయిమ్ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఏర్పడవచ్చు. రక్త సంబంధం లేదా పాలసీదారుని కుటుంబ సభ్యులు అయితే ఎటువంటి ప్రశ్నలు లేకుండా క్లెయిమ్ దరఖాస్తును ఆమోదించడం జరుగుతుంది. ఇతరులైతే బీమా కంపెనీల్లో అండర్ రైటింగ్ సమయంలో ప్రశ్నలు తలెత్తవచ్చు’’ అని పచ్‌మరివాలా పేర్కొన్నారు. -
బీమాలో నామినీ ఉండాల్సిందే...
జీవిత బీమా తీసుకునే వారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ తదనంతరం బీమా ప్రయోజనం ఎవరికి అందాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. పాలసీదారుని మరణానంతరం ఆ వ్యక్తి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే జీవిత బీమా ముఖ్యోద్దేశం. అందుకే, బీమా పత్రాలు నింపేటపుడు నామినీ వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. పాలసీలో నామినీలను పేర్కొనకపోతే బీమా మొత్తాన్ని పొందడానికి పాలసీదారుని కుటుంబ సభ్యులు ఎన్నో ఇక్కట్లకు గురికావలసి వస్తుంది. కోర్టులు జారీచేసే వారసత్వ సర్టిఫికెట్ తీసుకురమ్మని బీమా కంపెనీలు కోరతాయి. ఈ సర్టిఫికెట్‌ను పొందడం అంత సులువు కాదు. అందుకే, బీమా ప్రపోజల్ ఫారంలోనే నామినీ(ల)ను స్పష్టంగా రాస్తే సరిపోతుంది. నామినీ అంటే... తన తదనంతం బీమా సొమ్ము ఎవరికి అందాలని పాలసీదారు ప్రతిపాదిస్తాడో ఆ వ్యక్తినే నామినీ అంటారు. నామినీ పూర్తి వివరాలను, పాలసీదారునితో ఆ వ్యక్తి బంధుత్వాన్ని ప్రపోజల్ ఫారంలో స్పష్టంగా పేర్కొనాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే... పాలసీదారునికి నామినీ చట్టపరంగా వారసుడు/ వారసురాలు అయి ఉండాలి. లేదంటే నామినేషన్ చెల్లదు. చట్టం ప్రకారం పాలసీదారుని తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు నామినేషన్‌కు అర్హులు. ఒకవేళ నామినీ మైనర్ అయితే అతనికి/ ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు కస్టోడియన్‌ను నియమించాలి. గుర్తుంచుకోవాల్సినవి... * పాలసీ గురించి, నామినేషన్ గురించి నామినీకి, కుటుంబ సభ్యులకు తెలపాలి. తద్వారా, పాలసీదారు లేనపుడు వారు అత్యధిక ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. * పాలసీ కాలపరిమితి ముగిసేలోపు నామినీ దురదృష్టవశాత్తూ మరణిస్తే బీమా కంపెనీని సంప్రదించి కొత్త నామినీని పేర్కొనాలి. * ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో నామినీలుంటే వ్యవహారం సహజంగానే సంక్లిష్టమవుతుంది. కొన్నిసార్లు న్యాయ వివాదాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా సొమ్మును ఒక నామినీకే ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తాయి. అందుకుగాను సదరు నామినీ మిగిలిన నామినీల నుంచి అంగీకారాన్ని పొందాల్సి ఉంటుంది. మిగిలిన నామినీలు అంగీకారం తెలిపే సమయంలో వివాదాలు ఏర్పడుతుంటాయి. -
ఇన్ఫీ ఆదాయాన్ని మూర్తి పెంచారు: కామత్
విశాల్ మరింత వృద్ధి సాధిస్తారని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఆదాయాన్ని పెంచడంలో కంపెనీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సఫలీకృత ం అయ్యారని నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన విశాల్ శిక్కా భవిష్యత్‌లో కంపెనీని మరింత వృద్ధిబాటన నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈవో శిబూలాల్ నుంచి శిక్కా ఆగస్ట్‌లో బాధ్యతలను స్వీకరించనున్నారు. కంపెనీ వ్యవస్థాపకులు లేదా ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాకుండా ఇతర సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఇన్ఫోసిస్ సీఈవోగా ఎంపిక చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కాగా, ఇన్ఫీని గాడిలో పెట్టేందుకు రెండోసారి అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణమూర్తి అమ్మకాలు పెంచడంపై దృష్టిపెట్టారని, ఇకపై శిక్కా ఈ ఎజెండాను ముందుకు తీసుకువెళతారని కామత్ వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మూర్తి పదవీ బాధ్యతలను చేపట్టిన విషయం విదితమే. సానుకూల ధృక్పథంతోనే విజయాలను సాధించగలమని, ఇన్ఫోసిస్‌ను తాను ఈ దృష్టితోనే చూస్తానని చెప్పారు. నారాయణమూర్తి ఈ నెల 14న ఇన్ఫోసిస్‌ను వీడారు. 1981లో ఆవిర్భవించిన ఇన్ఫోసిస్ 8 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) కంపెనీగా నిలిచింది. -
ఇన్ఫీ కొత్త సారధి..విశాల్ సిక్కా
ఆగస్టు 1 నుంచి సీఈఓ, ఎండీగా బాధ్యతలు * తొలిసారి కంపెనీ బయటివ్యక్తికి పగ్గాలు * పదవి నుంచి రేపు వైదొలగనున్న * ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి టెక్నాలజీ పరిశ్రమ మార్గదర్శకులు నెలకొల్పిన ఇన్ఫోసిస్‌కు సారథ్యం వహించడం నాకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఇన్ఫీ ఉద్యోగులతో కలసి పనిచేయాలని, వారి నుంచి నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. కంప్యూటింగ్ టెక్నాలజీ అన్ని పరిశ్రమల తీరుతెన్నులను మారుస్తోంది. మా ఖాతాదారులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వాటాదారుల విలువను మరింత ఇనుమడింపచేసేలా బ్రేక్‌త్రూ సొల్యూషన్స్‌ను అందించే అరుదైన అవకాశం మాకు లభించింది. - ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ, ఎండీగా ఎంపికైన తర్వాత విశాల్ సిక్కా వ్యాఖ్యలు బెంగళూరు: వరుసగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నిష్ర్కమణతో సతమతమవుతున్న సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా(47) నియమితులయ్యారు. ఆగస్టు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి శనివారం పదవి వీడనున్నారు. మరో సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్ కూడా అదే రోజు తప్పుకోనున్నారు. ఈ విషయాలను ఇన్ఫోసిస్ గురువారం వెల్లడించింది. కాగా, అసలు ఇన్ఫోసిస్‌కు సంబంధం లేని బయటవ్యక్తి కంపెనీకి సారథ్యం వహించడం తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, కంపెనీ వ్యవస్థాపకుల్లో లేనివ్యక్తి సీఈఓ కావడం కూడా ఇదే మొట్టమొదటిసారి. జర్మన్ సాఫ్ట్వేర్ సంస్థ శాప్ ఏజీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాజీ సభ్యుడైన సిక్కా ఇన్ఫీ పూర్తికాల డెరైక్టర్‌గా శనివారం చేరనున్నారు. ఇప్పటివరకు ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ఎస్.డి.శిబూలాల్ వచ్చే మార్చిలో రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ ముందుగానే పదవీ విరమణ చేస్తానని చెప్పడంతో ఆయన వారసుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. కాగా, ఇన్ఫోసిస్‌లోకి నారాయణ మూర్తి గతేడాది జూన్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రెండో ఇన్నింగ్ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటిదాకా 11 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పడం తెలిసిందే. అక్టోబర్ వరకు నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా... గతంలో ఇన్ఫీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణ మూర్తి, కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది జూన్ 1న మళ్లీ పగ్గాలు చేపట్టారు. మూర్తి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, గోపాలకృష్ణన్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వచ్చే అక్టోబర్ 10 వరకు కొనసాగుతారు. ఇన్ఫీ బోర్డు ఎక్స్టర్నల్ డెరైక్టర్ కె.వి.కామత్ అక్టోబర్ 11 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారు. ‘సంస్థ పురోగతికి అందించిన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 11 నుంచి మూర్తి గౌరవ చైర్మన్ (చైర్మన్ ఎమిరిటస్)గా వ్యవహరిస్తారు..’ అని ఇన్ఫీ ప్రకటన తెలిపింది. 14 నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫీసు రద్దు... ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (నారాయణ మూర్తి) కార్యాలయం ఈ నెల 14 నుంచి రద్దు కానుంది. మూర్తి కుమారుడు, ఆయన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోహన్ పదవీకాలం మూర్తితో పాటే ముగియనుంది. అంటే, రోహన్ శనివారం నుంచే కంపెనీని వీడనున్నారు. కంపెనీలో సీనియర్ ఉద్యోగులైన పన్నెండు మందికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి ఇవ్వడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థ కొత్త సీఈఓగా సిక్కాను ఎంపికచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. గ్లోబల్ కార్పొరేషన్ సారథిగా పనిచేసిన ఆయన తన విలువైన అనుభవాన్ని ఇన్ఫీ అభివృద్ధికి వినియోగిస్తారు. శాప్‌లో విశేష విజయాలు సాధించిన సిక్కాను ఇన్ఫీ అత్యున్నత పదవికి ఎంపికచేయడం ఆదర్శనీయం..’ అని మూర్తి తెలిపారు. నేనూ టీచర్ కుమారుడినే: విశాల్ పంజాబీ కుటుంబంలో జన్మించిన విశాల్ సిక్కా విద్యాభ్యాసం గుజరాత్లో కొనసాగింది. ఆయన తండ్రి రైల్వే ఇంజనీరు. వడోదరలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌ను సిక్కా పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని సైరాక్యూస్ యూనివర్సిటీలో ఎంఎస్(కంప్యూటర్ సైన్స్) చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 1996లో పీహెచ్డీ పొందారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఇన్ఫీ సీఈఓ పదవి ఆయన్ను వరించడానికి కారణం ఆయన విజ్ఞాన తృష్ణే. పలువురు సీనియర్ లెవల్ అధికారులు ఇటీవల ఇన్ఫీకి గుడ్‌బై చెప్పారు. మరోపక్క టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ నుంచి ఇన్ఫీకి పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ఫీ సారథ్యాన్ని చేపట్టడం సవాలు వంటిదే. ‘కొత్త బాధ్యతలను నేను సంతోషంగా, వినయంగా స్వీకరిస్తున్నాను. నారాయణ మూర్తిలానే నేను కూడా ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ రాజ్‌కోట్ (గుజరాత్)లో టీచరుగా పనిచేశారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇన్ఫీ ఇస్తున్న ప్రాధాన్యత నన్ను సంభ్రమానికి గురిచేసింది..’ అని విశాల్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జెరాక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కొంతకాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత సోదరునితో కలసి ఐబ్రెయిన్ పేరుతో తొలి కంపెనీని స్థాపించారు. ఐబ్రెయిన్ను ఆ తర్వాత పాటెర్న్ ఆర్ఎక్స్ టేకోవర్ చేసింది. తదనంతరం నెలకొల్పిన బోధ.కామ్‌ను పెరిగ్రైన్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. అందులో కొంతకాలం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సిక్కా, 2002లో శాప్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్రూప్ హెడ్‌గా చేరారు. ఐదేళ్లలోనే కంపెనీ సీటీఓ స్థాయికి ఎదిగారు. గేమ్ చేంజింగ్ ‘హానా’ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఘనత విశాల్‌దే. -
ఒక్కరితో సరి!
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలలే ఉన్నా ఎన్నికల్లో విజయం కోసం మంత్రివ ర్గ విస్తరణ చేపడుతున్నట్లు హంగామా చేసిన కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఊరించి.. ఉసూరుమనిపించింది. మార్పులు, చేర్పులతో కలిసి కనీసం నలుగురైదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని భావించినా కేవలం ఒక్కరితో మాత్రమే సరి అనిపించారు. వైద్యవిద్యాశాఖ మంత్రిగా అవ్హాడ్.. వైద్యవిద్యాశాఖ మంత్రిగా కల్వా-ముంబ్రా యువ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్నారాయణన్, అవ్హాడ్తో ప్రమాణ స్వీకారం చేయించి పదవీ బాధ్యతలు అప్పగించారు. నందుర్బార్ జిల్లాకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ బాట పట్టడంతో ఆయనను పార్టీలోంచి వెలివేయాల్సి వచ్చింది. దీంతో గావిత్ వద్ద ఉన్న వైద్యవిద్యాశాఖమంత్రి పదవి ఖాళీ కావడంతో దానిని అవ్హాడ్‌కు కట్టబెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఫౌజియాఖాన్పై వేటు లేనట్లే... ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీ కాలం కూడా ముగిసింది. దీంతోపాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు సన్నగిల్లినట్టేనని అంతా భావించారు. ఈ పదవిని విజయ్‌కుమార్ గావిత్ సొంత సోదరుడు శరద్ గావిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎలాంటి మార్పులు చేయకూడదని, మంత్రి పదవిలో ఆమెనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగానే కాంగ్రెస్ కోటా.. కాంగ్రెస్ కోటాలోని మూడు పదవులు కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఈ మూడు స్థానాలను ఎవరితోనూ భర్తీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ వాటాలోని మూడు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరలో భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉందని ఆ పార్టీ నేతలు కొందరు తెలిపారు. ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల్లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, వసంత్ పుర్వే తదితరులు ఉన్నారు. నాలుగైదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే మంత్రివర్గ విస్తరణ చేపట్టినా కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో నిరుత్సాహాన్ని నింపినట్లే అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
కుబేరుల ఖిల్లా.. భారత్!
-
కుబేరుల ఖిల్లా.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య పరంగా భారత్ అయిదోస్థానాన్ని చేజిక్కించుకుంది. దేశంలో మొత్తం 70 మంది బిలియనీర్లు లెక్కతేలారు. చైనాకు చెందిన రీసెర్చ్ సంస్థ హురున్... ప్రపంచ సంపన్నుల జాబితా-2014లో ఈ వివరాలను వెల్లడించింది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే ఈసారి కూడా భారత్‌లో అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచినట్లు తెలిపింది. ఆయన వ్యక్తిగత సంపద 18 బిలియన్ డాలర్లు(దాదాపు 1.12 లక్షల కోట్లు)గా అంచనా. కాగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన 41వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్ వన్ స్థానం బిల్‌గేట్స్‌కు దక్కింది. ఆయన సంపద 68 బిలియన్ డాలర్లు(సుమారు రూ.4.22 లక్షల కోట్లు). భారత్‌లో జోరు... ప్రపంచ టాప్ బిలియనీర్లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నవారిలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 49 ర్యాంక్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 17 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ అయిన దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీలు సంయుక్తంగా 77వ స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరి సంపద చెరో 13.5 బిలియన్ డాలర్లుగా అంచనా. కాగా, టాటా సన్స్‌కు చెందిన పల్లోంజీ మిస్త్రీ(12 బిలియన్ డాలర్లు), హిందూజా గ్రూప్‌నకు చెందిన ఎస్పీ హిందుజా కుటుంబం(12 బిలియన్ డాలర్లు) కూడా 93 ర్యాంక్‌లో ఉన్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో డాలరుతో రూపాయి మారకం విలువ 12 శాతం పైగా క్షీణించడంతో బిలియనీర్ల ర్యాంకింగ్స్‌లో భారతీయులు కొంత వెనుకబడటానికి కారణమైందని హురున్ పేర్కొంది. అయినప్పటికీ.. 2013తో పోలిస్తే 17 మంది కుబేరులు పెరిగినట్లు వెల్లడించింది. జర్మనీ, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ల కంటే భారత్‌లోనే బిలియనీర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా, మొత్తం 70 మంది భారతీయ కుబేరుల సంపద విలువ 390 బిలియన్ డాలర్లుగా అంచనా. హురున్ జాబితాలో ఇతర ముఖ్యాంశాలివీ... గేట్స్ తర్వాత బెర్క్‌షైర్ హ్యాత్వే అధిపతి వారెన్ బఫెట్ 64 బిలియన్ డాలర్ల సంపదతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఇండిటెక్స్ గ్రూప్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అమన్షియో ఒర్టెగా 3వ ర్యాంక్‌లో నిలిచారు. ఆయన సంపద 62 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో మెక్సికో టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ కుటుంబం(60 బిలియన్ డాలర్లు), ఐదో ర్యాంక్‌లో ఒరాకిల్ సీఈఓ లారీ ఎలిసన్(60 బిలియన్ డాలర్లు) నిలిచారు. కుబేరుల సంఖ్య పరంగా 481 మందితో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనా(358 మంది బిలియనీర్లు) నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో సగం మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. ముంబైలో 33 మంది బిలియనీర్లు ఉన్నారు. అత్యధిక సంపన్నులున్న ప్రపంచ నగరాల్లో ఆరో స్థానం. న్యూయార్క్ నగరం 84 మంది కుబేరులతో ప్రపంచ బిలియనీర్ల రాజధానిగా నంబర్ వన్ ర్యాం క్‌ను చేజిక్కించుకుంది. గతేడాది ఈ సంఖ్య 70. అమెరికా డాలర్లలో సంపదను లెక్కించారు. ఈ ఏడాది జనవరి 17 నాటి గణాంకాల ఆధారంగా జాబితాను రూపొందించారు. మొత్తం ఈ సూపర్ రిచ్ లిస్ట్‌లో 68 దేశాల నుంచి 1,867 మంది బిలియనీర్లు లెక్కతేలారు. వీళ్ల మొత్తం సంపద కళ్లు చెదిరేరీతిలో 6.9 లక్షల కోట్లు. ఈ ఏడాది లిస్ట్‌లో ప్రతి 9 మందిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. 2013లో ప్రతి పది మందిలో ఒక మహిళా బిలియనీర్ ఉన్నారు. -
ఏడాదికి రూ.112 కోట్లు!
న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం సత్య నాదెళ్ల... అదిరిపోయే వేతన ప్యాకేజీ అందుకోనున్నారు. జీతం, బోనస్, స్టాక్ ఆప్షన్స్ ఇతరత్రా ప్రోత్సాహకాలన్నీ కలిపితే ఏడాదికి ఆయనకు 1.8 కోట్ల డాలర్లు(దాదాపు రూ.112 కోట్లు) లభించనున్నాయి. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే సారథి సత్యతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న కొత్త ఉద్యోగ ఒప్పందం ప్రకారం... జీతం ఏడాదికి 12 లక్షల డాలర్లు(రూ.7.5 కోట్లు) కావడం గమనార్హం. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్(ఈఐపీ) ప్రకారం నాదెళ్లకు ప్యాకేజీని నిర్ణయించారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా చేరిన 47 ఏళ్ల సత్య... సర్వర్ అండ్ టూల్స్, క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్, ఆన్లైన్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్ విభాగాల్లో బాధ్యతలను నిర్వర్తించారు. 1.32 కోట్ల డాలర్ల షేర్లు... వార్షిక ఈఐపీలో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 1.32 కోట్ల డాలర్ల విలువైన షేర్లు సత్య అందుకోనున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని జూలై 1 నుంచి జూన్ 30గా లెక్కిస్తారు. 2014, 2015 సంవత్సరాల్లో సీఈఓగా అందుకునే వార్షిక వేతనానికి తోడు 0-300 శాతం వరకూ నగదు ప్రోత్సాహకం(అవార్డు)ను కూడా సత్యకు ఇస్తున్నట్లు ఆఫర్ లేఖలో మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీన్ని పనితీరు ఆధారంగా కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది. గరిష్టంగా చూస్తే ఈ మొత్తం 36 లక్షల డాలర్లుగా ఉండొచ్చు. మొత్తంమీద ప్యాకేజీ 1.8 కోట్ల డాలర్లగా లెక్కతేలుతోంది. సత్యకు ఆఫర్ చేసిన వేతన ప్యాకేజీ వివరాలను కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా తెలియజేసింది. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఆయనకు లాంగ్‌టర్మ్ పర్ఫార్మెన్స్ స్టాక్ అవార్డ్స్ కూడా లభించనున్నాయి. 39 ఏళ్ల కంపెనీ చరిత్రలో బిల్‌గేట్స్, స్టీవ్ బామర్ల తర్వాత మూడో సీఈఓగా బాధ్యతలు స్వీకచించిన సత్య... 2013 ఆర్థిక సంవత్సరంలో 6.75 లక్షల డాలర్ల జీతాన్ని అందుకున్నారు. ఇక 16 లక్షల డాలర్ల విలువైన నగదు బోనస్ లభించినట్లు సమాచారం. స్వాగతించిన అమెరికా మీడియా.. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల నియామకాన్ని అమెరికా మీడియా మొత్తం స్వాగతించింది. ఈ టెక్నోక్రాట్‌కు మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదురుచూస్తున్నాయని కూడా తమ కథనాల్లో గుర్తుచేసాయి. కార్పొరేట్ కంప్యూటర్ సర్వర్లు, ఇతర బ్యాకెండ్ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఈ టెక్నాలజీ నిపుణుడే తమకు తగిన సారథి అని మైక్రోసాఫ్ట్ తేల్చు కుంది. ఇంటాబయటా బోలెడంత మంది జాబితాను మదించి... చివరకు సత్య నాదెళ్లకు ఓటేసింది. - వాల్‌స్ట్రీట్ జనరల్ భారత్ అర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న అవకాశాలతో ప్రవాసీయులు మాతృదేశంవైపు చూస్తున్న తరుణంలో అమెరికాలో ఒక భారతీయుడు(సత్య) మైక్రోసాఫ్ట్‌కి సారథిగా రావడం గొప్పవిషయమే. - టైమ్ మ్యాగజీన్ బయటి వ్యక్తికోసం తీవ్రంగా వేటసాగించినా.. కంపెనీలోని వ్యక్తివైపే మైక్రోసాఫ్ట్ మొగ్గుచూపింది. తమ కస్టమర్లు క్లౌడ్వైపు దృష్టిసారించడంలో విజయంసాధించిన సత్య నాదెళ్లను ఎంచుకుంది. - వాషింగ్టన్ పోస్ట్ ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అధిపతులుగా ఉన్న భారతీయుల శక్తిసామర్థ్యాలు సత్య నాదెళ్ల ఘనతతో మరోసారి నిరూపితమయ్యాయి. 10 మంది భారతీయులు సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ కంపెనీల వ్యాపార విలువ దాదాపు 35,000 కోట్ల డాలర్లు కావడం గమనార్హం. ఇది గతేడాది భారత్ ఎగుమతులకంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఐటీ రంగంతోపాటు విదేశాల్లో ఇతరత్రా కంపెనీలకు చాలా మంది భారతీయులు అధిపతులుగా ఉన్నప్పటికీ.. కనీసం 12 అతిపెద్ద సంస్థలకు మనోళ్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లుగా కొనసాగుతున్నారు. కాగా, గతంలో కూడా సిటీ గ్రూప్(విక్రం పండిట్), మోటరోలా(సంజయ్ ఝా) లకు మనోళ్లు సీఈఓలుగా చేశారు. భారతీయులు.. భారీ జీతాలు పేరు కంపెనీ(సీఈఓ) వార్షిక ప్యాకేజీ సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ 1.8 కోట్ల డాలర్లు సంజయ్ ఝా గ్లోబల్ ఫౌండ్రీస్ 4.7 కోట్ల డాలర్లు (2013లో మోటొరోలాతో ఉన్నపుడు) ఇవాన్ మెండిస్ డియాజియో 1.7 కోట్ల డాలర్లు(2012) ఇంద్రా నూయి పెప్సీకో 1.26 కోట్ల డాలర్లు(2013) శాంతను నారాయణ్ అడోబ్ సిస్టమ్స్ 1.20 కోట్ల డాలర్లు (2012) అజయ్ బంగా మాస్టర్ కార్డ్ 1.13 కోట్ల డాలర్లు (2013) పియూష్ గుప్తా డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ 93.31 లక్షల డాలర్లు (2012) అన్షు జైన్ డాయిష్ బ్యాంక్(కో-సీఈఓ) 79.52 లక్షల డాలర్లు (2013) సంజయ్ మెహరోత్రా శాన్డిస్క్ 66.66 లక్షల డాలర్లు (2012) రాకేశ్ కపూర్ రెకిట్ బెన్కిసర్ 47.01 లక్షల డాలర్లు (2012) టాప్ సెర్చ్... సత్య మైక్రోసాఫ్ట్ సారథిగా సత్య పేరు వెల్లడికావడంతో సైబర్ ప్రపంచంలో ఆయన పేరు మార్మోగిపోయింది. ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ హాట్‌టాపిక్ ఆయనే. కేవలం అరనిమిషంలోనే గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ‘సత్య నాదెళ్ల’ పేరుతో 44 కోట్ల సెర్చ్ రిజల్ట్స్ ప్రత్యక్షం కావడం దీనికి నిదర్శనం. అంతేకాదు ఆయన పేరుతో 0.14 సెకండ్లో 1.28 కోట్ల వార్తా కథనాలు గూగుల్ న్యూస్‌లో పోస్ట్కావడం విశేషం. సైబర్ జగత్తులో ఇప్పటిదాకా నమోదైన అత్యధిక సెర్చ్‌ల రికార్డులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా(65 కోట్లు), బిల్ గేట్స్(48 కోట్లు) తర్వాత మూడోవ్యక్తిగా సత్య నిలవడం గమనార్హం. ఇదే టాప్ సెర్చ్ జాబితాలో రతన్ టాటా(40 లక్షలు), పెప్సీకో చైర్పర్సన్ ఇంద్రా నూయి(10 లక్షల కంటే తక్కువ)... సత్యకంటే ఆమడ దూరంలో ఉన్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా ఎంపికైన తర్వాత ఆయన పేరుమీద ఫేస్బుక్లో ఒక పేజ్ ఒపెన్ కావడం... దీనికి కొద్దిగంటల్లోనే 30 వేలకు పైచిలుకు ‘లైక్స్’ వెల్లువెత్తడం విశేషం. -
ఈజీ క్లెయిమ్‌కు ఇవి తప్పనిసరి
జీవిత బీమా పాలసీల్లో క్లెయిమ్ అనేది చాలా ముఖ్యమైన, సున్నితమైన అంశం. సకాలంలో క్లెయిమ్ మొత్తం అందకపోతే వారి బాధ మరింత పెరుగుతుంది. సాధారణంగా జీవిత బీమా పాలసీల్లో డెత్, మెచ్యూరిటీ, రైడర్స్ మూడు రకాలైన క్లెయిమ్లుంటాయి. మెచ్యూరిటీ క్లెయిమ్ అనేది పాలసీ కాలపరిమితి అయిన తర్వాత జరిగితే మిగిలిన రెండు ఏదైనా దురదృష్టకర సంఘటన చోటు చేసుకున్నప్పుడు సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ క్లెయిమ్‌లు పరిష్కరించడంలో జాప్యం జరుగుతుంది. పాలసీ తీసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవు. పూర్తి సమాచారం తప్పనిసరి... చాలా సందర్భాల్లో క్లెయిమ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సరైన సమాచారం లేకపోవడం, లేకుంటే పాత వివరాలుండటం. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు తప్పులు లేకుండా పూర్తి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ చిరునామా, ఫోన్ నంబర్లు మారితే వాటి వివరాలను తక్షణం బీమా కంపెనీకి తెలియచేయాలి. లేదంటే క్లెయిమ్ ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువ. సమాచారం దాచొద్దు... అనవసర భయాలతో కొంత సమాచారం దాచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. క్లెయింలు జాప్యానికి లేదా తిరస్కరించడానికి ఇదే ప్రధాన కారణం. పాలసీ ప్రపోజల్ ఫామ్‌లోనే ఆరోగ్య స్థాయి, వృత్తి, ఆహారపు అలవాట్లు, శారీరక వైకల్యాలు, ఇతర వివరాలన్నీ సక్రమంగా ఇవ్వాలి. పూర్తి సమాచారాన్ని ముందుగానే అందిస్తే క్లెయిమ్‌లలో జాప్యమయ్యే అవకాశాల్ని తగ్గించొచ్చు. నామినీ మరవొద్దు... పాలసీ తీసుకునేటప్పుడే నామినీ వివరాలు తప్పకుండా ఇవ్వాలి. అంతేకాక పాలసీ తీసుకున్న తర్వాత వాటి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేయాలి. ఒకవేళ పాలసీదారుడి కంటే నామినీ ముందుగా మరణిస్తే వేరే నామినీ వివరాలను అప్డేట్ చేయించడం మర్చిపోవద్దు. ధ్రువీకరణ పత్రాలుండాలి ఏదైనా క్లెయిమ్‌కు దాఖలు చేసేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అధీకృత పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికెట్, ఒకవేళ ఏదైనా చికిత్స తీసుకుంటే వాటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. సకాలంలో తెలియచేయండి క్లెయిమ్ త్వరగా పూర్తి కావడానికి ఆ సమాచారాన్ని ఎంత త్వరగా కంపెనీకి చేరవేశారనేది కూడా ముఖ్యం. అందుకే నిర్దేశిత కాలంలోగా క్లెయిమ్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు అవసరమైన అన్ని కాగితాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించడం మర్చిపోవద్దు. పాలసీ తీసుకుంటున్న బీమా కంపెనీ గత ఐదేళ్ల నుంచి క్లెయిమ్ పరిష్కారం ఏవిధంగా చేసిందనేది చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ తక్కువగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండటమే మంచిది. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు క్లెయిమ్ పరిష్కారాన్ని సరళతరం చేసే పనిలో ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ చెల్లింపులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి.