చావు పుట్టుకలు చెప్పిరావు.. చావే వస్తే మనం కూడబెట్టిన కొద్ది మొత్తం డబ్బు ఏమౌతుంది.. ఆ డబ్బు మన తర్వాత ఉన్నవాళ్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి.. స్టాక్‌మార్కెట్‌లో మదుపు చేయాలని చాలా మంది అంటుంటారు. దీర్ఘకాలంగా అందులో మదుపుచేసిన వారు చనిపోతే ఆ డబ్బు ఎవరికి చెందుతుంది.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.. ప్రభుత్వం అందుకు విధిస్తున్న గడువులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించాలని చాలా మందికి ఉంటుంది. దాంతో అందులో మదుపు చేస్తూంటారు. కానీ చివరకు ఏదైనా జరిగి వారు మరణిస్తే ఆ డబ్బు ఎవరికీ కాకుండా అలా ఉండిపోతుంది. కానీ ఆ సంపద ఎవరికి చెందాలో నామినీగా వారి వివరాలను డీమ్యాట్ అకౌంట్‌కు జతచేయాలి. ఫలితంగా ఖాతాదారుడు చనిపోయినా నామినీ వెళ్లి ఆ డబ్బును తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీల పేర్లు నమోదు చేయడానికి గడువు 2024 జూన్ 30 వరకు పొడిగిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 వరకు మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల నామినీల పేర్లు నమోదు చేసేందుకు డెడ్ లైన్ విధించింది. కానీ ఆ తేదీని పొడగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది
‘మార్కెట్ భాగస్వాముల నుంచి అభ్యర్థనలు, ఇన్వెస్టర్ల సౌకర్యార్థం డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ మదుపర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేందుకు గడువు పొడిగించాం’ అని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేలా ప్రోత్సహించాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు.. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లను (ఆర్టీఏ) సెబీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment