EPF Account Holders Can Get Higher Pension With This New EPFO Guidelines - Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌ జారీ.. ‘అధిక పెన్షన్‌’కు ఏం చేయాలి?

Published Fri, Feb 24 2023 3:12 AM | Last Updated on Fri, Feb 24 2023 11:05 AM

EPF Account Holders Can Get Higher Pension With This New EPFO Guidelines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోని చందాదారులు, పెన్షన్‌దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్‌ చర్చనీయాంశమైంది. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఈపీఎఫ్‌ఓ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. ఈపీఎఫ్‌ఓ జోనల్‌ కార్యాలయాల్లోని అదనపు చీఫ్‌ ప్రావిడెంట్‌ కమిషనర్లు, ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసింది.

అయితే సర్క్యులర్‌లో వివరాలు వెల్లడించినప్పటికీ, అవి శాఖాపరమైన పరిభాషలో ఉండటంతో ఉద్యోగులు, పెన్షనర్లకు అర్థంకావడంలేదు. దీంతో అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈపీఎస్‌ (ఎంప్లాయిస్‌ పెన్షన్‌ స్కీం) కింద అధిక పెన్షన్‌ పొందే అంశంపై కొందరు ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల్లో సంప్రదిస్తుండగా, మరికొంతమంది సామాజిక మాధ్యమాల్లో నిపుణులను సంప్రదిస్తున్నారు. అధిక పెన్షన్‌ పొందడానికి చందాదారులు తమ వివరాలను unifiedportal emp. epfindia. gov. in/ epfo/ memberinterface లింక్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.  

అధిక పెన్షన్‌కు అర్హతలు ఇలా... 
►2014, సెప్టెంబర్‌ 1 కన్నా ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగి పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లించడంతోపాటు ఈపీఎస్‌ ఆప్షన్‌ను (ఈ ఆప్షన్‌ను ఈపీఎఫ్‌ఓ అధికారులు తిరస్కరించినా, స్పందించకున్నా) ఎంచుకొని ఉండాలి. ఈ రెండింట్లో ఏ ఒక్కటి లేకున్నా అధిక పెన్షన్‌కు అర్హత లేనట్లే. 

►1 సెప్టెంబర్‌ 2014 నుంచి 4 నవంబర్‌ 2022 మధ్య పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారిలో ఉద్యోగి, యజమాని ఇద్దరు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లించడంతోపాటు ఆ కాలంలో అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఇచ్చుకున్నా అర్హత సాధించినట్లే. ఇక్కడ పెన్షన్‌ ఆప్షన్‌ను ఈపీఎఫ్‌ఓ తిరస్కరించినా... స్పందించకున్నా అర్హత ఉన్నట్లే. 

►1 సెప్టెంబర్‌ 2014 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి కేవలం ఈపీఎఫ్‌ (ఉద్యోగి భవిష్యనిధి) పథకం మాత్రమే వర్తిస్తుంది. ఈపీఎస్‌ వర్తించదు. అదేవిధంగా 1 సెప్టెంబర్‌ 2014 కంటే ముందు ఈపీఎస్‌కు ఎలాంటి ఆప్షన్‌ ఇవ్వకుండా ఉద్యోగం మానేసిన వారు కూడా అనర్హులే. 

►నిర్దేశిత తేదీ నాటికి అధిక పెన్షన్‌కు అర్హత ఉన్నా.. పదవీ విరమణ పొందిన ఉద్యోగి మరణిస్తే అధిక పెన్షన్‌ ప్రయోజనం సదరు ఉద్యోగి కుటుంబానికి వర్తిస్తుందా? లేదా? అనే అంశంపై అధికారులు వివరించడం లేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement