![why we need add nominee Mutual Funds deadline to end soon - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/MFs%20Nominee.jpg.webp?itok=dWVmbPEs)
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు నామినేషన్ సమర్పించేందుకు ఇచ్చిన గడువు మార్చి 31తో ముగియనుంది. ఎవరినైనా నామినీగా నమోదు చేయడం లేదంటే, నామినేషన్ ఆప్ట్ అవుట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడం తప్పనిసరి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇన్వెస్టర్ ఎంపిక చేసుకోకపోతే గడువు ముగిసిన తర్వాత వారి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులన్నీ స్తంభనకు గురవుతాయి. దాంతో పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు.
ఫండ్స్ పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాలకు నామినేషన్ లేదా నామినేషన్ వద్దంటూ డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ సెబీ 2022 జూన్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జూలై ఆఖరి వరకు గడువు ఇవ్వగా.. అక్టోబర్ వరకు పొడిగించారు. అప్పటికే పెట్టుబడులు కలిగిన వాటికి నామినేషన్ సమర్పించేందుకు 2023 మార్చి 31 వవరకు గడువు ఇచ్చింది. నామినేషన్ లేకుండా పెట్టుబడిదారు మరణించినట్టయితే.. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వారసులు లేదా కుటుంబ సభ్యులు క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా నామినేషన్‌ను సెబీ తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment