
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్ సేవలు అందిస్తుంది. దీంతో చిన్న చిన్న పనుల కోసం ప్రతిసారీ ఈపీఎఫ్ఓ సంస్థ కార్యాలయానికి సందర్శించాల్సిన అవసరం లేదు. ఈపిఎఫ్ ఈ-నామినేషన్ సర్వీస్ అనేది అలాంటి ఒక కొత్త ఫెసిలిటీ, దీనిని ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్ఓ తన తాజాగా ట్వీట్ లో తెలిపింది. తాజా పీఎఫ్ నామినేషన్ లో పేర్కొన్న నామినీ పేరును ఫైనల్ గా పరిగణిస్తారు. అయితే ఖాతాదారుని తాజా నామినేషన్ తర్వాత ఇంతకు ముందు నామినేషన్ క్యాన్సిల్ చేసినట్లు పరిగణిస్తారు.
ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలను ప్రారంభించింది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారానే నామినీ జత చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువ పేర్కొన్న విధంగా చేయవచ్చు.
#EPF सदस्य मौजूदा EPF/#EPS नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.#EPFO #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/rm3G2FaqKy
— EPFO (@socialepfo) November 18, 2021
ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా..
- ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి.
- యుఎఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి.
- మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
- అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి.
- తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు.
- వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.
- ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.
- ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది.
(చదవండి: 2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ?)