EPF Account Holder Must Add Nominee by Dec 31 2021, Details Inside- Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్‌కు ఇంకా 4 రోజులే గడువు..!

Published Mon, Dec 27 2021 5:20 PM | Last Updated on Thu, Dec 30 2021 2:29 PM

EPF Account Holder Must Add Nominee by Dec 31 2021, Details Inside - Sakshi

ఈపీఎఎఫ్‌ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాకు డిసెంబర్ 31, 2021 లోపు నామినీని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే బీమా డబ్బు, పెన్షన్ డబ్బుతో పాటుగా ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతారు. కొత్త నిబంధనల ప్రకారం, చందాదారుల ఆకస్మిక మరణం సంభవించినప్పుడు నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈపీఎఫ్ పొదుపును విత్ డ్రా చేయగలరు.

అలాగే, ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీం(ఈడిఎల్ఐ) ప్రయోజనాలను ఈపిఎఫ్ నామినేషన్‌లో పేర్కొన్న నామినీ మాత్రమే క్లెయిం చేసుకోవచ్చు. చందాదారులు ఒకరికంటే ఎక్కువ మంది నామినీలను కూడా జత చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ నామినీలందరి మధ్య వాటా శాతాన్ని కూడా నిర్ణయించవచ్చు. ఆన్‌లైన్‌లో ఖాతాదారులు నామినీని జతచేయవచ్చు. ఈపీఎఫ్ ఖాతాకు నామినీ ఏ విధంగా జత చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. 

  • ‎‎ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి.
  • ‎‎యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి.‎
  • మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
  • అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ‎ఈ-నామినేషన్ ఎంచుకోండి.‎
  • తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.‎
  • ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు.  
  • వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.‎
  • ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.‎
  • ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది.

(చదవండి: అదిరిపోయిన బ్రిటన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్‌‌‌‌లోనే!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement