Banking Laws Amendment Bill: ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు | Banking Laws Amendment Bill introduced in Lok Sabha | Sakshi
Sakshi News home page

Banking Laws Amendment Bill: ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు

Published Sat, Aug 10 2024 6:05 AM | Last Updated on Sat, Aug 10 2024 9:37 AM

Banking Laws Amendment Bill introduced in Lok Sabha

లోక్‌సభలో బ్యాంకింగ్‌ సవరణ బిల్లు  

న్యూఢిల్లీ: ప్రభుత్వం బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది. ఒక బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను ప్రస్తుతమున్న ఒకటి నుండి నలుగురికి పెంచడంసహా పలు కీలక అంశాలకు సంబంధించిన  ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి ప్రవేశపెట్టారు.

 డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ, సేవల విస్తృతి బిల్లు ప్రధాన లక్ష్యం. అన్‌క్టైమ్డ్‌ డివిడెండ్లను ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌కు బదలాయించడం, బ్యాంకింగ్‌ పరిపాలనా, ఆడిట్‌ వ్యవహారాల్లో మరింత మెరుగుదలకూడా ఈ బిల్లు దోహదపడనుంది. డైరెక్టర్‌íÙప్‌లకు సంబంధించిన వడ్డీ పరిమితిని పునరి్నర్వచించటానికి సంబంధించిన అంశం బిల్లులో మరో కీలకాంశం.   దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచడం దీని ఉద్దేశం.  2024–25 వార్షిక బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన ఈ బిల్లును గత వారం క్యాబినెట్‌ ఆమోదించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement